Sunday, October 18, 2009

విశ్వనాథ వారి చెణుకులు


ఈ రోజు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్థంతి. ఆయన సాహిత్యం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాఖ్యల్లో మాత్రం హాస్యం తొంగిచూసేది. ఆయనకు నివాళులర్పిస్తూ....
* విశ్వనాథ వారి ' శివార్పణం ' పద్యకావ్యం ఆవిష్కరణ సభ జరుగుతోంది. ఆయన్ని గుమ్మడి గారుసత్కరిస్తారని ప్రకటించారు. అలాగే గుమ్మడి గారు సత్కరించారు. దానికి విశ్వనాథ వారు " గుమ్మడి అంటే ఈయనా ? నేనింకా గుమ్మడి సత్కారమంటే గుమ్మడికాయనిస్తారేమో అనుకున్నాను " అన్నారట.

* విశ్వనాథ వారు బందరులో ఉండే రోజుల్లో ఆయన మిత్రుడొకాయన ఊరు వచ్చి " మీ ఊరి నిండా గాడిదలేఉన్నట్లున్నాయే ! " అన్నాడు వ్యంగ్యంగా. దానికి విశ్వనాథ వారు " అవును. నిజమే ! ఉన్నవి చాలవన్నట్లుఅప్పుడప్పుడు పొరుగూరి గాడిదలు కూడా వచ్చిపోతుంటాయి " అన్నారు.

* ఒక చిత్ర నిర్మాతకు విశ్వనాథ వారి ' వేయిపడగలు ' ని సినిమా గా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన్ని కలిసాడు. విశ్వనాథ వారు ఇరవై వేలు పారితోషికం అడిగారు. దాంతో ఆ నిర్మాతకు మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో తోచక " అంత ఇచ్చుకోలేను. రెండు వేలు ఇచ్చుకుంటాను. ఓ వంద పడగల్ని ఇప్పించండి " అన్నాడు. ఈసారి విస్తుపోవడం విశ్వనాథ వారి వంతయింది.

*
విశ్వనాథ వారు ఒక పని మీద సచివాలయం చుట్టూ చాలాసార్లు తిరిగి విసుగెత్తి, అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారిని కలిసి విషయం చెప్పారు. ఆయన " అదొక పెద్ద అడివి. దానిలో పని జరిపించుకోవడం అంత సులభం కాదు" అన్నారు. " మీరు ఆంద్ర కేసరి కదా ! ఆ అడవి మీకొక లెఖ్ఖా ? అందుకే మీ దగ్గరకు వచ్చింది " అన్నారు విశ్వనాథ వారు ప్రకాశం గారిని ఇరుకునబెడుతూ.

7 comments:

  1. బాగున్నాయండి, మీ చెణుకులు.

    ReplyDelete
  2. జయ గారూ !
    ఆ చెణుకులు నావి కావండి. విశ్వనాథ వారివి. ఏమైనా మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  3. చణుకులు చర్నకోలలు భలే వున్నాయండి. సున్నిత హాస్యం.

    ReplyDelete
  4. రెండవది బాగా నవ్వించింది.
    word verification తీసివేస్తే బాగుంటుందేమో!

    ReplyDelete
  5. భా.రా.రె.గారూ !
    ధన్యవాదాలు.
    విజయమోహన్ గారూ !
    సంతోషం. word verification తీసివేస్తే బాగుంటుందన్నారు. అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా !

    ReplyDelete
  6. బాగున్నాయి ఆయన చెణుకులు మీరు గుర్తు చేయటం.. రెండూనూ..

    ReplyDelete
  7. భావన గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete