Monday, February 15, 2010

తెలుగువారికి గాంధీజీ సందేశం



 1946 ఫిబ్రవరి నెలలో గాంధీజీ ప్రత్యేక రైలులో మద్రాసు నుండి వార్తా వెడుతూ మన రాష్ట్రంలోని మధిర, ఖమ్మం, డోర్నకల్, వరంగల్ మొదలైన చోట్ల రైల్ ఆపించి ప్రసంగాలు చేసేవారు. వేలాదిమంది హాజరయిన ఆ సభలలో తన ప్రసంగాలతో గాంధీజీ జనాన్ని ఎంతో ప్రభావితం చేసేవారు. చివరి మజిలి అయిన ఖాజీపేటలో ఆయన తెలుగువారికోసం తన స్వహస్తాలతో ఒక సందేశం రాసిచ్చారు. ఆ సందేశ సారాంశం..........

ఆంధ్రదేశం పైన నాకు చాలా ఆశ ఉంది. ఈ ప్రాంతం నా ఆశయాలను పూర్తిగా నెరవేరుస్తుందని నా నమ్మకం. అవి అంటరానితనాన్ని తొలగించడం, అంతా ఖద్దరే ధరించడం, మాతృభాషతో బాటు హిందుస్తానీ దేవనాగరి, ఉర్దూ లిపులలో నేర్చుకోవడం, జాతీయ ఐకమత్యం కలిగి ఉండడం తెలుగువారందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను. అన్ని దేవాలయాల్లోనూ అంటరాని వాళ్లకు ప్రవేశం ఉండాలి.

ఇవీ గాంధీజీ ఆంధ్ర ప్రాంతం మీద, తెలుగు వారి మీద పెట్టుకున్న ఆశలు. అవన్నీ పూర్తిగా నేరవేరాయా ? 

Vol. No. 01 Pub. No. 199

5 comments:

  1. haha... thts funny.... dont we've our own guidelines ?.. I think u are a very old person..

    ReplyDelete
  2. గాంధీగారి మాటలు పాటిస్తే ఎలాఉండేది:
    అంటరాని తనం ఉండేది కాదు
    నేత పరిశ్రమలో ఇన్ని చావులు ఉండేవి కావు
    భాషలు నేర్చు కుంటే వాళ్ళ సంస్కృతి అలవాట్లు నేర్చు కొనేవాళ్ళం
    జాతీయత ఉంటె మాదీ మీదీ అని కొట్టుకు చచ్చేవాళ్ళం కాదు

    ReplyDelete
  3. అజ్ఞాత గారు
    ధన్యవాదాలు

    ReplyDelete
  4. మీరు అమాకున గారికి ఇచ్చిన సందేశం బాగుంది. నా బ్రౌసెర్ సరిగ్గాలేక అనోనిమస్ గ పంపించాలిసి వచ్చింది. థాంక్స్.

    ReplyDelete
  5. రహమతుల్లా గారు, తెలుగుపై మీ సమాచారానికి ధన్యవాదాలండీ !

    ReplyDelete