Showing posts with label సుభాషితాలు. Show all posts
Showing posts with label సుభాషితాలు. Show all posts

Wednesday, May 26, 2010

అన్నిటికన్నా పదునైన ఆయుధం

ప్రముఖ కన్నడ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్న యు.ఆర్. అనంతమూర్తి గారిని ఒకాయన ' ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అతి పదునైన ఆయుధం ఏమిటి ? ' అని అడిగాడు.

దానికి ఆయన సమాధానమిస్తూ " ఉంది. అదే మన నాలుక ! దానికి ఎటువంటి ఎముకలూ లేకపోయినా, తన సూటి పోటి మాటలతో ఎన్ని గుండెలయినా బద్దలు చేస్తుంది " అన్నారు.



నిజమే కదా ! అంతకంటే పదునైన ఆయుధం వుందా ??


Vol. No. 01 Pub. No. 299

Thursday, April 22, 2010

క్రొత్త ఆలోచనలకు సత్కారం

జీసస్ ని శిలువ వేశారు. సోక్రేటిస్ కి విషం ఇచ్చి తాగమన్నారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ లని తుపాకులతో కాల్చి చంపారు. దేశానికి క్రొత్త ఆలోచన నిచ్చిన వాళ్ళని మృత్యువుతో సత్కరించడం ఈ లోకం ఆచారం.  

ప్రముఖ రచయిత, నటులు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి
" సత్యంగారి ఇల్లెక్కడ ? " నాటికలోని ఒక డైలాగ్.


 Search Amazon.com for telugu plays
Search Amazon.com Books for telugu plays
Vol. No. 01 Pub. No. 264

Sunday, April 18, 2010

జ్ఞాన పరీక్ష



అబ్రహం లింకన్ అమెరికా దేశానికి 16 వ అధ్యక్షుడు.
అమెరికా పౌర విప్లవం, బానిసత్వ నిర్మూలన లాంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించిన రాజకీయ చతురుడు. 
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన గొప్ప వ్యక్తులలో ఒకడిగా లింకన్ కు  మేధావి వర్గంలో పేరుంది.


 
ఒకసారి లింకన్ తో ఓ బాల్య మిత్రుడు
" మనిషి తనకున్న జ్ఞానమెంతో  తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి ? " అని అడిగాడు.

దానికి లింకన్
" మంచి పుస్తకాలు, విలువైన గ్రంథాలు విరివిగా చదవాలి. ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా తన అజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అప్పుడే మనకెంత జ్ఞానం వుందో మనకు అర్థమవుతుంది " అని సమాధానమిచ్చాడు.

చరిత్రలో నిలిచిపోయిన అబ్రహాం లింకన్ 1865 వ సంవత్సరం, ఏప్రిల్ 15 వతేదీన  హత్యకు గురయ్యారు.

 Vol. No. 01 Pub. No. 258

Monday, April 5, 2010

అన్నీ మన మంచికే !

 హరివంశ్ రాయ్ బచ్చన్ అనగానే గుర్తుకొచ్చేది భారతీయ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తండ్రిగా ! కానీ ఆయన హిందీలో ప్రసిద్ధి పొందిన కవి.  ఒమర్ ఖయ్యాం ఉర్దూ లో రచించిన రుబాయత్ ను హిందీలోకి తర్జుమా చేశారు.  ప్రముఖ ఆంగ్ల రచయిత, కవి షేక్స్పియర్ రచనల్ని హిందీలోకి తర్జుమా చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం, బిర్లా ఫౌండేషన్ వారి సరస్వతీ సమ్మాన్, సోవియెట్ ల్యాండ్ నెహ్రు బహుమతి, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ' పద్మ భూషణ్ ' లాంటి ఎన్నో గౌరవాలు పొందారు.

ఆయన చెప్పిన మంచి మాటలు

నీవు కోరుకున్నట్లు జరిగిందా మంచిదే. జరుగలేదూ మరీ మంచిది. మనకు తెలియకుండానే మనను నడిపించే శక్తి ఏదో - భగవంతుడో, సర్వేశ్వరుడో, మరేదైనా అను - మనకు ఒక గుణపాఠం నేర్పడానికే అలా చేసిందని భావించు. ఆ శక్తి మనకెన్నడూ అపకారం చెయ్యదు. ఆ సంగతి నీవు సంక్షోభంలో, సమస్యల్లో వున్నప్పుడు గ్రహించకపోయినా తర్వాత గుర్తిస్తావు.  


ఆచార్య ఆత్రేయ గారు మురళీకృష్ణ చిత్రం కోసం రాసిన, మాస్టర్ వేణు సంగీతంలో ఘంటసాల గానం చేసిన ఈ పాటలోని చరణాన్ని వింటే ఈ ఇద్దరి కవుల భావ సారూప్యాన్ని గమనించవచ్చు.



 Vol. No. 01 Pub. No. 244

Monday, February 15, 2010

తెలుగువారికి గాంధీజీ సందేశం



 1946 ఫిబ్రవరి నెలలో గాంధీజీ ప్రత్యేక రైలులో మద్రాసు నుండి వార్తా వెడుతూ మన రాష్ట్రంలోని మధిర, ఖమ్మం, డోర్నకల్, వరంగల్ మొదలైన చోట్ల రైల్ ఆపించి ప్రసంగాలు చేసేవారు. వేలాదిమంది హాజరయిన ఆ సభలలో తన ప్రసంగాలతో గాంధీజీ జనాన్ని ఎంతో ప్రభావితం చేసేవారు. చివరి మజిలి అయిన ఖాజీపేటలో ఆయన తెలుగువారికోసం తన స్వహస్తాలతో ఒక సందేశం రాసిచ్చారు. ఆ సందేశ సారాంశం..........

ఆంధ్రదేశం పైన నాకు చాలా ఆశ ఉంది. ఈ ప్రాంతం నా ఆశయాలను పూర్తిగా నెరవేరుస్తుందని నా నమ్మకం. అవి అంటరానితనాన్ని తొలగించడం, అంతా ఖద్దరే ధరించడం, మాతృభాషతో బాటు హిందుస్తానీ దేవనాగరి, ఉర్దూ లిపులలో నేర్చుకోవడం, జాతీయ ఐకమత్యం కలిగి ఉండడం తెలుగువారందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను. అన్ని దేవాలయాల్లోనూ అంటరాని వాళ్లకు ప్రవేశం ఉండాలి.

ఇవీ గాంధీజీ ఆంధ్ర ప్రాంతం మీద, తెలుగు వారి మీద పెట్టుకున్న ఆశలు. అవన్నీ పూర్తిగా నేరవేరాయా ? 

Vol. No. 01 Pub. No. 199

Friday, February 5, 2010

అజ్ఞానంలో ' ఆత్మ '

ఆది శంకరాచార్యుల వారి సుభాషితం....

Vol. No. 01 Pub. No. 186