Friday, February 19, 2010

తెలుగు చలనచిత్రరంగ ' స్వాతికిరణం '

ఆయన చిత్రాలలో సంస్కారం వుంటుంది
ఆయన పాటలలో సభ్యత వుంటుంది

ఆయన చిత్రాలలో సంగీత సాహిత్యాలు సమాలంకృతాలు
ఆయన పాటలలో అణువణువునా నాట్య వేదనాదాలు

ఆయన చిత్రాలలో సహజత్వం వుంటుంది
ఆయన పాటలలో హృదయం వుంటుంది

ఆయన చిత్రాలు కళాత్మకాలు
ఆయన చిత్రాలు వ్యాపారాత్మకాలు కూడా

ఆయన చిత్రాలు కాసులూ కురిపించాయి
ఆయన చిత్రాలు ప్రశంసలూ కురిపించాయి

ఆయన చిత్రాలు పండితులూ చూస్తారు
ఆయన చిత్రాలు పామరులూ చూస్తారు

ఆయన వ్యాపారాత్మక చిత్రాలు తీసి విజయం సాధించారు
ఆయన కళాత్మక చిత్రాలు తీసి విజయాలు చవి చూసారు

ఆయన ప్రయోగాత్మక చిత్రాలూ తీసారు
ఆయన సందేశాత్మక చిత్రాలు తీసారు

ఆయన సినిమాలు ఇంటిల్ల పాదీ చూసి ఆనందించవచ్చు
ఆయన పాటలు ఆబాలగోపాలమూ పాడుకుని పరవశించవచ్చు 

ఆయన కళాకారుడు, కళా పిపాసి, కళా తపస్వి
ఆయనే కళాత్మక చిత్రాలకి, వ్యాపారాత్మక చిత్రాలకు గల అంతరాన్ని చెరిపేసిన దర్శకుడు
శ్రీ కాశీనాథుని విశ్వనాథ్

గురువు గారు శ్రీ కె. విశ్వనాథ్ గారి జన్మదిన సందర్భంగా నమస్సుమాంజులులతో............................. 

  

Vol. No. 01 Pub. No. 202

4 comments:

  1. కొందరు కారణ జన్ములు అంటారు. విశ్వనాద్ గారికి ఎంతో వర్తిస్తుంది. మొన్న ఎవరి బ్లాగ్ లోనో చూశాను, చేతికర్ర తో రేస్తోరెంట్ లో కనపడ్డారుట. హ్యాపీ బర్తు డే సార్.

    ReplyDelete
  2. బావుందండి పాటల కదంబం. వైవిధ్యం ఉన్న పాటలని ఎంచి పెట్టారు. బాలకృష్ణ పాట జననీ జన్మభూమి లోదనుకుంటాను.
    ఇన్నున్నా మాయాబజార్ లో శాస్త్రి శర్మలు అడిగినట్టు, అసలైన సినిమాలో పాట ఒక్కటైనా లేదేంటండీ? :-)

    ReplyDelete
  3. * మురళి గారూ !
    * రావు గారూ !
    * ఊ.దం. గారూ !

    ధన్యవాదాలు

    * కామేశ్వరరావు గారూ !
    ముందుగా ధన్యవాదాలు. ఆ పాట జననీ జన్మభూమిలోనిదే ! అందరికీ బాగా తెలిసిన వాటికంటే అంతగా తెలియని, గుర్తులేని పాటలు పెట్టాలనుకున్నాను. నా జ్ఞాపకాలు కూడా రాయాలనుకున్నాను. కానీ సమయాభావం వల్ల కుదరలేదు.

    ReplyDelete