Wednesday, June 16, 2010

' నేను ' - మీ కోసం

' నేను ' అనే ఈ లఘు చిత్రం విజువల్ కమ్యూనికేషన్స్ ( బి.ఎస్సీ. ) మొదటి సంవత్సరం పూర్తిచేసి రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన మా అబ్బాయి ఉదయ్ తన మిత్ర బృందంతో కలసి నిర్మించాడు. ఆ బృందంలోని అందరి వయసూ దాదాపుగా 18 సంవత్సరాలే ! ఇప్పుడిప్పుడే లోకాన్ని అర్థం చేసుకుంటున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్న తమ ఫేకల్టీ వి గానీ, సుమారు 25 సంవత్సరాల అనుభవమున్న నావి గానీ సలహాలు, సూచనలు తీసుకోకుండా పూర్తిగా తామే స్వంతంగా నిర్మించిన ఈ చిన్న సినిమా వారికి తొలి అడుగు. అది తప్పటడుగో, తప్పుటడుగో మిత్రులు, పెద్దలు చెప్పాలి. వాళ్ళు చదువుతున్నది విజువల్ కమ్యూనికేషన్స్. సమాజంలోని అనేక కోణాలను, అనేక సమస్యలను అందరికీ అర్థమయ్యే విధంగా దృశ్య రూపంలో అందించాల్సిన బాధ్యత కలిగిన వృత్తులలోకి భవిష్యత్తులో ప్రవేశించాల్సిన వాళ్ళు. మీ అందరి అభిప్రాయాలు, విమర్శలు, సలహాలు, సూచనలు వారి భవితకు సోపానాలు కాగలవనే వుద్దే్శ్యంతో ఈ చిన్ని చిత్రాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. అందుకే ఈ చిత్రం చూసాక ఉదాసీనంగా వెళ్ళిపోక మీకు కనిపించిన లోపాలు, మెరుగు పరచుకోవడానికి మీరిచ్చే సూచనలు మిత్రులందరూ దయచేసి నిర్మొహమాటంగా తెలియజేస్తారని ఆశిస్తూ.... అవే వాళ్ళకు దీవెనలు కావాలని కోరుకుంటూ...........మీకోసం... మీ ఆశీస్సులకోసం.....   
       
  నేను  
























Vol. No. 01 Pub. No. 324

5 comments:

  1. బాగుందండి. వాళ్ళభావాలను వాళ్ళే తెలియచెప్పాలనుకున్నారేమొ. అందుకే ఎవరి సలహా తీసుకొలేదు. చక్కగానే వ్యక్తీకరించారు. ఈ రోజుల్లో యువత తమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినా ఇంకా ఈ మార్పు రావాల్సిన పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంది. అటువంటివారికి ఇది ఉపయోగపడుతుంది. ముందు ముందు ఇంకా మంచి చిత్రాలు వీళ్ళు చేయగలరు. వీరందరికీ నా అభినందనలు అందజేయండి.

    ReplyDelete
  2. ఈ చిత్రాన్ని నవతరంగం , షార్ట్జ్ ... వంటి సైట్లకి సమీక్షకి పంపించారా ...

    ReplyDelete
  3. When I saw the film I got a feeling that your son must have been the key person of the film. I also felt the film was shot at your home. Am I right? I noticed the picture of an elderly, traditional woman in the film.

    ReplyDelete
  4. మాధురి గారూ !
    మీ సునిశిత పరిశీలనకు జోహార్లు. అయితే మా ఇంట్లో shoot చెయ్యలేదండీ ! నా ఎదురుగా చెయ్యడానికి ఫీల్ అయ్యాడేమో, వైజాగ్ ఫ్రెండ్స్ తో వెళ్లి మా అత్తగారింట్లో చేసాడు. మీ పరిశీలనా దృష్టి అమోఘం. ఆ దృష్టితో చూసి, ముఖ్యంగా కాన్సెప్ట్ మీద మీ విశ్లేషాత్మక వ్యాఖ్య రాయొచ్చు కదా !

    ReplyDelete
  5. thanks for the encouraging words.

    ReplyDelete