Saturday, April 3, 2010

దటీజ్ మదర్ !!

అదొక అద్భుతమైన, అపురూపమైన సన్నివేశం. 1969 జూలై 20 వ తేదీన మానవుడు చంద్రమండలాన్ని జయించాడు. తొలిసారిగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు పెట్టాడు. ప్రపంచమంతా పండుగ చేసుకుంది. అదొక సంచలనం.

అందరిలాగే కలకత్తాలోని మదర్ థెరిస్సా అనాదాశ్రమంలోని వారందరూ కూడా సంతోషం పట్టలేక పోయారు. వెంటనే మదర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పారు. ఆవిడ కూడా ఎంతో సంతోషించారు.

అందులో ఒకామె మదర్ తో " మీరెప్పుడైనా చంద్రమండలానికి వెళ్ళే అవకాశం వుందా మదర్ ? " అని అడిగింది.

దానికి మదర్ తన సహజ ధోరణిలో " అక్కడ కూడా నిరుపేదలు, దిక్కులేని వారు వున్నారంటే తప్పకుండా వారి సేవలకోసం వెడతాను. నేనే కాదు. మిమ్మల్ని కూడా తీసుకేడతాను " అన్నారట. దటీజ్ మదర్ !!

Vol. No. 01 Pub. No. 242

4 comments:

  1. అదీ ఆమెలోని గొప్పదనం ..నిలువెల్లా మానవత్వం

    ReplyDelete
  2. great kadaa!!!manchi vishayam rashaaru.thanks.

    ReplyDelete
  3. అందుకే ఆమె మదర్ అయింది. ఇప్పుడు ఏ గ్రహ వాసులతో చేరి విశ్వంలో భాగమైపోయి, వారిని ధన్యులను చేస్తున్నారో కదా!

    ReplyDelete
  4. * చిన్ని గారూ !
    * సుభద్ర గారూ !
    * జయ గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete