Monday, November 9, 2009

మొదటి మహిళా చిత్ర నిర్మాత

నాటకాల్లో స్త్రీ పాత్రలు స్త్రీలు ధరించడానికి ముందుకువచ్చే పరిస్థితి లేని రోజుల్లో స్త్రీ పాత్రలే కాదు పురుష పాత్రలు కూడా ధరించి మెప్పించిన నటి దాసరి కోటిరత్నం. సావిత్రి నాటకంలో సత్యవంతుడు, సక్కుబాయి నాటకంలో కృష్ణుడు ఆమె ధరించిన పాత్రల్లో ప్రసిద్ధి చెందినవి. పురుషులకు మాత్రమే పరిమితమైన రోజుల్లో స్వంతంగా నాటక సమాజాన్ని నిర్వహించింది.
ఇవన్నీ ఒక ఎత్తు. తొలి చిత్ర నిర్మాతగా ఆమె చేసిన సాహసం మరో ఎత్తు. 1935 లోనే చిత్ర నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బి.వి.రామానందం ( ఎస్వీ రంగారావు మేనమామ ), తుంగల చలపతిరావు లతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి కలకత్తాలో " సతీ సక్కుబాయి " అనే చిత్రాన్ని నిర్మించింది. తన నాటక రంగ సహచరులందరినీ స్వంత ఖర్చులతో కలకత్తాలోనే ఉంచి అందరం కలిసి పని చేద్దామని నచ్చజేప్పింది. తామందరూ కష్టపడి పనిచేసి ఎవరికో లాభాలు తెచ్చిపెట్టే కంటే ఆ లాభాలేవో మనమే పంచుకుందామని వారందరినీ వప్పించి ఆ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో కోటిరత్నం సక్కుబాయిగా, తుంగల చలపతిరావు కృష్ణుడిగా నటించారు.
ఇప్పటి కళాకారులు, సాంకేతిక నిపుణులు కూడా ఆవిడ అనుసరించిన పధ్ధతిని అనుసరిస్తే శ్రమ దోపిడీని అరికట్టి తమ ప్రతిభను ప్రదర్శించ వచ్చు. ఆ రకంగానైనా ఆరోగ్యకరమైన చిత్రాలు వచ్చే అవకాశం ఉంది.

1 comment:

  1. rao garu what you have posted is an invaluable peace of information.thanks a lot for the same

    ReplyDelete