Showing posts with label నివాళి. Show all posts
Showing posts with label నివాళి. Show all posts
Thursday, November 25, 2010
విషాదంలోనూ వినోదమే !
విషాదంలోనుంచి వినోదం సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన కళాకారుడు చార్లీ చాప్లిన్. ఆ ఒరవడిని అంది పుచ్చుకున్న తెలుగు నటుడు రేలంగి వెంకట్రామయ్య. తెలుగు చిత్రరంగంలో హాస్యనటులకు సుస్థిర స్థానం కల్పించిన నటుడు రేలంగి. ఆయన తెరమీద నవ్వినా, ఏడ్చినా ప్రేక్షకులకు వచ్చేవి కన్నీళ్లు కాదు.....నవ్వులే ! తెర మీద కనిపించినపుడే కాదు నిజజీవితంలో కూడా ఆయన ఎక్కడ కనిపించినా జనం నవ్వేవారు.
ఆయన
కారు దిగితే నవ్వు....
నడిస్తే నవ్వు......
ఆగితే నవ్వు.....
మాట్లాడబోతే నవ్వు.....
మాట్లాడకపోతే నవ్వు......
ఏం చేసినా నవ్వే ! ఏం చెయ్యకపోయినా నవ్వే !
................అలా సాగింది ఆయన నవ్వుల ప్రవాహం
1955 లో హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రముఖ నాటుడు స్థానం నరసింహారావు గారి చేతుల మీదుగా రేలంగి వెంకట్రామయ్య గారికి ఘన సన్మానం జరిగింది. ఆ సన్మానానికి రేలంగికి నోట మాట రాలేదు. గొంతు పూడుకుపోయింది. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు. ఆది చూసి ప్రేక్షకుల నవ్వులు.
అప్పుడు చూడండి రేలంగి గారి పరిస్థితి. ఎలాగో గుండె దిటువు చేసుకుని నేను నిజంగానే ఏడుస్తున్నానని ప్రకటించారు. ఆయన పరిస్థితి అర్థమైన కొంతసేపటికి ప్రేక్షకుల నవ్వులు ఆగాయి.
స్థానం వారు " ఎందుకు బాబూ నీకీ కన్నీళ్లు ? " అని అడిగారు.
గద్గద స్వరంతో రేలంగి గారు " గతంలో నాటకాల్లో వేషం వెయ్యాలని కోరికతో మీదగ్గరకొచ్చి అడిగాను. నువ్వు నాటకాలేం వేస్తావు పొమ్మన్నారు. ఈరోజు మీ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం నిజంగా ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ ఆనంద భాష్పాలు " అన్నారు. సభంతా గంభీర వాతావరణం నిండిపోయింది.
వినోదంలో ఎంత ఆనందాన్ని పంచగలడో విషాదంలో అంత అనుభూతిని పంచగల సమర్థుడు రేలంగి వెంకట్రామయ్య. హరికథకుడిగా, హార్మోనియం వాయిద్యకారుడిగా, రంగస్థల నటుడిగా ప్రారంభమైన రేలంగి 1935 లో శ్రీ కృష్ణ తులాభారం చిత్రంతో మలుపు తిరిగింది. హాస్యనటుడిగానే కాక గాయకుడిగా కూడా కొన్ని పాటలు పాడారు.
తెలుగు చిత్రాల్లో హాస్యానికి రాచబాట వేసిన రేలంగి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ................
Vol. No. 02 Pub. No.
Sunday, October 31, 2010
రెండో రాముడు
గతంలో రంగస్థల నాటకాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకని రాముడు, కృష్ణుడు వంటి ముఖ్య పాత్రలను ఇద్దరు ముగ్గురు నటులు ధరించేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..... ఇలా ఆ పాత్రని ఫలానా నటుడు ధరిస్తాడని అని కరపత్రాల్లో ముద్రించేవారు.
అలాగ కాదుగానీ మనకి వెండి తెర రాముడు అంటే గుర్తుకొచ్చేది నందమూరి తారక రాముడే ! ఆయన్ని తప్ప ఊహించుకోలేకుండా వున్న పరిస్థితుల్లో ఆయనే తన స్వంత చిత్రం ' సీతారామకల్యాణం ' లో మరో రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆ రాముడే హరనాథ్.
హరనాథ్ తండ్రి నటుడు అవ్వాలని మద్రాస్ చేరి సహకార దర్శకుడిగా మారారు. హరనాథ్ కి కూడా సినిమాల మీద, నటన మీద ఆసక్తి వున్నా తండ్రి తన అనుభవంతో విధించిన ఆంక్షల కారణంగా బి.ఏ. పూర్తి చేసేవరకూ ఆవైపు తొంగి చూడలేదు. ఇంటర్ మద్రాస్ లో చదివేటపుడు బాపు రమణలు ఆయన సహాధ్యాయులు. కాకినాడలో బి.ఏ, చదివేటపుడు ప్రముఖ నిర్మాతలు వి. బి. రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లు సహాధ్యాయులు.
తండ్రి వల్లో, మిత్రుల వల్లో హరనాథ్ కు సినిమాలలో అవకాశం రాలేదు. బి.ఏ. పూర్తిచేసి మిలిటరీలో చేరే ఉద్దేశ్యంతో మద్రాస్ కొచ్చిన హరనాథ్ ఒకరోజు కోడంబాక్కం బస్సు స్టాప్ లో నిలబడి వుండగా అప్పట్లో ప్రముఖ కళాదర్శకుడైన సూరన్న చూసి తన కారు ఆపి ' సినిమాలో వేషం వేస్తావా ? ' అని అడిగాడు. తన చిరకాల కోరిక తీరే అవకాశం తనని వెదుక్కుంటూ వచ్చినందుకు షాక్ తిన్న ఆయన్ని నవశక్తి గంగాధరరావు గారికి పరిచయం చేశారు సూరన్న. అతని రూపం, హావభావాలు నచ్చి గుత్తా రామినీడు దర్శకత్వంలో తాను నిర్మించబోయే చిత్రంలో అవకాశం ఇచ్చారు గంగాధరరావు గారు.
అలా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో చిత్రీకరించబడ్డ మొదటి చిత్రం ' మా ఇంటి మహాలక్ష్మి ' తో 1959 లో చిత్రరంగ గృహప్రవేశం చేసిన హరనాథ్ 60 వ దశకంలో తెలుగు చిత్ర సీమలో ప్రముఖ హీరోల సరసన చేరాడు. బడ్జెట్ చిత్రాల హీరో గా, పురాణ పాత్రలకు సరిపోయే ఆకారంతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. జమున, హరనాథ్ జంట అప్పటి ప్రేక్షకుల కన్నుల పంట. ' భీష్మ ' ( 1967 ) చిత్రంలో కృష్ణుడిగా, ' శ్రీరామకథ ' ( 1969 ) లో మరోసారి రాముడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించిన హరనాథ్ చివరి చిత్రం ' నాగు ' . దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలిసారి హీరోగా నటించిన ' పగడాల పడవ ' చిత్రంలో హరనాథ్ ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదల కాలేదు.
ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ.
ఈరోజు ( నవంబర్ 1 ) హరనాథ్ వర్థంతి. ఆయనలోని నటుడిని స్మరించుకుంటూ ..............

Vol. No. 02 Pub. No. 047
Thursday, October 7, 2010
నెహ్రూజీ డూప్ - జవాబు
కనుక్కోండి చూద్దాం - 28 - జవాబు
అయితే ఆయన ఫోటో బ్లాగర్ లో అప్లోడ్ కాకపోవడంతో పికాస ద్వారా ప్రయత్నించగా పేరు మార్చిన ఫైల్ కాకుండా అసలు ఫైల్ అప్లోడ్ అయి ఆ ఫైల్ పేరు పేకేటి గా తెలుస్తోందనే అభిప్రాయాన్ని మాగంటి వంశీమోహన్ గారు వ్యక్తం చేశారు. శివగారు పేకేటి గారి పూర్తి పేరు రాసారు. ఇక జే.బీ. గారి కోరిక మేరకు పేకేటి గారి వివరాలు ......
పేకేటి గా గత తరం ప్రేక్షకులకు సుపరిచుతులైన పేకేటి శివరాం అసలు పేరు పేకేటి శివరామ సుబ్బారావు. తూర్పు గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో 1918 అక్టోబర్ 8 వ తేదీన జన్మించిన శివరాం బి.ఏ. పాసయి ఎస్. ఆర్. సుబ్బారావు పేరుతో , ముఠా, ఉదయగిరి, కస్తూరి అనే కలం పేర్లతో రచనలు చేశారు. హార్మోనియం, జలతరంగిణి వాద్యాలు నేర్చుకున్నారు.
1940 వ దశకంలోనే తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి దర్శకత్వం దాకా అన్ని శాఖలను నిర్వహించారు. 1944 లో ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ మేనేజర్ గా పనిచేసే సమయంలో ' సీతారామ జననం ' చిత్రంలో నటించడానికి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు కి మంచి మిత్రుడయ్యారు. అక్కినేని సినీ జీవిత చరిత్రలో పేకేటిది ఒక అధ్యాయం. అక్కినేని జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలకు పేకేటి సాక్షి. వారి మైత్రి చిరకాలం కొనసాగింది.
పేకేటి కొంతకాలం ఫైర్ ఆఫీసర్ గా పని చేశారు. ఇండియన్ న్యూస్ సర్వీసు లో కెమెరామన్ గా కూడా పని చేశారు.
పేకేటి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఆయన నట జీవితంలో చెరిగిపోని ముద్ర వేసిన పాత్ర అక్కినేని ' దేవదాసు ' చిత్రంలోని దేవదాసు మిత్రుడు భగవాన్. ఆ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. దేవదాసు చూసిన ప్రేక్షకులు అక్కినేనిని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో, భగవాన్ పాత్రలో పేకేటిని కూడా అంత బాగానూ గుర్తుంచుకున్నారు.
పేకేటి తెలుగులో చుట్టరికాలు, భలే అబ్బాయిలు, కులగౌరవం, కన్నడంలో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002 లో హెచ్. ఎం. రెడ్డి పురస్కారం అందుకున్నారు.
ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా ఆయన పుత్రుడు. తమిళంలో ప్రముఖ హీరో ప్రశాంత్ పేకేటి శివరాం మనుమడు.
ఈరోజు పేకేటి శివరాం జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ......
Vol. No. 02 Pub. No. 033a
Thursday, September 23, 2010
అస్తమించిన మరో అభ్యుదయం
కళను పూర్తి వ్యాపారాత్మక వస్తువుగా మార్చుకుంది ఈనాటి సినిమా రంగం
కళ కేవలం వ్యాపారం కోసమే కాదు దానికొక సామాజిక బాధ్యత వుంది
ఆ బాధ్యతను గుర్తించిన సినిమా రంగ ప్రముఖులలో కె. బి. తిలక్ కూడా ఒకరు
ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది
జగ్గయ్య, గాయని జానకి, జయప్రద లాంటి వాళ్ళనెందరినో తెలుగు తెరకు అందించారు తిలక్
ఈనాటి తెలుగు చిత్రాల్లో ఆ అభ్యుదయం కనుమరుగైంది
నేడు ఆ అభ్యుదయ దర్శక నిర్మాత అస్తమించాడు
అలాంటి సామాజిక బాధ్యత కలిగిన దర్శక నిర్మాత మళ్ళీ ఎప్పుడో ..... ఎవరో ....
ఈరోజు అస్తమించిన ఆ అభ్యుదయానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.........
Vol. No. 02 Pub. No. 032

Tuesday, August 31, 2010
కలిపిన ' విడదీసే రైలు బళ్ళు '
నువ్వెక్కవలసిన రైలు బండి జీవితకాలం లేటు అన్నారు ప్రముఖ తెలుగు రచయిత ఆరుద్ర. కానీ ఆయన విషయంలో ఆది నిజం కాలేదు.
అలాగే ' విడదీసే రైలు బళ్ళు ' అని రాసిన ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి విషయంలో ఇదీ నిజం కాలేదు. అందుకేనేమో వారిద్దరూ జీవితకాలం లేటు కాకుండా కలిసారు.
భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే అసలు పేరు కల ఆరుద్ర కవిత్వంలో అప్పుడప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కాలంలో అంటే 1950 వ దశకం తొలినాళ్ళలో రామలక్ష్మి ' స్వతంత్ర ' పత్రికలో పనిచేసేవారు. అప్పటికి ఆవిడకు దేవులపల్లి, శ్రీశ్రీ లాంటి వాళ్ళే కవులుగా తెలుసు. ఆరుద్ర పేరు, ఆయన కవిత్వం ఆ పత్రికలోనే ఆవిడకు పరిచయమయ్యారు. ఆయన కవిత్వం నచ్చింది. ఆయనా నచ్చారు. రామలక్ష్మి తన తొలి కథల సంపుటి ' విడదీసే రైలు బళ్ళు ' కు ముందుమాట రాయాల్సిందిగా ఆరుద్ర గారిని కోరారు. అమ్మాయి అడిగిందిగదాని అర్జెంటుగా రాసిచ్చేయలేదాయన. ఆర్నెల్లపాటు అడిగించుకుని మొహమాటం లేకుండా , పొగడ్తలు వగైరా లేకుండా సూటిగా తన అభిప్రాయాన్ని రాసిచ్చారు. అలా ఆ ' విడదీసిన రైలు బళ్ళు ' వాళ్ళని 1955 లో కలిపింది.
నిన్న ( 31 ఆగష్టు ) ఆరుద్రగారి జన్మదినం. ఆ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ........
Vol. No. 02 Pub. No. 017
Friday, August 27, 2010
మహాలక్ష్మి - శ్రీరంజని
శ్రీరంజని వారసురాలిగా మహాలక్ష్మిని మొదట గుర్తించింది అప్పటి మేటి దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి గారు. 1944 లో తన భీష్మ చిత్రంలో సత్యవతి పాత్రనిచ్చి తెలుగు చిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని విడుదల చేసిన చమ్రియా టాకీస్ వారు మహాలక్ష్మి పేరును జూనియర్ శ్రీరంజని గా మార్చారు.
ఆ తర్వాత గొల్లభామ, గృహప్రవేశం, బ్రహ్మరథం, మదాలస వంటి చిత్రాల్లో నటించారు. 1949 లో కదిరి వెంకట రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గుణసుందరి కథ లో గుణసుందరి పాత్ర ఆమెకు స్టార్ హోదా కల్పించిందని చెప్పవచ్చు. దాంతో ఆమె అనేక తెలుగు చిత్రరంగంలోనే కాక తమిళ చిత్రరంగంలో కూడా ప్రముఖ నటిగా వెలుగొందారు. 1960 వరకూ పూర్తిస్థాయిలోను, ఆ తర్వాత 1974 వరకూ అడపాదడపా అతిథి పాత్రల్లోనూ నటించారు. మూడు దశాబ్దాలు కొనసాగిన ఆమె సుదీర్ఘ నట ప్రస్థానం 1974 లో ఆగష్టు 27 వ తేదీన ముగిసింది.
జూనియర్ శ్రీరంజని వర్థంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ............
Vol. No. 02 Pub. No. 014
Thursday, August 26, 2010
అమ్మకు వందనం
నూరేళ్ళు నిండిన అమ్మకు శతసహస్ర వందనం
జనం మదిలో పదిలం మరో వెయ్యేళ్ళు నీ జ్ఞాపకం
Vol. No. 02 Pub. No. 013
Friday, August 20, 2010
హాస్యానికి కొత్త భాష్యం పద్మనాభం

విలక్షణ హాస్యనటుడు పద్మనాభం
మనకందించాడు నవ్వుల లాభం
హాస్యంలో ఆయనదొక ప్రత్యేక బాణీ
మనకందించింది ఆయన వినూత్న వాణి
తడిపేసాడు ఆంధ్రదేశాన్ని నవ్వుల వర్షంలో
కురిపిస్తుంటాడు అదే జడి స్వర్గలోకంలో
హాస్యలోకంలో చిరంజీవి ఆయన
హాస్యానికే కొత్త భాష్యం ఆయన
ఈరోజు పద్మనాభం గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..........
Vol. No. 02 Pub. No. 009
Monday, August 16, 2010
నవరసాల నటీమణి
నవరసాల నటీమణి ఋష్యేంద్రమణి
1917 నూతన సంవత్సరం రోజున విజయవాడలో జన్మించిన ఋష్యేంద్రమణి తొలిచిత్రం 1935 లో వచ్చిన ' శ్రీకృష్ణతులాభారం ' .అంతకుముందు అతి చిన్నవయసులోనే రంగస్థలాన్ని అలరించింది. కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం లాంటి ప్రముఖ నటుల వద్ద నాటక కళలో ఓనమాలు నేర్చుకుంది.
మొదటి చిత్రం పరాజయం పాలు కావడంతో తిరిగి రంగస్థలాన్ని ఆశ్రయించిన ఋష్యేంద్రమణి ఆమె భర్త జవ్వాది రామకృష్ణారావు నాయుడు ప్రోత్సాహంతో 1942 లో మళ్ళీ ' సీతారామ జననం ' చిత్రంతో పున: ప్రవేశం చేసింది.
తమిళ చిత్రం ' పత్ని ' ( 1942 ) లో తమిళ ఇతిహాసం ' శిలప్పదికారం ' లోని కన్నగి పాత్ర ధరించడంతో ఆమె ప్రతిభ చిత్రరంగంలో తెలిసింది. అప్పటినుండి ఇంక తిరిగి చూడలేదు. అనేక రకాల పాత్రలు వివిధ చిత్రాల్లో పోషించింది.
1943 లోను, 1958 లోను వచ్చిన ' చెంచులక్ష్మి ' చిత్రాలు రెండింటిలో నటించింది. విజయా సంస్థలో చాలా చిత్రాల్లో నటించింది.
హావబావాలు అలవోకగా పలికించడంలోను, నవరసాల్ని అవలీలగా పోషించడంలోను, సంభాషణలు మంచి టైమింగ్ తో పలకడంలోను ఆమెకు ఆమే సాటి.
2002 ఆగష్టు 17 వ తేదీన ఋష్యేంద్రమణి స్వర్గస్థురాలయింది. ఆమె వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ...
ఆమె నటనా కౌశలాన్ని తెలిపే సన్నివేశాలతో................కళానీరాజనం
Vol. No. 02 Pub. No. 005
Monday, August 2, 2010
నటరత్నం ' బళ్ళారి రాఘవ '
బళ్ళారి రాఘవ - ఆధునికాంధ్ర నాటక రంగం కలకాలం గుర్తుంచుకోవలసిన పేరు.
అప్పటివరకూ పౌరాణిక పద్యనాటకాలలో రాగాలు సాహిత్యాన్ని, ఒక్కోసారి పాత్ర ఔచిత్యాన్ని మింగేస్తూ ఉండేవి. ఆ సమయంలో పద్యాలలో రాగాలకంటే సాహిత్యాన్ని వినబడేటట్లు చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించి అమలులో పెట్టి విజయం సాధించిన వారు బళ్ళారి రాఘవ.
అంతేకాదు. పౌరాణిక నాటకాల హోరులో కొట్టుకుపోతున్న తెలుగు నాటక రంగాన్ని సాంఘిక నాటకాలవైపు మళ్ళించడానికి ఎనలేని కృషి చేశారు రాఘవ. సమకాలీన సమస్యలను ప్రతిబించే నాటకాలు రావాలని కోరుకుని ఎన్నో సాంఘిక నాటకాల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగష్టు 2 వ తేదీన నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు జన్మించారు రాఘవ. మద్రాసు లా కళాశాల నుండి న్యాయవాద పట్టా పొంది మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి ప్రఖ్యాతి పొందారు. ఆ రంగంలో ఆయన ఘనతను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ' రావు బహద్దూర్ ' బిరుదుతో సత్కరించింది.
న్యాయవాదం ఆయన వృత్తి అయితే నాటకం ఆయన ప్రవృత్తి. పన్నెండవ ఏటనే రంగస్థలం ఎక్కిన రాఘవ బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ స్థాపించి ఆయన నాటకాలు ప్రదర్శించేవారు. తర్వాత బెంగళూర్ లోని కోలాచలం శ్రీనివాసరావు బృందంతో కలసి చాలా నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరించారు. తెలుగు నాటకాన్ని విశ్వవ్యాప్తం చేసిన కళాతపస్వి బళ్ళారి రాఘవ. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ టాగోర్ లాంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన మహానటుడు బళ్ళారి రాఘవ.
1936 లో ' ద్రౌపదీ మానసంరక్షణ ' లో దుర్యోధనుడి పాత్రతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసినా ఎక్కువ కాలం అక్కడ ఇమడలేకపోయారు.
హరిశ్చంద్ర, ప్రహ్లాద, పాదుకాపట్టాభిషేకం, సావిత్రి, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు మొదలైన పౌరాణిక, సాంఘిక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు.
బందా కనకలింగేశ్వరరావు, బసవరాజు అప్పారావు, కొమ్మూరి పద్మావతి, కొప్పరపు సరోజినీ లాంటి శిష్యులెందరినో తయారు చేశారు. ఆయన సంస్మరణార్థం నాటక రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ' బళ్ళారి రాఘవ పురస్కారం ' ఏర్పాటు చెయ్యబడింది.
తెలుగు నాటక రంగానికి జీవితాంతం విశిష్టమైన సేవలందించిన ఆ మహానటుడి జయంతి సందర్భంగా ఆయన నటించిన ' భక్తప్రహ్లాద ' నాటకం రికార్డులను
టాలీ నేషన్ - స్వర నీరాజనం ద్వారా వినండి.
Vol. No. 01 Pub. No. 361

Friday, July 30, 2010
గిలిగింతల ' అల్లు '
హాస్యానికి పుట్టినిల్లు
ఏ పాత్రకైనా చెల్లు
కురిసే హాస్యపు జల్లు
గిలిగింతల ' అల్లు '
ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్లుంటుంది
అల్లురామలింగయ్య గారి గురించి, ఆయన నటన గురించి,
ముఖ్యంగా ఆయన హాస్యాన్ని గురించి చెప్పడం.
హాస్యనటులలో పద్మశ్రీని అందుకున్న అరుదైన గౌరవం ఆయనది
రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని పొందిన విశిష్టత ఆయనది
ఉన్నతమైన ఆ అవార్డులను మించిన ప్రేక్షకుల రివార్డులు అందుకున్న వ్యక్తిత్వం ఆయనది
ఈరోజు ( జూలై 31 ) అల్లురామలింగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయనకు హాస్యాంజలులు సమర్పిస్తూ....
Vol. No. 01 Pub. No. 359
జూలై 30
1922 వ సంవత్సరం జూలై 30 వ తారీఖు
అవినీతిని, అన్యాయాన్నీ కలమే బలంగా
అక్షరమే ఆయుధంగా ఎదుర్కొన్న రచనా యోధుడు
రావిశాస్త్రి అనబడే రాచకొండ విశ్వనాధశాస్త్రి పుట్టిన రోజు
ఆయన కథావస్తువు వాస్తవ ప్రపంచం
ఆయన పాత్రలు మనచుట్టూ వున్న సామాన్యులు
సాహితీ ప్రియులకు ఆయన రావిశాస్త్రి
బడుగు ప్రజలకు ఆయన చాత్రిబాబు
' ఆరు సారో కథలు ' వినిపిస్తాయి ' ఆరు సారా కథలు '
అల్పజీవి నుండి ఇల్లు వరకూ సాగింది నవలా ప్రయాణం
రచనలెన్నైనా సామాన్య జనుల వెతలే ఆయన రాతలు
వాటినిండా వారి జీవితాల్ని మింగేస్తున్న అవినీతి, అన్యాయాలు
ఆయన మార్గం విప్లవమా ? సాంప్రదాయమా ?
సంప్రదాయంలోంచి పుట్టిన విప్లవం
ఆయన వాదం నైతికమా ? అనైతికమా ?
అనైతికతను ప్రశ్నించగలిగే నైతికత
సమాజ హితాన్ని కోరే దేన్నైనా స్వీకరించగలగడం ఆయన సహృదయత
విశ్వనాథుని శిరసునుండి వేగంగా ప్రవహించే గంగా ప్రవాహం ఆయన శైలి
' నిజం ' నిర్భయంగా చెప్పగలగడం, భేషజమనేది లేకపోవడం ఆయన నైజం
తెలుగు రచనకు, తెలుగుదనానికి అచ్చతెనుగు సంతకం రావిశాస్త్రి
రావిశాస్త్రి గారి జన్మదినం సందర్భంగా ఆయన, ఆయన రచనల స్మృతులతో .......................
Vol. No. 01 Pub. No. 357

Sunday, July 25, 2010
కార్గిల్ అమర వీరులకు జోహార్లు
దేశరక్షణలో నిస్వార్థంగా 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం చేసి ప్రాణాలర్పించిన వీరుల గౌరవార్థం ఈరోజు కొంత సమయం కేటాయిద్దాం.
మనం సినీ నటుల్నో, క్రికెటర్ లనో ఆరాధించేముందు వారి కంటే ఆ ఆరాధనకు నిజంగా అర్హులైన వాళ్ళు వేరే వున్నారని గుర్తించాలి. ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా వారి త్యాగాలకు ప్రణామాలర్పిస్తూ.....
1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు తన కుటుంబానికి రాసిన లేఖలోని సారాంశం :
పాకిస్తాన్ నుండి మన చివరి పర్వతాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నాం.
కానీ విలువైన గొప్ప సైనిక సోదరుల్ని పోగొట్టుకున్నాం. ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన తరుణం.
కార్గిల్ యుద్ధంలో అమరులైన
కు అంజలి ఘటిద్దాం !
లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా
అతని జ్ఞాపకంగా అతను ధరించిన యూనిఫారం
కెప్టైన్ విక్రం బాత్రా
పరమ వీర చక్ర ( మరణానంతరం )
గ్రేనడీర్ యోగేంద్ర సింగ్
పరమ వీర చక్ర
RFN .సంజయ్ కుమార్
(పరమ వీర్ చక్ర )
మేజర్ పద్మపాణి ఆచార్య,
మహా వీర్ చక్ర ( మరణానంతరం )
2 వ బెటాలియన్, రాజపుటాన రైఫిల్స్
లెఫ్టినెంట్ బలవాన్ సింగ్,
మహా వీర్ చక్ర
18 వ బెటాలియన్, గ్రేనేడర్స్ రెజిమెంట్
మేజర్ M శరవణన్,
వీర్ చక్ర ,
1 బీహార్
లెఫ్టినెంట్ కనద్ భట్టాచార్య,
సేన మెడల్ ( మరణానంతరం )( 22 సంవత్సరాలు )
సిఖ్ లి
కెప్టైన్ సాజు చెరియన్ ,
సేన మెడల్
307 మీడియం రెజిమెంట్
లెఫ్టినెంట్ కీషింగ్ క్లిఫ్ఫార్డ్ నంగ్రుం,
మహా వీర్ చక్ర ( మరణానంతరం )
12 వ బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ
కెప్టైన్ R జెర్రీ ప్రేమ్ రాజ్ ,
వీర్ చక్ర ( మరణానంతరం ),
158 మీడియం రెజిమెంట్
మేజర్ సోనం వాంగ్ ఛుక్ ,
మహా వీర్ చక్ర
లడఖ్ స్కౌట్స్
టోలోలింగ్ శిఖరాన్ని జయించిన తర్వాత ద్రాస్ సబ్ సెక్టార్ లో వున్న నల్లరాతి నాల్ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య ( ఆంధ్రప్రదేశ్ ) తన దళాన్ని నడిపిస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ఆయన 29 జూన్ 1999 న అమరుడయ్యారు.
ఆయనకు మరణానంతరం పరమ వీర చక్ర పురస్కారం లభించింది.
మన సైనికుల సాహస విన్యాసాలు
శ్రీనగర్ - కార్గిల్ రోడ్ గా పిలువబడే లే - బాతాలిక్ రహదారి అత్యంత ప్రమాదకరమైనది. ఏటవాలుగా ఉండే పర్వత ప్రాంతాలలో ప్రాణాలను పణంగా పెట్టి పహారా కాస్తుంటారు మన జవానులు. ఎల్లప్పుడూ యుద్ధ వాతావరణంతో విశ్రాంతికి, ఆలోచించుకోవడానికి కూడా వారికి చాల స్వల్ప సమయమే దొరుకుతుంది.
అనునిత్యం ప్రమాదాల అంచున ప్రయాణించే మన వీర జవానులకు ఈ కొండ అంచున వున్న సన్నని రహదారి ఓ లెఖ్ఖా ?
కెప్టెన్ విజయాంత్ థాపర్ ( రాబిన్ )
తన 22 వ ఏట మనందరి భవిష్యత్తుకై ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు
తన తల్లిదండ్రులకు విజయాంత్ రాసిన చివరి ఉత్తరం
ఆ తర్వాత మువ్వన్నెల జెండా కప్పుకుని ఇంటికి జేరాడు

ఆనాటి కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన 23 మంది సైనికుల త్యాగం
మరువలేనిది. ఆ బెటాలియన్ భారత దేశంలో అత్యంత ప్రతిష్థాకరమైన మహవీర చక్ర పురస్కారాలు నాలుగు లభించాయి. అందులో మూడు మరణానంతరం అందించారు.
శత్రు సంహారంలో మరణించిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ వివేక్ గుప్తా భౌతిక కాయానికి ఆయన భార్య ఆర్మీ మెడికల్ కార్ప్స్ కి చెందిన కెప్టెన్ ( డా. ) రాజశ్రీ గుప్తా సెల్యూట్ చేస్తున్న దృశ్యం.
మన రక్షణ కోసం ప్ర్రాణాలను పణంగా పెట్టిన మన వీర జవానులను చూసి మనమంతా గర్వపడాలి
ముఖ్యంగా భారతీయులమైనందుకు గర్వపడాలి
Vol. No. 01 Pub. No. 354
మనం సినీ నటుల్నో, క్రికెటర్ లనో ఆరాధించేముందు వారి కంటే ఆ ఆరాధనకు నిజంగా అర్హులైన వాళ్ళు వేరే వున్నారని గుర్తించాలి. ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా వారి త్యాగాలకు ప్రణామాలర్పిస్తూ.....
1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు తన కుటుంబానికి రాసిన లేఖలోని సారాంశం :
పాకిస్తాన్ నుండి మన చివరి పర్వతాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నాం.
కానీ విలువైన గొప్ప సైనిక సోదరుల్ని పోగొట్టుకున్నాం. ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన తరుణం.
కార్గిల్ యుద్ధంలో అమరులైన
కు అంజలి ఘటిద్దాం !
లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా
అతని జ్ఞాపకంగా అతను ధరించిన యూనిఫారం
కెప్టైన్ విక్రం బాత్రా
పరమ వీర చక్ర ( మరణానంతరం )
గ్రేనడీర్ యోగేంద్ర సింగ్
పరమ వీర చక్ర
RFN .సంజయ్ కుమార్
(పరమ వీర్ చక్ర )
మేజర్ పద్మపాణి ఆచార్య,
మహా వీర్ చక్ర ( మరణానంతరం )
2 వ బెటాలియన్, రాజపుటాన రైఫిల్స్
లెఫ్టినెంట్ బలవాన్ సింగ్,
మహా వీర్ చక్ర
18 వ బెటాలియన్, గ్రేనేడర్స్ రెజిమెంట్
మేజర్ M శరవణన్,
వీర్ చక్ర ,
1 బీహార్
లెఫ్టినెంట్ కనద్ భట్టాచార్య,
సేన మెడల్ ( మరణానంతరం )( 22 సంవత్సరాలు )
సిఖ్ లి
కెప్టైన్ సాజు చెరియన్ ,
సేన మెడల్
307 మీడియం రెజిమెంట్
లెఫ్టినెంట్ కీషింగ్ క్లిఫ్ఫార్డ్ నంగ్రుం,
మహా వీర్ చక్ర ( మరణానంతరం )
12 వ బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ
కెప్టైన్ R జెర్రీ ప్రేమ్ రాజ్ ,
వీర్ చక్ర ( మరణానంతరం ),
158 మీడియం రెజిమెంట్
మేజర్ సోనం వాంగ్ ఛుక్ ,
మహా వీర్ చక్ర
లడఖ్ స్కౌట్స్
యుద్దానికి బయిల్దేరే ముందు రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన జవానులు, సైన్యాధికార్లు ప్రార్థన చేస్తున్న దృశ్యం.
ముందు రైఫిల్ తో వున్న సైనికుని వెనుక గెడ్డంతో ముఖం కొంతమేర కప్పబడి వున్న వ్యక్తి కెప్టెన్ విజయంత్ తాపర్. ఆయనకు మరణానంతరం వీర చక్ర బిరుదు ఇవ్వబడింది. టోలోలింగ్ శిఖరాన్ని జయించిన తర్వాత ద్రాస్ సబ్ సెక్టార్ లో వున్న నల్లరాతి నాల్ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య ( ఆంధ్రప్రదేశ్ ) తన దళాన్ని నడిపిస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ఆయన 29 జూన్ 1999 న అమరుడయ్యారు.
ఆయనకు మరణానంతరం పరమ వీర చక్ర పురస్కారం లభించింది.
మన సైనికుల సాహస విన్యాసాలు
శ్రీనగర్ - కార్గిల్ రోడ్ గా పిలువబడే లే - బాతాలిక్ రహదారి అత్యంత ప్రమాదకరమైనది. ఏటవాలుగా ఉండే పర్వత ప్రాంతాలలో ప్రాణాలను పణంగా పెట్టి పహారా కాస్తుంటారు మన జవానులు. ఎల్లప్పుడూ యుద్ధ వాతావరణంతో విశ్రాంతికి, ఆలోచించుకోవడానికి కూడా వారికి చాల స్వల్ప సమయమే దొరుకుతుంది.
అనునిత్యం ప్రమాదాల అంచున ప్రయాణించే మన వీర జవానులకు ఈ కొండ అంచున వున్న సన్నని రహదారి ఓ లెఖ్ఖా ?
కెప్టెన్ విజయాంత్ థాపర్ ( రాబిన్ )
తన 22 వ ఏట మనందరి భవిష్యత్తుకై ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు
తన తల్లిదండ్రులకు విజయాంత్ రాసిన చివరి ఉత్తరం
ఆ తర్వాత మువ్వన్నెల జెండా కప్పుకుని ఇంటికి జేరాడు

ఆనాటి కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన 23 మంది సైనికుల త్యాగం
మరువలేనిది. ఆ బెటాలియన్ భారత దేశంలో అత్యంత ప్రతిష్థాకరమైన మహవీర చక్ర పురస్కారాలు నాలుగు లభించాయి. అందులో మూడు మరణానంతరం అందించారు.
శత్రు సంహారంలో మరణించిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ వివేక్ గుప్తా భౌతిక కాయానికి ఆయన భార్య ఆర్మీ మెడికల్ కార్ప్స్ కి చెందిన కెప్టెన్ ( డా. ) రాజశ్రీ గుప్తా సెల్యూట్ చేస్తున్న దృశ్యం.
మన రక్షణ కోసం ప్ర్రాణాలను పణంగా పెట్టిన మన వీర జవానులను చూసి మనమంతా గర్వపడాలి
ముఖ్యంగా భారతీయులమైనందుకు గర్వపడాలి
Vol. No. 01 Pub. No. 354
Thursday, July 22, 2010
కోటి రతనాల పాట ' దాశరధి '
ఆ కలం ' అగ్నిధార ' యై నిజాం మీద నిప్పులు కురిపించింది
ఆ కలం పేదల ఆకలిని ' రుద్రవీణ ' పై పలికించింది
ఆ కలం ' మహాంధ్రోదయం ' కి నాంది పలికింది
ఆ కలం ' గాలిబ్ గీతాలు ' అనువదించింది
ఆ కలం ' తిమిరంతో సమరం ' చేసింది
ఆ కలం మనందరికీ ' కవితాపుష్పకం ' పంచింది
ఆ కలం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారమందుకుంది
ఆ కలం తెలుగు ప్రజల సాహితీ నీరాజనాలందుకుంది
ఆ కలం తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించింది
............... ఆ కలం దాశరధి కృష్ణమాచార్యులుది.
తెలుగు కవితా భారతిని తన కవిత్వంతో పరిపుష్టం చేసిన కవి దాశరధి.
తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన కవి దాశరధి.
దాశరధి గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతుల రతనాలు కొన్ని .......
Vol. No. 01 Pub. No. 352
Thursday, July 15, 2010
మధురకవి అస్తమయం
మధుర కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు
భావగీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు ఎన్నో ఎన్నెన్నో...
మధురమైన రచనలు ఎన్నిటినో ఆయన కలం అందించింది
ఆ గీతాల ఆలాపనతో గాయనీ గాయకులు తరించారు
ఆ గీతాలు ప్రసారం చేసి ఆకాశవాణి పులకించింది
తెలుగు కవితామతల్లి ముద్దుబిడ్డ డా. వక్కలంక
అందుకేనేమో ఆ తల్లి అన్నట్లుంది పుడమిని చాలింకని
ఆయన కవితాగంధం పరిమళాలని తాము కూడా అందుకోవాలని
అందుకేనా వెళ్ళిపోయారు ఆతల్లి మాట జవదాటనని
పాటంటే ఏమిటో పరిచయం చేశారు
కవిత్వాన్ని రుచి చూపించారు
భాషలోని సొగసుని తెలిపారు
దగ్గరుండి అక్షరదోషాలు సవరించారు
ఈనాడు ఈ మాత్రం భాషా జ్ఞానం ఆయన భిక్ష
ఈ మాత్రం రాయగలిగే దైర్యమిచ్చింది ఆయన శిక్షణ
ఆయన పుస్తకాలకు మేలు ప్రతులను రాసే వరమివ్వడం నా అదృష్టం
ఆ మహానుభావుడి శిష్యరికం నా జీవితంలో మరువలేని ఘట్టం
మరణం అనివార్యమని తెలుసు
మనమెవరం తప్పించుకోలేమని తెలుసు
ఇదంతా ఆ పరిస్థితి ఎదురవనంతవరకూ మాత్రమే
ఎదురైనప్పుడు మాత్రం తట్టుకోవడం కష్టమే !
అందుకే ఆయన లేరనే విషయం నమ్మబుద్ధి కావటం లేదు
ఆయన అందించిన కవితా జ్యోతులు వెలుగుతూనే వున్నాయి
ఆయన వినిపించిన గీతాలు సుస్వరాలను పంచుతూనే వున్నాయి
అవి ఎప్పుడూ...ఎల్లప్పుడూ...... సంగీత, కవితా ప్రియుల మనస్సులో నిలిచే వుంటాయి
గురువు గారికి అశ్రునయనాలతో ఆయన రాసిన ఆణిముత్యాలలో ఒకటి .................
ఆదివారం ( 11 - 07 - 2010 ) హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో జరిగిన సంతాప సభ వార్త - ఆంధ్రజ్యోతి నుండి.....
Vol. No. 01 Pub. No. 347
Subscribe to:
Posts (Atom)