Sunday, June 13, 2010

కళ్ళు తెరువరా నరుడా !

 పువ్వుల సూరిబాబు గారు ప్రముఖ రంగస్థల నటుడు. సూరిబాబు అనేక పౌరాణిక నాటకాల్లో నటించారు. అంతేకాక మాలపిల్ల (1938), రైతు బిడ్డ (1939), తారా శశాంకం (1941),  శ్రీకృష్ణ తులాభారం (1955), సతీ సావిత్రి (1957), కృష్ణ లీలలు (1959), శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960), దక్షయజ్ఞం (1962) వంటి కొన్ని చిత్రాల్లో నటించడమే కాక కొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడారు.

ఆయనది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలో ఆయన పాడిన పాటను తెలుగు భాషోద్యమానికి కృషి చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు తమ వ్యాఖ్యలో గుర్తుచేశారు...............

Nrahamthulla said... 
రావు గారూ
కొత్త విషయాలు తెలియజేస్తున్నారు.చాలా సంతోషం.నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన "వేంకటేశ్వర మహత్యం" సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి"కళ్ళుతెరవరా నరుడా" అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ. 


.............. ఇదీ రహమతుల్లా గారి వ్యాఖ్య. కొంతకాలం క్రితం వరకూ ఈ పాట ఆకాశవాణిలో తరచుగా వినిపించేది. నా దగ్గరున్న ఆ పాట ఆయన కోసం, అందరి కోసం...........



Vol. No. 01 Pub. No.320

10 comments:

  1. రావు గారూ, ధన్యవాదాలు.

    ReplyDelete
  2. రావుగారూ
    భగవంతుడు ఎవరిని ఎందుకు పరిచయం చేస్తాడోగదా? నాకు ఈ పాట మీద్వారా దొరికింది.మళ్ళీ నా బాల్యం లోకి పంపారు.ఎంతమంచిపాటండీ.ఈ పాటను నేను డౌన్ లోడ్ చేసుకోవటం ఎలాగో తెలియదు.దీనిని ఎంపీ౩ ఫైల్ గా నాకు మైల్ చేయగలరా?
    ఈ పాటను ఓల్డ్ తెలుగు స్సాంగ్స్ గ్రూప్ లో కూదా ఉంచండి.ధన్యవాదాలు.

    ReplyDelete
  3. కళ్ళు తెరువరా నరుడా
    నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
    కలిమిలేములకు కష్టసుఖాలకు
    కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]
    వేపనువిత్తి ద్రాక్షకోసమై
    వేడుక పడుట వెర్రికదా
    కాలికి రాయి తగులుటకన్న
    రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]
    కమలనాభుని పదకమలములే
    కలుష జలధికీ సేతువురా
    కలిమాయలలో కలతజెందినా
    ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]

    ReplyDelete
  4. Great Rare song by Suribabu.
    I think the song is tuned in
    Raga Keeravani ?? Can some music lover clarify?

    ReplyDelete
  5. రావుగారూ
    పాట పంపినందుకు కృతజ్నతలు . సూరిబాబు,రఘురామయ్య,ఎ.వి.సుబ్బారావు మన తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యాలు.వారు పాడిన పాడిన పాటలు పద్యాలు ఓల్డ్ తెలుగు సాంగ్స్ గ్రూప్ లో లేనివి మీ వద్ద ఏమైనా ఉంటే వెలుగులోకి తెండి.

    ReplyDelete
  6. శ్రీనివాస్ గారూ,రావుగారూ
    అప్పట్లో నేనే రంగారావుగారిని ఈ పాట కావాలని అడిగాను.అది దొరక్కపోవచ్చు అన్నారు.అందుకే అలా రాశాను.ఇప్పుడు మీరిచ్చిన సమాచారం ప్రకారం మట్టిరికార్డులు చాలామంది దగ్గరున్నాయి.అయితే ఇలాంటి అపురూపమైన పాటలదృశ్యాలు పునరుధ్ధరణ కోసం ఎక్కడైనా దొరకొచ్చా?అవి పూర్తిగా పోయినట్లేనా?
    మట్టి రికార్డులను డిజిటైజ్ చేసే పరిజ్నానం ఏ సంస్థ దగ్గర ఉంది?

    ReplyDelete
  7. రావుగారూ
    old telugu songs లో ఈ ఏడు పాటలు మాత్రమే ఉన్నాయి.మిగతావి శ్రీనివాస్ గారి దగ్గర మట్టి రికార్డులు ఉండి ఉండవచ్చు.వాటిని డిజిటైజ్ చేసే పరిజ్ఞానం, సమయం లేదు అన్నారు కాబట్టి మీకు దొరికినవాటిని వినే భాగ్యం కలిగించండి.లిరిక్ విన్నవాళ్ళు రాసేస్తారు.ఆనాటి తెలుగు సంగీతంతో పాటు సాహిత్యమూ మట్టిలో కలిసిపోకుండా కాపాడుతున్న మీ అందరికి ధన్యవాదాలు.
    dEvuni mahima Kanakatara 1937
    lEvE pErunakenniyO matamulu Malapilla 1938
    kollAyi kaTTite Emi Malapilla 1938
    lE rA lErA nidura mAni Malapilla 1938
    eMta ghOra pAtakamE Tara Sasankam 1941
    mAlalu mAtramu manujulu gArA Malapilla 1938
    manajula vibhajanamu Malapilla 1938

    ReplyDelete
  8. భూలోకంలో యమలోకం సినిమాలో ఏ.వి.సుబ్బారావు గారి పద్యాలు పాతబంగారం( http://pathabangaram.com/forums/viewtopic.php?f=13&t=2162 )లో అందించారు.
    ఈలపాట రఘురామయ్యగారి పాటలు పద్యాలు భక్తమార్కండేయ తదితర సినిమాల్లో ఉన్నాయి. బ్లాగరులకు వినిపించగలరు.

    ReplyDelete
  9. రహమతుల్లా గారూ !
    మీ ఆసక్తికి, కృషికి జోహార్లు. ఏ. వి. సుబ్బారావు గారి పద్యాల లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రఘురామయ్య గారి పద్యాలు నా దగ్గర కొన్ని వున్నాయి. భక్త మార్కండేయ కూడా cassette లో వుండాలి. వీలు చూసుకుని తప్పక అందిస్తాను.

    ReplyDelete