Sunday, June 13, 2010

పాట పాడిన నిర్మాత, నటుడు - జవాబు

  కనుక్కోండి చూద్దాం - 18 
 జవాబు 

 ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చిన ముగ్గురికీ ( శ్రీరాం గారు, కె.కె. గారు, అజ్ఞాత గారు ) , ప్రయత్నించిన మాదురిగారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే face book ద్వారా
"sterday question answer entandi?
m.s rama rao gaara?"
అంటూ జవాబు ఇచ్చిన సంతోష్ దోసపాటి గారికి కూడా ధన్యవాదాలు.

ఇక జవాబు విషయానికి వస్తే........
* శ్రీరాం గారూ ! - రామానాయుడు గారు తమ స్వంత చిత్రాల్లో ఎక్కువగా అతిథి పాత్రలు ధరించారు. కానీ పాటలేమీ పాడలేదు.
* కె. కె. గారూ ! - బి. ఏ. సుబ్బారావు గారు కూడా పాటలు పాడలేదండి.
* సంతోష్ గారూ ! - ఎం.ఎస్. రామారావు గారు గాయకుడే గానీ నిర్మాత - నటుడు కాదండి. 
* అజ్ఞాత గారూ ! - ముందుగా మీ పేరు కూడా రాసి వుంటే బాగుండేది. మీరు చెప్పిన సమాధానం సరైనదే ! ఆ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య గారే !



పుండరీకాక్షయ్య గారు మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, ఆరాధన ( NTR ) వంటి చిత్రాలు నిర్మించారు. పల్లెటూరు చిత్రంతో ప్రారంభించి కొన్ని చిత్రాలలో వేషాలు వేసినా, 1991 లో వచ్చిన కర్తవ్యం లో ముద్దుకృష్ణయ్య పాత్రతో విలన్ గా, కారెక్టర్ నటునిగా పేరు తెచ్చుకున్నారు.  





Vol. No. 01 Pub. No.319

4 comments:

  1. SR Rao గారు
    నటుడు మోహన్ బాబు కూడా నిర్మించి నటించిన
    "అప్పుచేసి పప్పుకూడు" సినిమాలో పాటపాడాడు

    ReplyDelete
  2. Mohan Babu naa? EDiSaaDu, vaaDi paaTa , naa paaTa okaTE!

    ReplyDelete
  3. while browzing for the singer of the song, I came across the name ' atluri' but didn't make an effort to know if he was also a producer and actor.I donot know him as an actor also, though I've seen many old movies. If possible, please mention his roles in a few films along with the names of the films.

    MS Ramarao sang a song in 'pichhi pullaiah'. But I was sure he was not a producer and an actor.

    ReplyDelete
  4. మాధురి గారూ !
    పుండరీకాక్షయ్య గారు ఈ క్రింది చిత్రాల్లో నటించారు. పాత్రలు అన్నీ ఖచ్చితంగా చెప్పలేను
    1952 - పల్లెటూరు
    1953 - అమ్మలక్కలు
    1953 - పిచ్చిపుల్లయ్య
    1954 - తోడుదొంగలు - పనివాడు
    1955 - జయసింహ
    ఆ తర్వాత 1991లో 'కర్తవ్యం ' వరకూ నటించిన దాఖలాలు లేవు. అందులో విలన్ ముద్దుక్రిష్ణయ్య పాత్రతో మళ్ళీ ప్రారంభించి రాజేశ్వరి కళ్యాణం, ప్రాణదాత, పోలీసు బ్రదర్స్ మొదలైన చిత్రాల్లో నటించారు.

    ReplyDelete