Thursday, November 5, 2009

సమయ స్పూర్తి

బళ్ళారి రాఘవ పేరు ప్రఖ్యాతుల గురించి నాటక ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆయన తన నటనతో రాష్ట్రాన్నే కాదు దేశమంతటినీ మెప్పించారు.
ఒకసారి ఆయన చంద్రగుప్త నాటకం ప్రదర్శిస్తున్నారు. అందులో ఆయనది చాణుక్యుడి వేషం. శ్మశాన వాటిక సన్నివేశం. తెర తొలగింది. చాణుక్యుడు శ్మశానంలో ప్రవేశించాడు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఒక కుక్క స్టేజీ మీదలు పరుగెత్తుకుంటూ వచ్చింది. అంతే ! అందరూ కంగారు పడ్డారు. కానీ రాఘవ గారు మాత్రం కంగారు పడలేదు. సమయ స్పూర్తితో "శునకరాజమా! వచ్చితివా ? రమ్ము. ఈ శ్మశానం నాదే కాదు. నీది కూడా ! " అని సన్నివేశాన్ని రక్తికట్టించారట. రంగస్థలం మీద నటులకి అలాంటి సమయస్పూర్తి ఎంతో అవసరం.

3 comments:

  1. బళ్ళారి రాఘవగారి జన్మస్థలం మా తాడిపత్రేనండి.

    ReplyDelete
  2. ఇలా జరుగుత "హరిశ్చంద్ర" నాటకం ప్రదర్శిస్తున్నపుడని చదివినట్టు గుర్తండీ.

    ReplyDelete
  3. * విజయ మోహన్ గారూ !
    అదృష్టవంతులు. మీకేమైనా నాటక రంగ పరిచయం ఉందా ?
    * శిశిర గారూ !
    మీ సమాచారానికి ధన్యవాదాలు. నా దగ్గరున్న సమాచారం ప్రకారం రాఘవ గారు ' చాణక్య ' నాటకంతో మన రాష్ట్రంలోనే కాక ఉత్తర భారతదశంలో కూడా ప్రసిద్ధులు. ఆయన ఎక్కువగా పోషించినవి రావణుడు, కంసుడు లాంటి ప్రతి నాయకుల పాత్రలే!ఈ సంఘటన కూడా ఆ సమాచారం నుంచి తీసుకున్నదే ! అయినా మీ సమాచారాన్ని గురించి కూడా శోధిస్తాను.

    ReplyDelete