Sunday, November 8, 2009

నలుగురు రచయితల పాట





ఈ పాట ప్రముఖ రచయిత ఆత్రేయ దర్శకత్వం వహించిన ' వాగ్దానం ' చిత్రంలోనిది అన్న విషయం జగద్విదితం. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ పాట రాసింది ఆత్రేయ కాదనే విషయం కూడా అందరికీ తెలిసినదే ! ఈ గీత రచనలో నలుగురు రచయితల ప్రమేయం ఉంది. వారెవరో, వారి ప్రమేయమేమిటో చెప్పగలరా ?

6 comments:

  1. ఈపాట రాసింది శ్రీశ్రీ. కాని ప్రారంభంలో వచ్చే శ్లోకం "శ్రీనగజాతనయం" సాధారణంగా హరికధకులు పాడేది,మధ్యలో "పెళ్లుమనె విల్లు"రాసింది కరుణశ్రీ, చివరిలో "భూతలనాధుడు రాముడు" బమ్మెరపోతన రాసింది..

    కరెక్టేనా?? ఎప్పుడో పుస్తకాలలో చదివిన గుర్తు..

    ReplyDelete
  2. కోడీహళ్ళి మురళీ మోహన్November 8, 2009 at 7:49 AM

    ఈ హరికథ వ్రాసింది మహాకవి శ్రీశ్రీ. దీనిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిదీ, బమ్మెర పోతన్నదీ పద్యాలను వాడుకున్నారు. శ్రీ నగజా తనయం...అనేది ఒక(?) వాగ్గేయ కారుని కృతి.

    ReplyDelete
  3. జ్యోతి గారూ !
    మురళీ మోహన్ గారూ !
    మీ సమాధానాలు నూరుశాతం సరైనవే !
    ధన్య వాదాలు.

    ReplyDelete
  4. హాయ్ బలే వుందండీ పాట నా చిన్నప్పుడు తెగ వచ్చేది రేడియో లో. నాకు బలే ఇష్టం. నాకు హరికధలంటే చాలా ఇష్టం, అందరు వెక్కిరిస్తారు కాని బలే వుంటాయి హరి కధలు. చాలా బాగుంది నేనెప్పుడు చూడలేదు వినటం తప్ప. మరీ ఆయన ఎవరో కాని ఆయనను పక్కన పెట్టి నాగేశ్వర రావు బండి తోయటమె కొంచం అతిశయోక్తి కాని ;-) బాగుంది.

    ReplyDelete
  5. భావన ,, యెప్పుడూ హరికథ చూళ్ళేదా? హయ్యో హవ్వ హవ్వ (బుగ్గల్నొక్కుకుంటూ)

    ReplyDelete
  6. శంకరయ్య గారూ !
    సవివరంగా తెలియజేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
    భావన గారూ !
    హరి కథ నిజంగా అద్భుతమైన ప్రక్రియ. టీవీ లొచ్చాక మూలన పడిపోయిన సాంప్రదాయిక కళారూఫాల్లో ఇదొకటి. సినిమా నిజానికి ఒక రకంగా మన కళారూపాల్ని పదిల పరిచిందనే చెప్పాలి. హరికథను విశ్వనాథ్ గారి ' సూత్రధారులు ' వరకూ చాలా చిత్రాల్లో కథానుసారంగా వాడుకున్నారు. ఆ విషయాలు మరోసారి. ఈ విషయంలో దూరదర్శన్ కృషి మెచ్చుకోదగ్గది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    కొత్తపాళీ గారూ !
    ఆశ్చర్య పోకండి. భావన గారే కాదు. మన సాంప్రదాయ కళల్ని ప్రత్యక్షంగా చూడని వారు చాలామందే ఉన్నారు. ఎంతవరకూ సాధ్య పడుతుందో తెకియదు గానీ మన సాంప్రదాయ కళారూపాల్ని ముందు తరాలు గుర్తు పెట్టుకునేలా చిత్రీకరించి భద్రపరచాలని నా కోరిక.

    ReplyDelete