Saturday, October 17, 2009

పుస్తకానికి గజకేసరి యోగం



మొదట్లో తాళ ప్రతులుగానూ, కాగితం వచ్చాక చేతిరాతలుగానూ ఉండిపోయిన సంస్కృతాంధ్ర గ్రంథాలను పరిష్కరించి ముద్రణా యంత్రాలనుపయోగించి తెలుగు జాతికి అందించిన తొలి తరం ముద్రాపకులు శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రి , వారి పుత్రులు వెంకటేశ్వర శాస్త్రి గారు. వారు 1854 లో ' సరస్వతీ గ్రంథ మాల ' పేరుతో ముద్రణాలయాన్ని ప్రారంభించారు. రామాయణ, మహాభారతాలను పరిష్కరించి దేవనాగరి లిపిలో 1856 లో ప్రచురించారు.
సందర్భంగా మదరాసులోని తెలుగు వారందరూ కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గ్రంధాలను ఏనుగు అంబారీ పైనుంచి మంగళ వాద్యాలతో పురప్రముఖులందరూ నగరమంతా ఊరేగించారు. పుస్తకానికి దక్కిన అపూర్వమైన గౌరవమది.

1 comment:

  1. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణOctober 19, 2009 at 4:10 AM

    Oka manchi vishayaani chepparu sir.

    Thank you.

    ReplyDelete