Wednesday, April 21, 2010

విశ్వనాథ ' నాయక '

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆజానబాహుడు. ఆయన ఒకసారి గుంటూరు హిందూ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వేదిక మీదకు వస్తుండగా పైనున్న ఆ కళాశాల ప్రిన్సిపాల్ వల్లభజోస్యుల సుబ్బారావు గారు విశ్వనాథ వారికి చెయ్యి అందిస్తూ

" జలధివిలోలవీచి విలసత్కలకాంచి సమంచితా వనీతల............"

అంటూ శర్మిష్టను నూతిలోంచి బయిటకు తియ్యడానికి యయాతి తన చెయ్యి అందించే సందర్భంలోని పద్యం పాడారు.  అది విన్న విశ్వనాథ వారు

" నాలాంటి పొడవైన నాయిక, మీ ప్రిన్సిపాల్ లాంటి పొట్టి నాయకుడు వుంటే...... అహా ! ఎంత సొగసు ఆ సరాగం !! "
 అంటూ వేదికనలంకరించారు.

Visvanatha kavita vaibhavam: Kavi samrat Visvanathavari kamaniyapadyalaku ramaniya vyakhya

Vol. No. 01 Pub. No. 261

2 comments:

  1. రావ్ గారు, మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారో కాని మొత్తానికి చలోక్తి బాగుంది.

    ReplyDelete
  2. రావుగారు, మీరు ఈ మధ్యనే శ్రీ రమణ గారి హాస్యజ్యోతి చదివారా ఏమిటి? మీరు చెప్తున్న విషయాలన్ని అందులో ఉన్నాయి. మరోలా అనుకోకండి, ఊరికే తెలుసుకుందామని అడిగాను.

    ReplyDelete