Tuesday, November 3, 2009

ఆంధ్రలో తొలి ఫిలిం స్టూడియో

చిత్ర వైభవం 010
తెలుగు చిత్ర రంగం తొలి రోజుల్లో మద్రాస్ లో మాత్రమే సినిమా స్టూడియోలు ఉండేవి. తెలుగు వారి హస్తం వాటిలో ఉన్నా తెలుగు గడ్డ మీద స్టూడియో లు లేవు. ఆ తరుణంలో 1936 లో రాజమండ్రిలో నిడుమర్తి సూరయ్య గారనే ఆయన ' దుర్గా సినీ టోన్ ' అనే పేరుతో ఒక స్టూడియో నిర్మించారు. ఆంద్ర దేశంలో అదే తొలి ఫిలిం స్టూడియో. ఆ స్టూడియో లో కోడేరు రాజు, పుష్పవల్లి జంటగా సంపూర్ణ రామాయణం చిత్రాన్ని నిర్మించారు. అటు తర్వాత కొన్ని చిత్రాలు నిర్మించినా ఎక్కువరోజులు ఆ స్టూడియో నిలదొక్కుకోలేకపోయింది. చిత్ర ప్రదర్శనలను ప్రజలకు చేరువ చెయ్యడంలో సూరయ్య గారి కృషి చెప్పుకోదగ్గది. సంపూర్ణ రామాయణం అణా కానీ కి, ఆ మరుసటి సంవత్సరం నిర్మించిన దశావతారాలు ఒక్కొక్క అవతారం ఒక కానీ చొప్పున చూపిస్తానని ప్రచారం చేసి ప్రజల్ని ఆకర్షించారు.

తెలుగు చిత్ర రంగంలో తొలి తరం దాదాపుగా తరలిపోయింది. ఆ జ్ఞాపకాలను నింపుకున్న మలితరంలో కూడా ఒకరొకరే తమ ప్రయాణం ముగిస్తున్నారు. ఆ క్రమంలో తొలి ఆంధ్ర ఫిలిం స్టూడియో స్థాపకుడు నిడుమర్తి సూరయ్య గారి కుమారుడు, ప్రముఖ చిత్రనిర్మాత ఎన్. ఎస్. మూర్తి గారు ఇటీవలే స్వర్గస్తులయ్యారని నవతరంగం ద్వారా తెలిసింది. ఈయన బాపు, రమణలకు సన్నిహితులు. వారితో సంపూర్ణ రామాయణం లాంటి చిత్రాలను నిర్మించారు. వారికి నివాళులర్పిస్తూ ......

No comments:

Post a Comment