Tuesday, August 31, 2010

కలిపిన ' విడదీసే రైలు బళ్ళు '


నువ్వెక్కవలసిన రైలు బండి జీవితకాలం లేటు అన్నారు ప్రముఖ తెలుగు రచయిత ఆరుద్ర. కానీ ఆయన విషయంలో ఆది నిజం కాలేదు.

అలాగే ' విడదీసే రైలు బళ్ళు ' అని రాసిన ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి విషయంలో ఇదీ నిజం కాలేదు. అందుకేనేమో  వారిద్దరూ జీవితకాలం లేటు కాకుండా కలిసారు.


 భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే అసలు పేరు కల ఆరుద్ర కవిత్వంలో అప్పుడప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కాలంలో అంటే 1950 వ దశకం తొలినాళ్ళలో రామలక్ష్మి ' స్వతంత్ర ' పత్రికలో పనిచేసేవారు. అప్పటికి ఆవిడకు దేవులపల్లి, శ్రీశ్రీ లాంటి వాళ్ళే కవులుగా తెలుసు. ఆరుద్ర పేరు, ఆయన కవిత్వం ఆ పత్రికలోనే ఆవిడకు పరిచయమయ్యారు. ఆయన కవిత్వం నచ్చింది. ఆయనా నచ్చారు. రామలక్ష్మి తన తొలి కథల సంపుటి ' విడదీసే రైలు బళ్ళు ' కు ముందుమాట రాయాల్సిందిగా ఆరుద్ర గారిని కోరారు. అమ్మాయి అడిగిందిగదాని అర్జెంటుగా రాసిచ్చేయలేదాయన. ఆర్నెల్లపాటు అడిగించుకుని మొహమాటం లేకుండా , పొగడ్తలు వగైరా లేకుండా సూటిగా తన అభిప్రాయాన్ని రాసిచ్చారు. అలా ఆ ' విడదీసిన రైలు బళ్ళు ' వాళ్ళని 1955 లో కలిపింది.
నిన్న ( 31 ఆగష్టు ) ఆరుద్రగారి జన్మదినం. ఆ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ........



Vol. No. 02 Pub. No. 017

2 comments:

  1. మా ఆరుద్ర గారి జన్మదినం రోజు...
    ఇక్కడ భోల్డు స్వీట్స్ పంచాం అండీ రావు గారు...

    ReplyDelete
  2. సంతోష్ గారూ !
    ధన్యవాదాలు. 'మా ఆరుద్ర ' గారు కాదండీ ! ' మన ఆరుద్ర ' గారు.

    ReplyDelete