Sunday, April 18, 2010
జ్ఞాన పరీక్ష
అబ్రహం లింకన్ అమెరికా దేశానికి 16 వ అధ్యక్షుడు.
అమెరికా పౌర విప్లవం, బానిసత్వ నిర్మూలన లాంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించిన రాజకీయ చతురుడు.
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన గొప్ప వ్యక్తులలో ఒకడిగా లింకన్ కు మేధావి వర్గంలో పేరుంది.
ఒకసారి లింకన్ తో ఓ బాల్య మిత్రుడు
" మనిషి తనకున్న జ్ఞానమెంతో తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి ? " అని అడిగాడు.
దానికి లింకన్
" మంచి పుస్తకాలు, విలువైన గ్రంథాలు విరివిగా చదవాలి. ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా తన అజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అప్పుడే మనకెంత జ్ఞానం వుందో మనకు అర్థమవుతుంది " అని సమాధానమిచ్చాడు.
చరిత్రలో నిలిచిపోయిన అబ్రహాం లింకన్ 1865 వ సంవత్సరం, ఏప్రిల్ 15 వతేదీన హత్యకు గురయ్యారు.
Vol. No. 01 Pub. No. 258
Labels:
సుభాషితాలు
Subscribe to:
Post Comments (Atom)
లింకన్ చెప్పిన సూక్తి ఆచరణీయం...అందుకే ఆయన మహానుభావుడయ్యాడు !
ReplyDeleteసౌమ్య గారూ !
ReplyDeleteధన్యవాదాలు.