మొన్న క్రోధంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణవేణమ్మ విరుచుకుపడింది తన ప్రవాహానికి అడ్డుకట్టిన ఊళ్లమీద
నిన్నటివరకూ నిప్పులు చెరిగిన భానుడు చెలరేగిపోయాడు తనని కూడా లెక్క చెయ్యని జనం మీద
ఈరోజు ఆగ్రహంతో ఊగిపోతున్న సముద్రుడు విరుచుకుపడబోతున్నాడు మరోసారి సామాన్య ప్రజల మీద
ఓ కృష్ణమ్మా ! ఓ భానుడా ! ఓ సాగరుడా ! మీకు కూడా డొక్కలెండిన సామాన్యుడే లోకువా ? మీ ప్రవాహంతో అవినీతిని కడగలేరా ? మీ ప్రతాపంతో అన్యాయాన్ని భస్మం చెయ్యలేరా ? మీ అలల వేగంతో కుత్సితం నిండిన వ్యవస్థను ముంచెత్తలేరా ?
నాకు మెయిల్ లో ఒక ఇంటర్నెట్ మిత్రుడు పంపిన సమాచారం ఆధారంగా,,,,,,,,,,,,,,,,
బెంగుళూరులో పది సంవత్సరాల బాలుడు పదిహేను రోజుల క్రితం ఒక అనాసపండు ( పైనాపిల్ ) తిన్నాడు. ఆరోజునుంచి అతను జబ్బు పడ్డాడు. అతన్ని ఆరోగ్య పరీక్షలకోసం తీసుకెళ్ళారు.........
ఆ పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ వుందని నిర్థారణ అయింది.
ఆ బాలుని తల్లిదండ్రులు ఈ విషయం నమ్మలేకపోయారు..... మొత్తం కుటుంబం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది.....ఎవరికీ ఎయిడ్స్ లేదని తేలింది. అప్పుడు డాక్టర్లు అతన్ని జబ్బు పడటానికి ముందు తిన్న పదార్థాల గురించి ప్రశ్నించారు. అతను ఆ రోజు తిన్న అనాసపండు విషయం బయిట పడింది. అంతే !! ఆస్పత్రినుంచి ఓ బృందం ఆ అనాసపండు అమ్మినతని దగ్గరకు వెళ్ళింది.
ఆరోజు జరిగిన విషయం గురించి విచారించారు. వారికో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ అనాసపండు కోస్తుండగా ఆ పండ్లు అమ్మే అతని చేతి వేలు తెగి రక్తం కారి ఆ పండు ముక్కలకు అంటినట్లు తెలిసింది.
దాంతో అతనికి రక్త పరీక్ష చెయ్యగా అతనికి ఎయిడ్స్ వుందని తెలిసింది. దురదృష్టవశాత్తూ అతనికా విషయం తెలియక పోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఆ మహమ్మారి అతని రక్తం ద్వారా ఆ బాలునికి అంటింది. చెయ్యని పాపానికి ముక్కుపచ్చలారని ఆ బాలుడు బలయ్యాడు.
అందుకే రోడ్ పక్కన అమ్మే చాట్ మసాలాలు, పానీ పూరీలు వగైరా తినే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. మీ ప్రమేయం లేకుండా ఇలాంటి రోగాల బారిన పడకండి.
ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువమందికి ముఖ్యంగా మీ పిల్లలకు చేరేటట్లు చూడండి. బహుపరాక్ !!!
A 10 year old boy, had eaten pineapple about 15 days back, and fell sick, from the day he had eaten. Later when he had his Health check done...... doctors diagnosed that he had AIDS.
His parents couldn't believe it...Then the entire family under went a checkup... none of them suffered from Aids. So the doctors checked again with the boy if he had eaten out....The boy said 'yes'. He had pineapple that evening. Immediately a group from the hospital went to the pineapple vendor to check.
They found the pineapple seller had a cut on his finger while cutting the pineapple; his blood had spread into the fruit.
When they had his blood checked...the guy was suffering from AIDS...but he himself was NOT aware. Unfortunately the boy is suffering from it now.
Please take care while u eat on the road side (particularly tasty vada pav & Paani Puri) and pls fwd this mail to your dear one's..
ఈ రోజు అంటే ఫిబ్రవరి 21 వ తేదీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఆ సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగుకి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు శ్రీ నూర్ రెహమతుల్లా గారు. ఈయన తెలుగు భాషా వ్యాప్తికి, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారిగా తనకున్న విస్తృతాధికారాల్ని తెలుగు భాషా వ్యాప్తికి ఉపయోగించడం ఎంతైనా అభినందనీయం. తెలుగుకు ప్రాభవానికి విశేషమైన కృషి చేస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతూ, తెలుగు భాషను ప్రేమించే వారందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో రెహమతుల్లాగారు అందించిన ఈ వ్యాసం...................
విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట * కడప జిల్లా మైదుకూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టి స్ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009) పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే. ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్ ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)- తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010) అంతరించిపోతున్నఅమ్మభాష దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్, రోమన్, జర్మన్ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్ హాల్డెన్ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)
1921 - ఇతర భాషల వారు తెలుగు భాషను చిన్న చూపు చూడటం సహించలేక తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిజాం పాలన క్రింద ఉన్న తెలంగాణా ప్రాంతంలో టేకుమళ్ళ రంగారావు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలైన వారు ' ఆంధ్ర జన సంఘం ' ఏర్పాటు చేశారు. 1937- నిజామాబాద్ లో జరిగిన ఆంధ్రసభలో బాధ్యతాయుతమైన పాలన కావాలని, బ్రిటిష్ ఇండియాలో వలె సంస్కరణలు అమలుచేయ్యాలని మొదటి రాజకీయ తీర్మానం చేశారు. 1938 - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. నిజాం దానిని నిషేధించాడు. 1939_40 - సోషలిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ పార్టీ అవతరించింది. 1946 - హైదరాబాద్ సంస్థానంలో రాజకీయాలు మితవాద, అతివాద రాజకీయాలుగా విడిపోయాయి. వీరిని అణచడానికి నిజాం అండదండలతో ' రజాకార్లు ' తయారయ్యారు. 1947 - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం నవాబు భారత యూనియన్ చేరకుండా యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలంగాణా ప్రజలపై రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి. 1948 - భారత ప్రభుత్వ సైనిక చర్యతో తెలంగాణా ప్రజలకు నిజాం పీడ వదిలిపోయింది. 1952_56 - హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నపుడు కొందరు తెలంగాణా విడిగానే ఉండాలని పట్టుబట్టగా బూర్గుల రామకృష్ణారావు వారికి మద్దతిచ్చారు. విశాలాంధ్ర ఖాయమని తేలిపోయాక అభిప్రాయం మార్చుకుని దానికి తన మద్దతును ప్రకటించి ద్వంద్వ నీతిని ప్రదర్శించారు. 1956 - రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదిక ఆధారంగా కుదిరిన పెద్దమనుష్యుల ఒప్పదం ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందిరినీ ఏకం చేస్తూ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసింది. 1969 - ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఋజువు కావడంతో చెన్నారెడ్డిని ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చెయ్యకూడాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో తెలంగాణా వారిని ఆంధ్ర వాళ్లు అణగదొక్కుతూన్నారంటూ ఉద్యమం ప్రారంభమయింది. వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది జీవితాలు బలయ్యాయి. కానీ ఆ ఉద్యమం చెన్నారెడ్డి రాజకీయానికి బలైపోయింది. 1972- తెలంగాణా ఉద్యమ ఫలితంగా అధిష్టానం బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పి. వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా చేసింది. ఈ చర్యకు ఫలితంగా భూసంస్కరణలు అమలు, ముల్కీనిబంధనలపైసుప్రీంకోర్ట్స్టే కారణాలుగా చూపుతూ ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. చివరికి అది కూడా రాజకీయ ప్రయోజనాలకి బలయిపోయింది.
ఏ ఉద్యమ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అమాయకుల బలిదానం నాయకుల స్వలాభం ఇది చరిత్ర చెప్పిన సత్యం
1969 తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదంతో హోరెత్తింది భవిష్యత్తు పై కలలుకన్న విద్యార్థులెందరో బలయ్యారు వారి ఆవేశమేస్వార్థరాజకీయనాయకులపెట్టుబడి ఉద్యమం ఆ నాయకుల చేతిలోనే బలయ్యింది 1973 ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ఇందులో కూడా విద్యార్థులే బలయ్యారు అర్థ సంవత్సరం పైన నడిచింది ఈ ఉద్యమం కూడా షరా మామూలే ! 2009 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది విద్యార్థులూ.....!! బహు పరాక్ !!! మరోసారి నాయకుల రాజకీయ లబ్దికి బలవకండి చరిత్ర ఇప్పటికే పునరావృత్తమయింది
" కృషి ఉంటే మనుష్యులు ఋషులవుతారు " కొంచెం ప్రేరణ, ప్రోత్సాహం ఉంటే ఏపని నేర్చుకోవడానికైనా విద్య, ఆర్ధిక పరిస్థితి, లింగ బేధాలు వగైరా అడ్డంకి కాదు. పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపిస్తూ మహిళా సాధికారతకు దర్పణమైన ఈ వీడియో చూడండి.
కృష్ణమ్మకు ఆగ్రహమొచ్చింది. కట్టలు తెంచుకుంది. బీభత్సం సృష్టిస్తోంది. ఇంకా ఎంతకాలం ఈ ప్రళయం కొనసాగుతుందో, ఎంత నష్టం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి. మొన్నటిదాకా వరుణుడి రాకకోసం ఎదురు చూసాం. ఇప్పుడు మాత్రం పోకకోసం ప్రార్థించవలసిన పరిస్థితి. రెండు జిల్లాల ప్రజల్ని కన్నీటితో ముంచెత్తిన కృష్ణమ్మ ఇంకా కరుణించేటట్లు లేదు. ప్రకృతి కోపమొస్తే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూపిస్తోంది. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటనేది అలవాటు ప్రకారం పోస్ట్ మార్టం చేసుకుంటే అన్ని విషయాలు ప్రక్కన పెట్టి చేసిన, చేస్తున్న మానవ తప్పిదాలకు మూల్యం చెల్లిస్తున్నాం అనేది స్పష్టం. అది ప్రభుత్వ వైఫల్యం అని ప్రతిపక్షాలు, అధికారుల వైఫల్యమని ప్రజలు అనుకుంటూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూర్చోవడం కంటే ఈ వాస్తవాలు గ్రహించడం మంచిది. ఈ దుస్థితికి కారణం అడవులు విచ్చలవిడిగా నరకడం, కాలుష్యాల్ని పెంచేసుకోవడం , ప్లాస్టిక్ లాంటి పదార్ధాల వాడకం పెరగడం.... ఇత్యాదివెన్నో !! కర్ణుడి చావుకి కారణాలెన్నో !!! విపత్తు జరిగినపుడు హడావిడి పడడం కంటే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, జాగ్రత్త వహించడమే మన తక్షణ కర్తవ్యమ్ !!!