Sunday, April 25, 2010

వేసవి ముచ్చట్లు

అందరికీ వేసవి సెలవలిచ్చేసారు. పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలు, మామయ్యలు, అక్కలు, బావలు వగైరా బంధువుల ఇళ్ళకి ప్రయాణమవుతుంటే పెద్దలు సంవత్సరమంతా తినడానికి ఉపయోగించే ఊరగాయ పచ్చళ్ళు తయారీలో మునిగిపోతారు. ఇది ఒకప్పటి మన జీవనచిత్రం.






ప్రస్తుతం రెడీమేడ్ గా దొరుకుతున్న పచ్చళ్ళు మన డైనింగ్ టేబుల్ ని అలంకరిస్తున్నాయి.  ఇంకా అప్పటి తరం వాళ్ళుంటే మాత్రం అప్పటి పద్ధతుల్లో కారం దంపించడం, నూనె ప్రత్యేకంగా గానుగ ఆడించడం చెయ్యకపోయినా బజార్లో రెడీ గా దొరికే కారాలు, నూనెలు వగైరా తెచ్చుకుని సమ పాళ్ళలో కలుపుకోవడం ఇప్పటికీ కనబడుతుంది.  వేసవి కాలంలో ఊరగాయ పచ్చళ్ళు పెట్టడం ఒక గతకాలపు జ్ఞాపకం. అప్పుడది ఇంటిల్లపాదికీ పని. సంవత్సరమంతా అన్నంలోకి ఒక మధురమైన ఆధరువు.




అలాగే వేసవి సెలవలు పిల్లలకు ఆటవిడుపు. ఇప్పట్లా పోటీ చదువులు, వేసవి శిక్షణా శిబిరాలు తెలియని రోజుల్లో ఆ సెలవలకు బంధువుల ఇళ్ళకు వెళ్ళడం, ఆ సెలవలన్నీ ఆట, పాటలతో ప్రకృతిమాత  ఒడిలో గడిపి వేసవి తాపాన్నుంచి ఉపశమనం పొందడం, బడులు తెరిచే సమయానికి కొత్త శక్తితో రావడం............ ఇదంతా గత తరం జ్ఞాపకాలే ! అప్పటి నా ముచ్చట్లు   స్వ ' గతం ' పేజీలో రాస్తున్నాను. ఒక్కసారి ఆ పేజీ తెరవండి.  ఆ ముచ్చట్లు పంచుకోండి.  

Vol. No. 01 Pub. No. 268

2 comments:

  1. మీ స్వగతం లోని రకరకాల ముచ్చట్లు చాలా బాగున్నాయి. అవును...ఇప్పడు వేసవి శలవులేగా...పిల్లలందరికీ అందమైన... ఆనందంగా ఆటవిడుపు కావాలి.

    ReplyDelete
  2. జయ గారూ !
    ధన్యవాదాలండీ !

    ReplyDelete