Wednesday, February 3, 2010

సహజత్వం కోసం.........

ఇప్పుడొస్తున్న సినిమాలు గానీ, టీవీ సీరియళ్ళు గానీ పరిశీలిస్తే సందర్భోచితంగా అనే మాటకు విలువ  లేదేమోననిపిస్తుంది. కథకు అనుగుణంగా సహజత్వం కోసం కాస్త సమయం కేటాయించలేని పరుగు    
యుగంలో ఉన్నాం ! అసహజమైన ఆహార్యం, సన్నివేశ ఔచిత్యానికి సంబంధంలేని వేషధారణ కనబడతాయి.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు. 

Vol. No. 01 Pub. No. 182

4 comments:

  1. మీరన్నట్లు అందుకే దేవత సినిమా ఇప్పటికి గుర్తు వుంది మరి.

    ReplyDelete
  2. సహజత్వం కోసం వాళ్ళుతీసుకున్న ఆ జాగ్రత్తలే ఇప్పటికీ ఆ పాత సినిమాలను అజరామరం చేస్తున్నాయి.

    ReplyDelete
  3. Hatsoff to them..the legendary film makers..!

    ReplyDelete
  4. మధురవాణి గారూ !
    అవునండీ వాళ్ళు లెజెండ్సే ! కానీ ఇప్పుడు వారిని అనుసరించేవారిని చేతకాని వాళ్ళుగా జమ కడుతున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete