అధికారానికి సృజనాత్మకతకు సరిపడదేమో !
లలిత కళలు, వాటికి సంబంధించిన విభాగాలు ప్రభుత్వాధీనంలో వుంటే వాటి పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కరలేదు. అధికారం, అలసత్వం, అవినీతి, బంధుప్రీతి వగైరా అవలక్షణాలన్నీ చెరుకుకు పట్టిన చెదల్లా లలిత కళల్లో వున్న తీపిని పీల్చేసి మనకి పిప్పిని మిగులుస్తాయి. గతంలో ప్రభుత్వ అకాడెమిలు, వాటి పనితీరు తెలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవమే ! అలాగే ప్రభుత్వ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్ విషయం చెప్పనక్కర్లేదు. అందరూ ఇదే పద్ధతిలో ఉంటారని చెప్పలేం గానీ ఆ విభాగాల అధికారులలో చాలామంది తమ అలసత్వానికి, అవినీతికి ప్రభుత్వ నియమనిబంధనలను అడ్డు పెట్టుకుంటారు. కొంతమందికి సృజనాత్మకత లేకపోయినా ఇతర కారణాలవలన ఆ స్థానానికి చేరుకుని యాంత్రికంగా విధులు నిర్వహిస్తుంటారు. కానీ ఈ విభాగాల్లో సృజనాత్మకత తప్ప యాంత్రికత పనికిరాదు.
అలాంటి యాంత్రికత, నియమ నిబంధనలు సృజనాత్మకతకు ఎలా అడ్డు వస్తాయి అనేదానికి ఒక ఉదాహరణ.......
ప్రముఖ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒకసారి ఆకాశవాణికి ఒక కవిత పంపించారు. అందులో ఒక పంక్తిలో ' ఒడిలో బొచ్చుకుక్క పిల్ల ' అంటూ రాసారట. ఆ కవితలో ' బొచ్చు ' అనే పదం ఆ రేడియో కేంద్ర అధికారులకు అభ్యంతరకరంగా తోచింది. అందుకని ఆ మాట తీసేయ్యమన్నారట. తిలక్ గారికి అందులో అభ్యంతరమేమిటో అర్థం కాలేదు.
" బొచ్చు కుక్క పిల్లను బొచ్చు కుక్క పిల్ల అనక ఒట్టి కుక్కపిల్ల అంటారా ? "
అని చిరాకు పడ్డారట.
Vol. No. 02 Pub. No. 013
Showing posts with label మనసులో మాట. Show all posts
Showing posts with label మనసులో మాట. Show all posts
Wednesday, August 25, 2010
Saturday, August 14, 2010
స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి
పరతంత్ర పాలనలో మగ్గిన భారతజాతి స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుని 63 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఎన్నెన్నో పంథాలు, పోరాటాలు, విధానాలు, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు.......
వెరసి పరాయి పాలకుల పలాయనం, స్వతంత్ర్య బారతదేశ ఆవిర్భావం
స్వాతంత్ర్యోద్యమం కేవలం పరాయిపాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదు
మన హక్కులు, మన సంపద, మన సంస్కృతి కాపాడుకోవడానికి జరిగిన ఆత్మగౌరవ పోరాటం
రాజ్యంలోని మానవులందర్నీ సమానంగా చూడలేని రాజు... రాజు కాడు
సమాజంలోని తోటి మనుష్యుల్ని తమతో సమానంగా చూడలేని ప్రజలు... ప్రజలు కారు
రాజరికంలో యథా రాజా తథా ప్రజా
ప్రజాస్వామ్యంలో యథా ప్రజా తథా రాజా
ఇది స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి మనకు నేర్పించింది
ఇవే హక్కుల్ని రాజ్యాంగం మనకు ప్రసాదించింది
మన హక్కుల్ని మనమెంతవరకూ కాపాడుకుంటున్నాం ?
మన అధికారాల్ని మనమెంతవరకూ ఉపయోగించుకుంటున్నాం ?
ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండరు...సేవకులే అందరూ ....
మరి సేవకుల్ని పాలకులుగా ఎందుకు భావిస్తున్నాం ?
బ్రిటిష్ వలస పాలనలో 200 ఏళ్ళు మగ్గిన మనలో ఆ బానిస భావాలు పోలేదా ?
ఇంకా ఎన్ని తరాలు ఆ భావ దారిద్యంలో మగ్గాలి ? దానినుండి ఈ జాతికి విముక్తి లేదా ?
నవ భావాల ... ఆధునిక యువతరమైనా ఈ బానిస భావాలను చేదిస్తుందా ?
డబ్బు సంపాదనా మార్గాల అన్వేషణలో పడి కర్తవ్యం మరచిపోతుందా ?
వ్యక్తి కంటే సమాజం ముఖ్యమని నవతరం గుర్తిస్తే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను చూడవచ్చు
సమాజం బాగుంటేనే మనం హాయిగా, స్వేచ్చగా జీవించగలమని యువత గుర్తించాలి
నా కుటుంబం, నా బాగు, నా సంపాదన, నా సరదాలు అనే పరిధిని దాటి ఆలోచించాలి
అప్పుడే స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు నిజమైన విలువ నిచ్చినట్లవుతుంది
అప్పుడే సమసమాజ, నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది
విభజించి పాలించు సూత్రాన్ని పాటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అప్పటివరకూ ఒకే జాతిగా వున్న భారతీయుల్ని రెండుగా విడదీసింది . 63 ఏళ్ళు గడిచినా ఆ బేధాలు సమసిపోలేదు. సరిగదా మన నాయకులు ఈ బ్రిటిష్ సూత్రాన్ని బాగా వంటపట్టించుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా నవతరం మేల్కొని ఇలాంటి కుత్సిత, స్వార్థపూరిత నాయకులకు మంగళం పాడకపోతే మన జాతిలో మరో ముసలం పుడుతుంది.
64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో ....................
స్వాతంత్ర్యం సిద్ధించిన పరిణామ క్రమం చూడండి..............
Vol. No. 02 Pub. No. 001
Wednesday, June 16, 2010
' నేను ' - మీ కోసం
' నేను ' అనే ఈ లఘు చిత్రం విజువల్ కమ్యూనికేషన్స్ ( బి.ఎస్సీ. ) మొదటి సంవత్సరం పూర్తిచేసి రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన మా అబ్బాయి ఉదయ్ తన మిత్ర బృందంతో కలసి నిర్మించాడు. ఆ బృందంలోని అందరి వయసూ దాదాపుగా 18 సంవత్సరాలే ! ఇప్పుడిప్పుడే లోకాన్ని అర్థం చేసుకుంటున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్న తమ ఫేకల్టీ వి గానీ, సుమారు 25 సంవత్సరాల అనుభవమున్న నావి గానీ సలహాలు, సూచనలు తీసుకోకుండా పూర్తిగా తామే స్వంతంగా నిర్మించిన ఈ చిన్న సినిమా వారికి తొలి అడుగు. అది తప్పటడుగో, తప్పుటడుగో మిత్రులు, పెద్దలు చెప్పాలి. వాళ్ళు చదువుతున్నది విజువల్ కమ్యూనికేషన్స్. సమాజంలోని అనేక కోణాలను, అనేక సమస్యలను అందరికీ అర్థమయ్యే విధంగా దృశ్య రూపంలో అందించాల్సిన బాధ్యత కలిగిన వృత్తులలోకి భవిష్యత్తులో ప్రవేశించాల్సిన వాళ్ళు. మీ అందరి అభిప్రాయాలు, విమర్శలు, సలహాలు, సూచనలు వారి భవితకు సోపానాలు కాగలవనే వుద్దే్శ్యంతో ఈ చిన్ని చిత్రాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. అందుకే ఈ చిత్రం చూసాక ఉదాసీనంగా వెళ్ళిపోక మీకు కనిపించిన లోపాలు, మెరుగు పరచుకోవడానికి మీరిచ్చే సూచనలు మిత్రులందరూ దయచేసి నిర్మొహమాటంగా తెలియజేస్తారని ఆశిస్తూ.... అవే వాళ్ళకు దీవెనలు కావాలని కోరుకుంటూ...........మీకోసం... మీ ఆశీస్సులకోసం.....
నేను
Vol. No. 01 Pub. No. 324
Wednesday, April 14, 2010
పిల్లలతో ఆట
బాల్యం ఎంత మధురమైనది
పెద్దతనంలో తీపి జ్ఞాపకాల్నిస్తుంది
మరి ఆ బాల్యంలో మాధుర్యం నేడు కరువైపోతోంది
పెద్దతనానికి చేదు జ్ఞాపకాలే మిగులుస్తోంది
బాల కార్మికులను రక్షించడానికి చట్టాలున్నాయి
మరి ఈ బాల కార్మికులను రక్షించడానికి ఏ చట్టాలున్నాయి ?
తమ పిల్లల్ని హింసిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు
తల్లిదండ్రులే హింసిస్తే ఆ పిల్లల్ని కాపాడేవారెవరు ?
ఆడుతూ పాడుతూ చదువుకుని బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలా ?
ఆటా పాట అంటూ తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోవాలా ?
తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలా ?
తమ తాత్కాలికావసరాల కోసం వారి భవిష్యత్తును తాకట్టు పెట్టాలా ?
ఒకప్పుడు పిల్లలకు తెరమీద నటించే అవకాశం రావడం అదో అద్భుతం
తమ పిల్లలని నటింపజేయడం ఓ సరదా ! పిల్లలే పూర్తిగా నటించిన సినిమాలు చాలా తక్కువ. కేవలం ఒకటి రెండు సీన్లుకే పరిమితమయ్యేవారు. అరుదుగా అక్కడక్కడా పూర్తి నిడివి బాల పాత్రలుండేవి.
వాటిల్లో నటించే పిల్లలు ఎక్కువగా సినీ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలే అయ్యేవారు. లేదా కొంతమంది ఉత్సాహంకొద్దీ తమ పిల్లల్ని ఒకటి లేక రెండు సినిమాల్లో నటింపజేసేవారు. వారి భవిష్యత్తుకు ఆటంకం కలగడానికి అప్పటి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడేవారు కాదు. అయితే డబ్బు కోసం పిల్లల్ని సినిమాల్లో నటించడానికి పంపే తల్లిదండ్రులు ఆ రోజుల్లో కూడా వున్నా ఆర్థికంగా ఇబ్బందులుండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపని చేసేవారే ఎక్కువగా వుండేవారు.
కానీ ఇప్పుడు బుల్లి తెరనిండా నాట్యం చేస్తున్న పిల్లలే ! అవి నాట్యాలనడం కంటే విన్యాసాలనడం మేలేమో ! ఇవి చేస్తున్న పిల్లలకు తాము చేస్తున్నది ఏమిటో అవగాహన వుందా ? ఏ లక్ష్యం కోసం ఆ పని చేస్తున్నారో వారికి తెలుసా ? భవిష్యత్తులో వీటి ప్రభావమేమిటో వారికి అవగాహన వుందా ? ఎవరికోసం తాము ఈ కసరత్తులు చేస్తున్నామో వారికి అర్థమవుతుందా ? ముమ్మాటికీ కాదు . ఇవేమీ వాళ్లకు తెలీదు. అర్థమయ్యేంత జ్ఞానం వారికి వుండదు. ఈ ఆట పాటా కార్యక్రమాల్లో బహుమతులు గెలుచుకున్న పిల్లలకు అదే వృత్తి కాగలదా ? ఒకవేళ అయినా ఎంతకాలం ఆ వృత్తిలో వుండగలరు ? ఎంత డబ్బు సంపాదించగలరు ? అసలు అంతమంది విజేతల్లో ఎంతమంది తమ గమ్యస్థానం అనుకునే సినిమా రంగానికి చేరుకోగలుగుతున్నారు ?
హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో శిక్షణ పేరుతో హింసకు గురవతూ అందమైన బాల్యాన్ని తాకట్టు పెట్టుకోవడం అవసరమా ?
అనారోగ్యం చేసినా, కదలలేని పరిస్థితుల్లో వున్నా పోటీలకు తయారు చెయ్యడం కోసం వాళ్ళని హింసించే తల్లిదండ్రులు,
బహుమతి రాకపోతే నిన్ను ఏం చేస్తానో చూసుకో అని బెదిరించే తల్లిదండ్రులు, ఓడిపోతే కెమెరా ఎదురుగా మేమేం బాధపడటంలేదని, కృషి చేసినా అదృష్టం కలసిరాలేదని, ఇదో చాలెంజ్ గా తీసుకుంటామని సన్నాయినొక్కులు నొక్కి. ఇంటికెళ్ళాక మా పరువు తీసావని గొడ్డును బాదినట్లు బాదే తల్లిదండ్రులు....... ఇలా పిల్లలని తమ కంటిపాపల్లా పెంచాల్సింది పోయి వాళ్ళెంత చిత్రహింస అనుభవించినా తమకి డబ్బు, కీర్తి సంపాదించి పెట్టాలని శాసించే తల్లిదండ్రుల గురించి మీకు తెలుసా ? తమ అవసరాలకీ, తమ ఆడంబరాలకీ పిల్లల్ని బలి చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఎవరిచ్చారు ? తమ అభిరుచుల్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం ఎంతవరకూ సమంజసం ?
ఇది బాల కార్మిక నిరోధ చట్టం పరిధిలోకి రాదా ? గృహహింసా నిరోధ చట్టం లాగే బాల హింసా నిరోధ చట్టం వుందా ? లేకపోతే అలాంటి చట్టాల్ని తెచ్చి ఈ హింసనుంచి బాలల్ని కాపాడలేమా ?
ఈ పరిస్థితికి కారణమెవరు ?
వ్యాపారం పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చానల్స్ వారా ?
ఈ బాల హింసను నిరోధించలేని ప్రభుత్వమా ?
తమ పిల్లలతోనే వ్యాపారం చేస్తున్న తల్లిదండ్రులా ?
ఇప్పటి పరిస్థితి ఇదైతే గతంలో కొంతమంది బాల నటుల పరిస్థితి గురించి స్వామి చిత్రానంద గా ప్రసిద్ధికెక్కిన కె. వి. రావు గారు కొంతకాలం క్రితం విజయచిత్రలో రాసారు. రావు గారు తెలుగు చిత్ర సీమలో సహాయ దర్శకుడిగా సుమారు అయిదు దశాబ్దాలు ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ సుబ్బారావు గారి దగ్గర, బాపు గారి దగ్గర చాలా చిత్రాలకు సహకార దర్శకుడిగా, సహ దర్శకుడిగా పనిచేశారు. ఆయన తన అనుభవంలో చూసిన కొన్ని సంఘటనలను ఏర్చి కూర్చి రాసిన వ్యాసం నుంచి కొన్ని భాగాలు.......
తన తల్లిని తండ్రి వదిలేసిన కారణంగా తాను నటించి తల్లిని పోషించాల్సి వచ్చింది ఒక బాలనటుడికి. బాల నటుడిగా అగ్రశ్రేణికి చేరాడు. ద్విపాత్రాభినయం కూడా చేసాడు. కానీ, చదువుకోలేదు. సెట్ లోకి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడే డైరెక్టర్ గారి పిల్లల్ని ( తన ఈడు వారిని ) చూసి సెట్ బయిటకు వెళ్లి " తాను స్కూల్ కు వెళ్ళడం లేదనీ, వాళ్ళలా ఇంగ్లీష్ మాట్లాడలేననీ భోరున ఏడ్చాడు.
' చదువుకుంటున్న ఆ పిల్లలకన్నా నువ్వే గొప్ప - కొన్ని వేలమందికి తెరమీద కనబడి - వాళ్ళందర్నీ నువ్వు నవ్విస్తున్నావు ' అని ఓదార్చి షాట్ కి తీసుకెళ్ళాను.
Vol. No. 01 Pub. No. 254

************
షూటింగ్లో 11 గంటలకు పిల్లలందరికీ బిస్కట్లు, పాలు, హార్లిక్స్ ఇచ్చేవారు. ఓ బాలనటుడు- తనకిచ్చిన బిస్కట్లు తినకుండా దాచుకునేవాడు. ' ఎందుకయ్యా దాచుకుంటున్నావు అని అడిగితే -
' నాకు బిస్కట్లు వద్దండీ - పొద్దున్న టిఫిన్ తిన్నా కదండీ - ఇవి మా చెల్లాయికి పట్టుకెడ్తానండీ ! ' అన్నాడు.
' ఫర్వాలేదు - నువ్వు తినేయ్. వెళ్ళేటపుడు మీ చెల్లాయికి పట్టుకెళ్డువుగాని ' అని చెబితే అప్పుడు తిన్నాడు.
' సార్ ! అతనికి షర్ట్ యిచ్చారు గదండి. నాకూ షర్టిప్పించండి " అన్నాడు.
" నీ షర్ట్ బాగుంది. అంచేత నీ షర్ట్ మార్చలేదు. "
" అది కాదండి. నాకు ఈ షర్ట్ ఒక్కటే వుందండీ - అందుకని " అని చెప్పాడు.
ఇతను చెబుతున్నది నిజమేనా అని అతన్ని తీసుకువచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ని అడిగాను.
" నిజమేనండీ ! వీళ్ళ అమ్మని నాన్న వదిలేసాడు. తల్లినీ, చెల్లినీ పోషించాల్సింది వీడే - తల్లి కూడా అప్పుడప్పుడు వేషాలు వేస్తుంది. చెల్లెలు చదువుకుంటోంది. వీడు యాక్టు చేసి తల్లినీ, చెల్లెల్నీ పోషించాలి. చెల్లిని మాత్రం సినిమాలోకి దింపను. చదివిస్తాను అంటాడు " అని నిజం చెప్పాడు. ఆ కుర్రాడికి సరిపోయే రెండు షర్టులు చెల్లెలికి రెండు గౌన్లు యిప్పించాను.
*************
ఎంతో చురుగ్గా వుండే అయిదేళ్ళ పాపని ఆమె తల్లినీ తండ్రినీ కాదని, తన దగ్గర వుంచుకుని ' బాలనటి ' ని చేసింది ఓ అమ్మమ్మ. ఒకరోజున ఆ పాప ' మొదటి టేకు ' ను ' ఓకే ' చెయ్యలేదు. అయినా చాలా బాగా చేసింది.
ఆ రాత్రి మొదటి టేకు ఓకే చేయలేదన్న కోపంతో ఆ పసిపాప కంట్లో అమృతాంజనం పెట్టింది అమ్మమ్మ. ఆ పాప ఒకటే ఏడుపు. అమ్మమ్మని చీవాట్లు పెట్టి, ఆ పాపను ఆ రాత్రి నాదగ్గరే పడుకో బెట్టుకున్నాను.
***********
ఓ నాడు ఓ పాప చెప్పింది.
' మా అమ్మమ్మ నాకు పట్టు పరికిణీ, జూకాలూ, నెక్లెసూ, గాజులూ, అన్నీ తెస్తుంది. తెలుసా ? " అంది.
నిజమే అనుకుని సంతోషించాను.
ఆ సాయింత్రం అమ్మమ్మ వచ్చింది - కారు నిండా ప్యాకెట్లే !
" వాటిలో ఆ పాపకోసం తెచ్చిన ఓ ఆర్ట్ సిల్క్ పరికిణీ, గిల్ట్ నగలూ వున్నాయి. మిగరావి అన్నీ ఆమె కోసం కొనుక్కున్న కంచి పట్టు చీరలూ, వెంకటగిరి నేత చీరలూ, ఆమె భర్తకోసం సేలం అంచు పంచెలూను !
*************
ఒక బాల నటుడు బాగా నటిస్తాడని తెలిసి, అతణ్ణి డైరెక్టర్ గారికి చూపించాలనుకున్నాను. ఆ కుర్రాడి తండ్రి -
" మా వాడికి రేపు 7 గం.లకే షూటింగ్ - 6 గం.లకి ఇంటి దగ్గర బయిల్దేరుతాం. మీరు 5 గం.లకి మాయింటికి రండి.ఆరు లోపల డైరెక్టర్ కి చూపించేసి, షూటింగ్ కి వెళ్ళిపోతాం " అన్నారు.
" సరే " అని 5 గం.లకి వాళ్ళ యింటికి వెళ్ళాను.
ఆ బాల నటుడు యింకా లేవలేదు. ( రాత్రి షూటింగ్ చాలా ఆలస్యమైందట )
నిద్రపోతున్న ఆ కుర్రాడిని అలాగే మోసుకెళ్ళి బాత్ రూం లో కుళాయి కింద కూలేసి కుళాయి తెరిచారు. అది శీతాకాలం.
కొడుకుని నటుడిని చేయాలనా ? వాడిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనా ? ఆ తండ్రి వుద్దేశం అర్థంకాలేదు.
...................... ఎంతటి అభివృద్దో కదా ~ !!
...................... ఎంతటి అభివృద్దో కదా ~ !!
తృష్ణ గారి ' ఏమిటో ఈ ఆట ?! ' టపా చదివాక ఎప్పటి నుండో రాయాలనుకుంటూన్న మనసులోని ఆవేదన బయిటకు వచ్చింది.
Tuesday, March 16, 2010
కొత్త సంవత్సరానికి కొత్త ప్రతిపాదన
మన జీవితాల్లో మరో ఉగాది వచ్చింది.
క్రిందటి సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే విరోధాలను పెంచింది.
దొంగలు, హంతకులు, స్మగ్లర్లు లాంటి నేరస్తులు కూడా సమాజంలో సభ్యులే ! వారి చర్యలను వారు సమర్థవంతంగానే సమర్థించుకోవచ్చు. తనకు బ్రతుకు తెరువు కోసం దొంగతనాలు చేస్తున్నానంటాడు దొంగ. అలాగే ఇతరులకు కూడా వారి వారి కారణాలు వారికీ వుంటాయి. ఎటొచ్చీ సమాజానికి మాత్రం వారి చర్యలను అంగీకరించేటంత విశాల హృదయం వుండదు.
పుట్టుకతోనే అందరూ మహాత్ములు కారు. వారి వారి ఆలోచనా విధానాలు, ప్రవర్తనా, ఇతరుల్నీ- సమాజాన్ని ప్రభావితం చేసే తీరు కారణంగా వారు మహాత్ములుగా గుర్తించబడతారు. ఇందుకు మనకు కనిపించే మంచి ఉదాహరణ గాంధీ.
ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాల్ని త్యాగం చేసాడు కాబట్టే అన్ని కోట్లమంది ప్రజల్ని, ప్రపంచాన్నీ ప్రభావితం చెయ్యగలిగాడు. కానీ ఉద్యమంలోకి రాక ముందు ఆయన వ్యక్తిగత జీవితం అందరు సామాన్యుల్లాగే సాగింది.
ప్రజల్ని ప్రభావితం చేసిందీ, ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న బ్రిటిష్ వారిని లొంగదీసిందీ ఆ జీవితం కాదు. నిజానికి గాంధీ గారి సామాన్య జీవితం మనకు అవసరం లేదు. మనం స్పూర్తిగా తీసుకోవలసినది ఆయన ఉద్యమ జీవితమే ! ఏ కారణంగా ఆయన్ని మన దేశమే కాకుండా ప్రపంచమంతా మహాత్ముడిగా కొనియాడుతోందీ, విదేశాలలో కూడా ఆయన విగ్రహాలెందుకు పెట్టవలసి వచ్చిందీ, ఇటీవల అమెరికాలో అప్పటివరకూ వున్న వేరే పేరును మార్చేసి గాంధీ పేరును ఒక ముఖ్యమైన జిల్లాకి ఎందుకు పెట్టారో ఒక్కసారి ఆలోచిస్తే........ ఆయన వ్యక్తిగత జీవితానికి ప్రభావితులై మాత్రం వాళ్ళు ఆ పనులు చెయ్యలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే !
మహానీయులందరూ పుట్టుకతోనే మహనీయులుగా పుట్టలేదు. వాళ్ళు కూడా మామూలు జీవితాలను అనుభవించిన వారే ! వాళ్ళ జీవితాలన్నీ ఎక్కడో ఒక సందర్భంలో మలుపు తిరిగి మహనీయులుగా రూపు దిద్దుకుంటాయి. వారి మామూలు జీవితం మనకు ఆదర్శమా, మహనీయులుగా మారిన తర్వాత జీవితం మనకు ఆదర్శమా అంటే విజ్ఞులైన ఎవరైనా ఏది కోరుకుంటారు ?
కిరాతకుడిగా వున్న వాల్మీకి కావాలా ? మహర్షిగా రామాయణాన్ని రాసిన వాల్మీకి కావాలా ?
భోగిగా వున్న వేమారెడ్డి కావాలా ? యోగిగా మారి జీవిత సత్యాల్ని ప్రజలకు సరళమైన పద్య సంపదగా అందించిన వేమన కావాలా?
తాను కూర్చున్న కొమ్మను నరుక్కోబోయిన అజ్ఞాని కావాలా ? మహాకావ్యాలను సృష్టించిన మహాకవి కాళిదాసు కావాలా ?
ఇలా అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు ?
అలాగే బ్లాగుల్లో రాస్తున్నది ఆడవాళ్ళా, మగవాళ్ళా - వాళ్ళ వ్యక్తిగత జీవితాలేమిటి అనేది అవసరమా ? లేక వాళ్ళు రాసే విషయ సంపద అవసరమా ?
ఎవరికి తెలిసిన, నచ్చిన విషయాలను మాట్లాడే, రాసే స్వేచ్చ మనకు వుంది. కానీ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే, రాసే హక్కు ఎవ్వరికీ లేదు.
విరోధి నామ సంవత్సరంలో కొంతమంది మంచిగా రాసి, మరికొంతమంది చెడ్డగా రాసి విరోదుల్ని పెంచుకున్నారు. మంచిగా రాస్తే విరోదులేమిటంటే మంచిగా రాస్తున్న వారిని ఈ చెడురాతలు రాసేవారు వెంటాడినట్లుగా నాకనిపించింది,
ఈ వికృతి నామ సంవత్సరంలోనైనా చెడురాతలు రాసే వికృత సంస్కృతికి తిలోదకాలిచ్చేద్దామని, బ్లాగు లోకాన్ని మంచి సమాచారంతో, రచనలతో, సందేశాలతో గుబాళించేటట్లు చెయ్యాలని ఆ బాపతు బ్లాగు మిత్రులు ఈ ఉగాది రోజునైనా తీర్మానం చేసుకుంటే బాగుంటుందేమో ? ఇది కొత్త సంవత్సరంలో నా కొత్త ప్రతిపాదన. మరి మిగిలిన మిత్రులేమంటారో ?
ఏమైనా మనకున్న/ తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుదాం.... పంచుకుందాం ! అంతే కానీ మన మానసిక వికారాల్ని బ్లాగర్లపై , బ్లాగులోకం పైనా రుద్దకూడదని అందరూ తీర్మానించుకుంటే బ్లాగు లోకం ఆరోగ్యంగా వుంటుంది, మన మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుందని నా నమ్మకం.
చివరగా ఈ మానసిక వికారుల బారిన పడిన బ్లాగు మిత్రులకు ఒక మాట. ఒకప్పుడు కుష్టు రోగుల్ని చూసి అసహ్యించుకునేవారు. అలాగే ఎయిడ్స్ రోగుల్ని చూసి అసహ్యంతో బాటు, భయం కూడా పడేవారు. దాంతో వాళ్ళు నిరాశా, నిస్పృహలకు లోనై మానసికంగా కృంగిపోయి కసితో కొన్ని దారుణాలు చెయ్యడానికి సిద్ధపడేవారు. కానీ వాళ్ళను సానుభూతితో అర్థం చేసుకుంటే కనీసం మానసికంగానైనా ఆరోగ్యంగా వుంటారు. దాంతో కొంతమందినైనా నేరస్తులుగా తయారవకుండా నివారించిన వారమవుతాం !
అలాగే బ్లాగుల్లో మానసిక వికారాల్ని ప్రదర్శించే వారిపట్ల జాలి, సానుభూతి చూపించండి. కానీ భయపడకండి. కోప్పడకండి. రెచ్చగొట్టకండి. తప్పక వారిలో మార్పు వస్తుంది. ఈ వికృతి అయినా వారిలోని వికృతాన్ని పోగొట్టాలని కోరుకుందాం ! దీనికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యమివ్వడం బ్లాగులోకాన్ని మరింత కలుషితం చేస్తుంది. ప్రాముఖ్యమివ్వవలసిన సమస్యలు సమాజంలో ఇంకా చాలా వున్నాయి. వాటిని గురించి చర్చిద్దాం. కనీసం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పరిష్కారమైనా లభించే అవకాశం వుంది.
ఈ కొత్త సంవత్సరంలో మరో కొత్త ప్రతిపాదన వచ్చే టపాలో ............
Vol. No. 01 Pub. No. 228
Tuesday, February 9, 2010
ఆజన్మాంతం
కొంతమంది అడ్డూ ఆపూ లేకుండా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు.
ఆ సమయంలో ఆకలిదప్పులు తెలియవు. కొందరైతే ఉచ్చ్హనీచాలు కూడా మరచిపోతారు.
అలా సంపాదించీ, సంపాదించీ అలసిపోయాక, జీవిత చరమాంకానికి చేరుకున్నాక బెంగ పట్టుకుంటుంది.
భయం చుట్టుకుంటుంది.
తన తదనంతరం ఈ సంపదంతా ఏమై పోతుంది ?
తన పిల్లలు దీన్ని సవ్యంగా నిలబెట్టుకుంటారా ?
తన సంపద మీద బంధువులు, దాయాదులు కన్నేసి కాజేయరు కదా ?
ఇలా....సవాలక్ష సందేహాలు.
తన బెంగ తీరాలంటే ఒకటే మార్గం.....
తాను మరణాన్ని జయిస్తే బాగుండును.
తన ఆస్థిని తనే కాపాడుకోవచ్చు. ఎవరి మీదా ఆధారపడనక్కర్లేదు.
కానీ... అది సాధ్యమా ?
ఒకవేళ సాధ్యమైతే...... ఏమవుతుంది ?
అలెగ్జాండర్ ప్రపంచ విజేత. ఆయన గురించి చెప్పుకునే ఓ కథ........

***
అలెగ్జాండర్ ప్రపంచ విజేత. ఆయన గురించి చెప్పుకునే ఓ కథ........
అలెగ్జాండర్ ప్రపంచంలో తనకు తెలిసిన భూభాగాన్నంతా జయించేసాడు.
అప్పుడు మరణం గుర్తుకు వచ్చింది. ఏదో ఒకరోజు చనిపోక తప్పదు.
ఆ తర్వాత ఇంత కష్టపడి జయించి సంపాదించిన సామ్రాజ్యమంతా ఏమైపోతుంది ? అని బెంగపట్టుకుంది.
అంతే ! ఆయనకు మృత్యువుని జయించాలనిపించింది. అమరుడవ్వాలంటే అమృతం కావాలి.
దానికోసం అన్వేషణ ప్రారంభించాడు. కొండలు, కోనలు, కీకారణ్యాలు అన్నీ గాలించాడు. చివరికి సాధించాడు. ఒకచోట అమృతధార దర్శనమిచ్చింది. మహదానంద పడిపోయాడు.
ఆ అమృతధార ఉన్న చిన్న గుహలో అంతా చీకటి.
ఆ ధార మాత్రం మిలమిలా మెరుస్తూ దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్ళి దోసిటపట్టి తాగబోయాడు.
ఇంతలో అక్కడే చిరకాలంనుంచి నివసిస్తున్న ఒక కాకి అలెగ్జాండర్ ని నిలవరించి
" నేనూ నీలాగే అమరత్వం సాధించాలని, కలకాలం బ్రతకాలని చాలా యుగాల క్రిందటే ఈ అమృతాన్ని తాగాను. సుదీర్ఘమైన జీవితంలో కొంతకాలం కోరుకున్నవన్నీ తృప్తిగా అనుభవించాను.
తరువాత నెమ్మదిగా అన్నిటి మీదా వాంచ తగ్గింది.
కోరికలన్నీ నశించాయి. దేనిమీదా వ్యామోహం లే్దు.
ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ ఈ అమృతం కారణంగా చావు రావడం లేదు.
అనేక ప్రయత్నాలు చేసాను. పీక కోసుకుందామంటే కత్తి బండబారిపోతోంది.
సముద్రంలో దూకితే నీళ్ళమీద తేలుతున్నాను.
ఈ బ్రతుకు బ్రతకలేక రోజు రోజూ చస్తున్నాను.
ఇహలోకంలోనే నరకం అనుభవిస్తున్నాను.
తాగబోయేముందు ఇదంతా నీకు తెలిస్తే మంచిదని చెబుతున్నాను.
అయినా నీకు తాగాలని వుంటే నిరభ్యంతరంగా తాగు.
కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా దీనికి విరుగుడు తెలిస్తే మాత్రం నాకు చెప్పు " అందట ఆ కాకి.
ఇంకేం మాట్లాడతాడు ?
అందుకే ఆ ప్రయత్నం విరమించుకుని వెనుదిరిగాడట బుద్ధిశాలైన అలెగ్జాండర్.

Vol. 01 Pub. 192
Labels:
మనసులో మాట
Friday, February 5, 2010
మోత బరువు
ఆపదలో ఉన్న వారికి సాయపడి వారినేదో ఉద్ధరించేసామనో, వేరే ఎవరైనా చేసి మంచి పేరు తెచ్చుకుంటే మనకా అవకాశం చేజారి పోయిందని వారి మీద బురద జల్లే ప్రయత్నం చెయ్యడమో ఎంత హీనం...........
Vol. No. 01 Pub. No. 185
Vol. No. 01 Pub. No. 185
Wednesday, February 3, 2010
జాతస్య మరణం ధృవమ్ !
మరణం అనివార్యమని తెలిసినా మనిషి డబ్బు మీద తన వ్యామోహాన్ని వదులుకోలేడు.
అందుకే డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అందుకే డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
Vol. No. 01 Pub. No. 181
Friday, September 4, 2009
చిన్న దీపం వెలిగించి చీకట్లు పారద్రోలండి.
చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడటం మంచిది కాదనే అభిప్రాయం వెనుక ఒక అర్థం ఉన్నట్లుగా తోస్తోంది. ప్రతి మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. బతికున్నప్పుడు వారిలోని చెడుని ఎత్తిచూపి సరైన మార్గానికి తీసుకురావడానికి ప్రయత్నించటం అందరి విధి. కానీ అతను చనిపోయినపుడు, అది కూడా ప్రముఖ వ్యక్తి అయినపుడు ఆ సమయంలో అతనిలోని చెడుని ప్రస్తావించడం వలన చాలామంది మనస్సులో వారికి తెలియకుండానే చెడు బీజాలు నాటుకునే అవకాశం ఉంది. అదే అతనిలోని మంచిని మాత్రమే ప్రస్తావించడం వలన కనీసం ఆలోచన మొదలవుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే చనిపోయిన వ్యక్తి గురించి మంచిని మాత్రమె మాట్లాడే సంప్రదాయం వచ్చి ఉంటుంది. ఇక వై.యస్. గురించి. మనకు ఎందఱో ముఖ్యమంత్రులు వచ్చారు. వెళ్ళారు. కానీ ప్రజలందరి ఆకలి తీర్చే అన్నదాతల కష్టం గురించి ఎవరు ఆలోచించారు ? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎంత భూమిని సస్యశ్యామలం చేసింది, ఎంతమందికి జీవనోపాధి కల్పించిందీ మనందరికీ తెలియని విషయం కాదు. దాని తర్వాత కాలంలో మన రాష్ట్ర జనాభా పెరుగుతుందని, ఆహారధాన్యాల అవసరాలు పెరుగుతాయని నాయకులెవరికీ తెలియదా ? తమ పదవి నిలుపుకొనే ఆలోచనే తప్ప ఆ దిశగా ఆలోచించి సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రయత్నం చేసిన వారెవరు ? సామాన్య ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నాయకుడెవరు ? ఇంకా ... ఎన్నో పథకాలే ఆయనకీ ప్రాముఖ్యత తెచ్చాయనేది నిజం. ప్రజలతో మమేకమైతేనే, వారి సమస్యల పరిష్కారం గురించి వారితోనే చర్చిస్తే అధికారం నిలుపుకోవడం మాత్రమె కాదు, మనిషిగా అందరి గుండెల్లో నిలిచిపోతాడని నిరూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ప్రజాప్రతినిధిగా ఎన్నికవడానికి , అధికారం తెచ్చుకోవడానికీ కొత్త సూత్రాల్ని రచించాడనడంలో సందేహం లేదు. రాజకీయనాయకుల ఎ.సి. ఛాంబర్ లూ, హై టెక్ హంగులూ ప్రజలకక్కరలేదని నిరూపించిన వ్యక్తి. ఇక రెండో పార్శ్వం. అవినీతి గురించి. దాన్ని పెంచి పోషిస్తున్నది మనం కాదా ? మన పనులు జరిపించుకోవడానికి అవినీతిని ఆశ్రయించడం లేదా ? అప్పుడు మన పని పూర్తి అవడం మనకి ముఖ్యం. అందుకే నిలదీసే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసుకుంటాం. నాయకులు ప్రజల్లోకి వచ్చినపుడు మనకు ఈ విషయంలో నిలదీసే అవకాశం ఉందికదా ? ఎక్కడో కూర్చుని పధకాలు రచించే వాళ్ళనేమీ చెయ్యలేము కదా ? మన చుట్టూ ఉన్నా అవినీతిని నిలదీసే బాధ్యత మనది కాదా ? ఆ అవకాశం కల్పించడానికి ప్రయత్నించిన నాయకుడేడి ? హేమాహేమీలైన సీనియర్ రాజకీయ చాణుక్యులు ఉండి కూడా అసమ్మతి రాగాలు గట్టిగా వినిపించలేకపోవడానికి కారణం ప్రజలలో బలం కాదా ? ప్రజా బలాన్ని నిరూపించిన నాయకుడు వై.యస్.కాదా ?
ఆయనలోని చెడుని ఆయనతోటే పంపించెయ్యండి. ఆయన మంచి ఆలోచల్ని గురించి అందరికీ వీలైనన్ని సార్లు చెప్పండి. అప్పుడు తెరవెనుక నడుస్తుందనుకుంటున్న రాజకీయం భయపడుతుంది. కొంతవరకైనా వారిలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడూ చెడుని తిట్టడం కంటే మంచిని ప్రోత్సహించడం మంచి ఫలితాల్నిస్తుందేమో కదా ? బ్లాగర్లందరూ ఈ విషయం ఆలోచిస్తారు కదూ !

Thursday, September 3, 2009
108
108 - జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆశాదీపం. బతుకుమీద ఆశ రేకెత్తించే కరదీపం. ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి ప్రమోదం కలిగించే వ్యవస్థ. ఈ వ్యవస్థను పటిష్టం చేసి చావుకి దగ్గరగా వెళ్ళిన ఎంతోమందికి జీవం పోసిన రాజశేఖరుని నిర్జీవంగా తరలించి ధన్యత పొందిందా ? అవును. ఎంతోమందికి ఉపయోగిస్తున్న ఆపద్భాంధవి 108 ఆయన్ని సజీవంగా తీసుకొచ్చే పరిస్థితి లేకపోయినా ఆయన పార్ధివ శరీరాన్ని తరలించి తరించింది.
కర్నూలులో హెలికాప్టర్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని 108 లో తరలించడం చూసాక ......
కర్నూలులో హెలికాప్టర్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని 108 లో తరలించడం చూసాక ......
స్మశాన వైరాగ్యం
వై. యస్. రాజశేఖర రెడ్డి - నిన్నటి ఉదయం హెలికాప్టర్ ఎక్కేవరకూ ఒక వి.ఐ.పి. . ప్రముఖ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాజకీయ చతురుడు. ఇడుపుల పాయ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, వార్తాపత్రిక, వార్తా చానల్... ఇంకా... ఎన్నెన్నో కోట్లకు యజమాని. నిన్న ఆయనతో ప్రయాణం చేసిన సుబ్రహ్మణ్యం, వెస్లీ, పైలట్లు పోలికలో ఆయనకంటే సామాన్యులే. హెలికాప్టర్ ఎక్కేటప్పుడున్న తేడాలు చావులో ఎందుకు కనబడలేదు. మృతదేహాలన్నీ ఒకే రకంగా ఎందుకు మారిపోయాయి. హోదాగానీ , కోట్లు గానీ ఆయన్ని ఎందుకు రక్షించలేకపోయాయి ? సుమారు 25 గంటలపాటు ప్రభుత్వ యంత్రాగం, ఆయనకోసం వెదికిన వందలాదిమంది ప్రజలు ఆయన్ని సజీవుడుగా ఎందుకు తీసుకురాలేక పోయారు ? ఆంధ్రదేశమంతా ప్రజలు చేసిన పూజ పునస్కారాలు ఫలించలేదేందుకు ? గ్రహగతులును లెక్కగట్టి ఆయన సురక్షితంగానే ఉన్నాడని సజీవంగా తిరిగివస్తాడని చెప్పిన జ్యోతిష్యుల మాటలు నీటి మూటలెందుకయ్యాయి ? ఇంకా ... ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. చావులోని విచిత్రం, గొప్పదనం అదే ! దీనికి కుల, మత , ప్రాంత, వర్ణ, స్థాయి లాంటి బేధాలేవీ దానికి లేవు. అవన్నీ నేను, నాదీ, నేనే గొప్ప అనే అహంకారాన్ని నరనరాల నింపుకున్న మనకే ! బతుకంతా ఇలా అహంకరిస్తూ, తోటి మనుష్యులను ఈసడించుకుంటూ ఉండే కంటే పదిమందికీ మంచిచేస్తూ, అది మన బాధ్యతని ఫీలయితే చనిపోయే ముందైనా సంపాదించిన ఆస్తినీ, అదిచ్చిన అహంకారాన్నీ కాకుండా, కాస్త సంతృప్తిని మూట కట్టుకోవచ్చేమో ! ................. ఇదే శ్మశాన వైరాగ్యమంటే !!
Subscribe to:
Posts (Atom)