Wednesday, February 24, 2010

నమ్మిన బంటు

1960 లో విడుదలయిన చిత్రం ' నమ్మినబంటు '. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న తొలి తెలుగు చిత్రం ' నమ్మిన బంటు '. ఆ చిత్ర విశేషాలు కొన్ని ..................

* శంభు ఫిల్మ్స్ పతాకం పైన యార్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. 
* అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, ఎస్వీ రంగారావు, రేలంగి, గిరిజ, చదలవాడ మొదలైన హేమాహేమీలు నటించిన  ఈ చిత్రంలో రామలక్ష్మణలనే రెండు ఎద్దులు, ఒక పాము కూడా నటించాయి.
అప్పట్లో దొక సంచలనం. 
* ఈ చిత్రానికి మొదట మాస్టర్ వేణు సంగీత దర్శకుడిగా వ్యవహరించినా ఆయన మరణం తర్వాత 'స్వ'రాజేశ్వరరావు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. 
* ప్రముఖ రచయిత సుంకర సత్యనారాయణ ఈ చిత్ర కథనందించారు. ఆయనతోబాటు ఆత్రేయ సంభాషణలు రాసారు. సుంకర కమ్యూనిస్ట్ గా పేరు పడడంతో స్క్రిప్ట్ లో ఆ భావాలు ఎక్కువగా పడకుండా నిర్మాత స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  
* ఎడ్ల పందాలు సన్నివేశాల చిత్రీకరణ ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో వారంరోజులపాటు మూడు కెమెరాలతో భారీగా ( అప్పట్లో ) చిత్రీకరించారు.    
* సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పాటు షూటింగ్ జరిగిన ఈ చిత్రం నిర్మాణ సమయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొంది. మాస్టర్ వేణు మరణంతో బాటు నాగేశ్వరరావు కాలికి దెబ్బ తగలడం, సావిత్రి గర్భవతి కావడం, మొదటి జత ఎద్దులు చనిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొని నిర్మాణం పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది.  
* అచ్చమైన గ్రామీణ వాతావరణంలో నిర్మించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పతకం పొందింది. 
ఆ సంవత్సరం ' మా ఇంటి మహాలక్ష్మి ', ' జయభేరి ' చిత్రాలు కూడా ప్రశంసా పత్రాలు సాధించాయి.   
* శాన్స్  బాస్టియన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొన్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. 


 గమనిక :
* సాహిత్య అభిమాని బ్లాగు మిత్రులు శ్రీ శివ గారు పంపిన అక్కినేని వారి సంభాషణ నుంచి ఆడియో క్లిప్పింగ్ క్రింద ఇచ్చాను. శ్రీ శివ గారికి ధన్యవాదాలతో మీ కోసం.............
 

Vol. No. 01 Pub. No. 206



5 comments:

  1. Dear Rao garu,

    Please write all the good informative details in descriptive format rather than in a video. I tried to read but before I could, the transition has changed to another slide.

    ReplyDelete
  2. శివ గారూ !
    కృతజ్ఞతలు. తిరిగే కాలు...తిట్టే నోరు ఊరుకోవన్నట్లు అలవాటైన చెయ్యి ఊరుకోక మామూలుగా ఇవ్వవలసిన విషయానికి కూడా ఏదో చేసేశాను. మన్నించండి. ఇది మీకే కాదు. ఈ విషయంలో ఇబ్బందిని ఎదుర్కొన్న మిత్రులందరికీ ! కానీ ఒక్క సూచన. ఎప్పుడైనా ఇలా ఇవ్వవలసిన పరిస్థితి వస్తే కావల్సిన స్లైడు పాజ్ చేసుకుని చదవుకోవచ్చు. ఫైల్ పెద్దదయి ఓపెన్ కావటం లేటుకాకుండా సమయాన్ని తగ్గించి ఇవ్వవలసి వచ్చింది. ఏమైనా మంచి సూచన చేసారు. మరోసారి కృతజ్ఞతలతో మీ సూచన మేరకు descriptive format లో ఇచ్చాను. గమనించగలరు.

    ReplyDelete
  3. శివ గారూ !
    మీరు పంపిన ఆడియో క్లిప్ జత చేసాను. చూడండి. దన్యవాదాలతో

    ReplyDelete
  4. వినయ్ చక్రవర్తి గారూ !
    చాలా సంతోషం. పాత సినిమాలంటేనే అంటరానివిగా అనుకునే నేటితరంలో మీరు గతవైభవం గురించి తెలుసుకోవాలనుకోవటం అభినందించదగ్గ విషయం. గతమెప్పుడూ వర్తమానానికి పునాది. అలాగే మీ నాన్నగారి అభిరుచుల్ని గౌరవించడం చాలా ఆనందించదగ్గ విషయం. నమ్మిన బంటు నాకు కూడా వీడియో దొరకలేదు. మీరు కోరినట్లే నా దగ్గరున్న, నాకు తెలిసిన విశేషాలను తప్పకుండా అందిస్తాను. ఒక్క విషయం. పాత సినిమా విశేషాలు తెలియజేస్తున్నందున కొత్తవాటికి వ్యతిరేకిని కాదు. మంచి సినిమా పాత అయినా, కొత్త అయినా నాకు ఇష్టమే ! అందరికీ తెలిసిన విషయాలను మళ్ళీ చెప్పేకంటే ఎక్కువమందికి తెలియని గతవైభవాన్ని చెప్పడం మంచిదని నా వుద్దేశ్యం.

    ReplyDelete
  5. Genial fill someone in on and this mail helped me alot in my college assignement. Say thank you you as your information.

    ReplyDelete