Friday, June 11, 2010

చైనా ప్రధానిని మెప్పించిన తెలుగు యముడు

తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్ర ఘనమైనది. కృష్ణుణ్ణీ, రాముణ్ణీ తలుచుకోగానే మన కళ్ళముందు ఎన్టీయార్ రూపం ప్రత్యక్షమైనట్లు రావణుడు, ధుర్యోధనుడు, యమధర్మరాజు లాంటి పాత్రలకు ఎస్వీరంగారావు రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అసలు వాళ్ళు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారేమోననిపిస్తుంది.

1957 లో కడారు నాగభూషణం దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సత్యవంతునిగా, ఎస్. వరలక్ష్మి సావిత్రిగా వచ్చిన ' సతీసావిత్రి ' చిత్రంలో యముడిగా ఎస్.వి. రంగారావు నటించారు. ఆ చిత్రం జెమినీ స్టూడియోలో నిర్మించబడింది.



అప్పట్లో చైనా ప్రధానిగా వున్న చౌ-ఎన్-లై  ఆ సమయంలోనే మద్రాసు సందర్శించారు. అందులో భాగంగా ఆయన జెమినీ స్టూడియోకు కూడా వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ' సతీసావిత్రి ' షూటింగ్ జరుగుతోంది. ఎస్. వి. రంగారావు గారు యముడి గెటప్ లో వున్నారు. చౌ-ఎన్-లై కి ఆ ఆహార్యం ఆసక్తి కలిగించింది. వివరాలడిగారు. జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ ఆయనకు ఎస్. వి. రంగారావుని పరిచయం చేస్తూ " ఈయన గ్రేట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈయన వేసినది ఆయువు మూడినపుడు మనుష్యుల ప్రాణాలు హరించే దేవుడి వేషం "  అని వివరించారు.

దానికి చౌ-ఎన్-లై ఆశ్చర్యంగా  " మీ దేశంలో ప్రాణాలు తియ్యడానికి కూడా ఓ దేవుడున్నాడా ? " అంటూ ఎస్వీఆర్ కి అభినందనలు తెలుపుతూ " నన్ను మాత్రం కొంతకాలం ఈ భూమ్మీద వుండనివ్వండి " అని నవ్వుతూ చమత్కరించారు.


Vol. No. 01 Pub. No. 317

3 comments:

  1. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణJune 11, 2010 at 11:07 AM

    good info sir

    ReplyDelete
  2. What is speciality/greatness of that China draconian politician?

    A boul of boiled frog-legs would have made impressed him more! :P

    ReplyDelete
  3. * లక్ష్మీనారాయణ సునీల్ గారూ !
    ధన్యవాదాలు

    * అజ్ఞాత గారూ !
    అంత పెద్ద దేశానికి ప్రధాని కావడం ప్రత్యేకత అయితే మన దేవుడి వేషానికి ఆ మహానటుడ్ని ప్రశంసించడం గొప్పతనం అని నేననుకుంటున్నాను. ఏమైనా మీ స్పందనకు మాత్రం ధన్యవాదాలు.

    ReplyDelete