Saturday, October 3, 2009

కన్నీటి వరద

కృష్ణమ్మకు ఆగ్రహమొచ్చింది. కట్టలు తెంచుకుంది. బీభత్సం సృష్టిస్తోంది. ఇంకా ఎంతకాలం ఈ ప్రళయం కొనసాగుతుందో, ఎంత నష్టం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి. మొన్నటిదాకా వరుణుడి రాకకోసం ఎదురు చూసాం. ఇప్పుడు మాత్రం పోకకోసం ప్రార్థించవలసిన పరిస్థితి. రెండు జిల్లాల ప్రజల్ని కన్నీటితో ముంచెత్తిన కృష్ణమ్మ ఇంకా కరుణించేటట్లు లేదు. ప్రకృతి కోపమొస్తే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూపిస్తోంది. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటనేది అలవాటు ప్రకారం పోస్ట్ మార్టం చేసుకుంటే అన్ని విషయాలు ప్రక్కన పెట్టి చేసిన, చేస్తున్న మానవ తప్పిదాలకు మూల్యం చెల్లిస్తున్నాం అనేది స్పష్టం. అది ప్రభుత్వ వైఫల్యం అని ప్రతిపక్షాలు, అధికారుల వైఫల్యమని ప్రజలు అనుకుంటూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూర్చోవడం కంటే ఈ వాస్తవాలు గ్రహించడం మంచిది. ఈ దుస్థితికి కారణం అడవులు విచ్చలవిడిగా నరకడం, కాలుష్యాల్ని పెంచేసుకోవడం , ప్లాస్టిక్ లాంటి పదార్ధాల వాడకం పెరగడం.... ఇత్యాదివెన్నో !! కర్ణుడి చావుకి కారణాలెన్నో !!! విపత్తు జరిగినపుడు హడావిడి పడడం కంటే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, జాగ్రత్త వహించడమే మన తక్షణ కర్తవ్యమ్ !!!

No comments:

Post a Comment