Tuesday, October 20, 2009

ఉభయకవి మిత్రులు


ఉభయకవి మిత్రుడు అని కవిత్రయంలో తిక్కన సోమయాజి బిరుదు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్ష్యులుగా పనిచేసిన ఆచార్య యస్వీ జోగారావు గారికి మహాకవి శ్రీశ్రీ గారితో పనిబడి మద్రాసు వచ్చి ఎక్కడ కలవమంటారని అడగడానికి ఫోన్ చేశారు. దానికి శ్రీశ్రీ గారు " దానికేముంది.ఉభయకవిమిత్రులు ఉన్నారుగా ! వారింట్లోనే కలుద్దాం !! " అన్నారు. అంతటి పండితుడు జోగారావుగారికి ఏమీ అర్థం కాలేదు. ఈయనేమిటి ఎప్పుడో మహాభారతకాలం నాటికి వెళ్లిపోయారు అనిపించిందాయనకు. అదే అనుమానం శ్రీశ్రీ గారితో వ్యక్తం చేశారు. " అదేనండీ ! మన ఉభయులకూ మిత్రులైన పప్పు వేణుగోపాల రావుగారింట్లో కలుద్దామని నా ఉద్దేశ్యం " అన్నారు శ్రీశ్రీ.  పప్పు వేణుగోపాల రావు గారు అప్పట్లో అమెరికాలోని సాహితీ సంస్కృతి సంస్థలకు, మన దేశంలోని తెలుగు సంస్థలు , ఆయా రంగాల్లోని ప్రముఖులకు మధ్య వారధిగా ఉండేవారు. దాంతో ఆయన కవులకూ, కళాకారులకూ అందరికీ మిత్రులుగా ప్రసిద్ధులు .

2 comments:

  1. ఆ మధ్య .. 80లలో అనుకుంటా, ఏదో కవిత్వ వాదవివాదాల్లో ఇరుక్కున్న చేరాగారికి "ఉభయకవి శత్రువు" అని బిరుదిచ్చారెవరో! :)

    ReplyDelete
  2. కొత్త పాళీ గారూ !
    కొత్తవిషయం చెప్పారు. ధన్యవాదాలు.

    ReplyDelete