Sunday, October 11, 2009

ఆశ

అమ్మ చందమామని తెచ్చిస్తుందనే ఆశ
చిన్నప్పుడు బువ్వ తినిపిస్తుంది

తోటి పిల్లలతో ఆడుకోవచ్చనే ఆశ
బడికి పంపి అక్షరాలు దిద్దిస్తుంది

మంచి ఉద్యోగం వస్తుందనే ఆశ
ఉన్నత చదువులు చదివిస్తుంది

జీవితానికో తోడు కావాలనే ఆశ
పెళ్లి దాకా నడిపిస్తుంది

వంశాభివృద్ధి చెయ్యాలనే ఆశ
ముద్దులొలికే పిల్లల్ని ఇస్తుంది

వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశ
కష్టబడి సంపాదించేటట్లు చేస్తుంది

శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆశ
పిల్లలమీద ఆధారపడేటట్లు చేస్తుంది

అది నిరాశ కాకూడదనే ఆశ
మరణందాకా నడిపిస్తుంది

జీవన ప్రయాణానికి ఆశే ఇంధనం
గమ్యాన్ని చేరడానికి అదే ఆలంబన

11 comments:

  1. Rao Garu really Exceleent.... superbbbb gaa vrasaru.... aasha adbutam....

    ReplyDelete
  2. బుజ్జి గారూ !
    విజయ మోహన్ గారూ !
    కృతజ్ఞతలు

    ReplyDelete
  3. అద్భుతమైన ఆశండి!

    ReplyDelete
  4. చాలా బాగుందండి.

    ReplyDelete
  5. meeru vrasina aasa kavitha manasuku haddukunelaa undi...vastavaanni chaala chakkagaa raasaru.
    chala chala nachindi...

    ReplyDelete
  6. హాసిని గారూ !
    శిరాకదంబానికి స్వాగతం. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. శ్రీ జాబిలి గారూ !
    శిరాకదంబానికి స్వాగతం. నా ' ఆశ ' ను మీరందరూ చదువుతారని, అందరూ తమకు తెలిసిన జీవితాన్ని మరోసారి దర్శించుకుంటారనే ఆశతో రాసాను.

    ReplyDelete
  8. కవితచాలాబాగుంది
    ప్రతిపదం వర్తమానానికి ప్రతీక
    కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి

    ReplyDelete
  9. వీరభద్ర శాస్త్రి గారూ !
    శిరాకడంబానికి స్వాగతం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  10. రమేశ్ గారూ !
    శిరాకదంబానికి స్వాగతం. ' ఆశ ' లోని ఆంతర్యాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete