Wednesday, November 11, 2009

'వర్జిం'ప తగినది


సిగరెట్ తాగడం ఒక వ్యసనం. అది నేర్చుకోవడం సులభమే కానీ వదిలెయ్యడం చాలా కష్టం. సిగరెట్ అంటే ప్రాణంగా చూసుకున్న కవి, రచయిత ఆరుద్ర దాన్ని చాలా సార్లు మానేశారు. అందుకే ఆయన సిగరెట్ తాగడం మానేసానంటే అందరూ నమ్మడం మానేశారు.
చివరగా నిఝాంగానే మానేసాక కూడా ఆయన స్నేహితులకు అనుమానమే ! అందుకే ఆ విషయం తెల్సుకుందామని ఆయన్నే అడిగేశారు సిగరెట్ మానెయ్యడానికి కారణం ఏమిటీ అని.
దానికాయన నవ్వుతూ " సిగరెట్లు తయారుచేసేది వర్జీనియా పొగాకుతో కదా ! అందుకే అవి 'వర్జిం'ప తగినవి. కనుకనే మానేసాను " అన్నారు.

No comments:

Post a Comment