Saturday, October 31, 2009

భారత ఉక్కు మహిళ

మన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాందీ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ... ఈ చిన్ని ప్రయత్నం. చూడండి.


8 comments:

  1. అందుకే కాబోలు ఉక్కు గుళ్ళకు బలయింది చివరకు.అయినా పోయినోళ్ళు అందరూ గొప్పోళ్ళే,మంచోళ్ళే,మన తెలుగు వాళ్ళు తప్ప.

    ReplyDelete
  2. ఈ ఉక్కు మహిళ మన తెలుగు వారిని ఉద్దేశించి ఎదో మాట్లాడిందని విన్నాను. తెలియ పరిస్తే ఆనందిస్తాను.

    ReplyDelete
  3. విజయమోహన్ గారూ !
    తెలుగు వాళ్ళు కూడా మంచోళ్ళే నండి. చెడ్డవాళ్ళెవరూ లేరు.కొందరు ఉండి సంతోషబెడితే కొందరు పోయి సంతోషబెడతారు.అంతే! ( చిలకమర్తివారి స్పూర్తితో )
    అప్పారావు శాస్త్రి గారూ !
    ఆవిడ తెలుగు వాళ్ళని ఉద్ద్యేశ్యించి ఏదో అనడానికి కారణభూతులు మన తెలుగు వాళ్ళు కాదా! తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టినపుడు ఆవిడేమిటి ఎవరైనా ఏమైనా అంటారు. అంతవరకూ ఎందుకు ? ప్రస్తుతం తెలుగు తల్లికి మన స్వార్థ రాజకీయ నాయకులు పట్టిస్తున్న గతి ఏమిటి ? మన భాషను, సంస్కృతిని మనమే కించ పరుచుకుంటున్నపుడు ఎవరో ఎప్పుడో ఏదో అన్నారని బాధపడడం అవసరమంటారా 1 అయినా ఎపుడో చనిఫోయిన వాళ్ళలోని చెడుని పదే పదే తవ్వుకునే కంటే మంచిని మాత్రమే గ్రహిస్తే బాగుంటుందేమో ! ఈ చర్చకంటే తాడేపల్లి గారు ప్రారంభించిన చర్చ తెలుగు భాష పరిరక్షణకు ఉపయుక్తమేమో 1 స్వార్థ రాజకీయాల్ని పాతరవేసి మన ఆత్మ గౌరవాన్ని మనమే కాపాడుకున్న రోజున ఎవరూ మన వైపు వేలెత్తి చూపలేరని నా అభిప్రాయం.

    ReplyDelete
  4. రావుగారూ,నా ఉద్దేశ్యము తెలుగు వాళ్ళు మంచివాళ్ళు కాదని కాదండి.ఉన్నతమైన వ్యక్తి పీవీ నరసింహారావుగారికిచ్చిన గౌరవం గుర్తుకు వచ్చి(మరణానంతరం) బాధతో అన్నమాట.ఆ మహానుభావుని ఉన్నప్పుడు ఎలాగూ గౌరవించలేదు కనీసం పోయినప్పుడైనా గౌరవించకపోగా పైగా అవమానించినందుకు మన తెలుగు వెధవలననాలి.

    ReplyDelete
  5. విజయమోహన్ గారూ !
    మీ ఉద్దేశ్యాన్ని శంకించట్లేదండి.మీరు చెప్పిందే నా అభిప్రాయం కూడాను. నేను చిలకమర్తి వారి వ్యంగ్యం వాడానంతే ! పీవి గారిని కించ పరచడం దారుణమైన విషయమే ! అదీ మన తెలుగు వాళ్ళే చెయ్యడం మరీ దారుణం.

    ReplyDelete
  6. Good one, you are still remembering her ;-)

    ~sUryuDu

    ReplyDelete
  7. @ సూర్యుడు గారూ !
    కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. ఇంతకీ ఆవిడ ఏమన్నారో చెప్పలేదేమిటండీ

    ReplyDelete