Wednesday, June 23, 2010

జైలు, ఇల్లు.... ఏదైతేనేం !!

 తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు పండితులు, కవి. అంతేకాదు ఆయన దేశభక్తులు కూడా ! స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో అనేక సార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చారు.


ప్రముఖ రచయిత మునిమాణిక్యం నరసింహారావుగారికి శివశంకర శాస్త్రిగారంటే గౌరవం, అభిమానం.



ఒకసారి ఆయన శాస్త్రిగారిని బందరు వచ్చి తన ఇంట వారం రోజులైనా వుండాలని కోరారు. తల్లావఝుల వారు తనకు వీలు పడదన్నారు. అయినా మునిమాణిక్యం గారు విడిచిపెట్టలేదు. ఏమైనా తనకోసం నాలుగురోజులైనా కేటాయించాలని పట్టుబట్టారు.

దానికి శివశంకర శాస్త్రిగారు " నేనేట్లాగూ జైలుకి వెడుతూనే వున్నాగా ! ఇప్పుడు బందరు రాకపోతేయేమి ? " అన్నారట.

Vol. No. 01 Pub. No. 329

4 comments:

  1. * రామనరసింహ గారూ !
    ' కదంబం ' అంటే వివిధ పుష్పాలతో అల్లిన మాల. ' నా గురించి ' పేజీలో నా గురించి చూడవచ్చు. అంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా వివరాలు కావాలంటే నాకు మెయిల్ చెయ్యవచ్చు.

    * సంతోష్ గారూ !
    * మాధురి గారూ !
    * సంతోష్ దోసపాటి గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  2. రామనరసింహ గారూ !
    మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను జర్నలిస్ట్ ని కాను. నా ప్రొఫైల్ చూసి వుంటారు. ఇంతకుముందు ఏ ఆర్టికల్ ప్రచురించలేదు. నాకోసం నా బ్లాగులోనే రాసుకుంటున్నాను. ఇంతకుముందు జ్యోతి గారి ప్రోత్సాహంతో B & G కోసం రెండు, తెలుగు పీపుల్ డాట్ కామ్ కి ఒకటి రాసాను. అంతే ! నేను ఇతరులకు రాయాలంటే కొంచెం సంశయిస్తాను, వాళ్లకి నచ్చుతుందో లేదోనని. నా బ్లాగులోనయితే నాకు ఇష్టమైనది రాసేస్తాను. నచ్చిన వాళ్ళు చదువుతారు. లేకపోతే లేదు. ఎవరికీ ఇబ్బంది వుండదు.

    ReplyDelete