Saturday, August 7, 2010

స్వాతంత్ర్యమే మా జన్మహక్కనీ చాటండీ !




 అమర గాయకుడు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
గానం చేసిన ఈ దేశభక్తి గీతం మీకోసం..........




స్వాతంత్ర్యమే మా జన్మ హక్కనీ చాటండీ !
స్వాతంత్ర్యమే మా జన్మ హక్కనీ చాటండీ !
నిరంకుశమగు శక్తులెదిరినా నిర్భయమ్ముగా నిదురించండీ !! 
నిరంకుశమగు శక్తులెదిరినా నిర్భయమ్ముగా నిదురించండీ !!

పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన బేధమే లేదు 
పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన బేధమే లేదు   
                                                                                   [[ స్వాతంత్ర్యమే ]]      
కవోష్ణ రుధిర జ్వాలలతోటి .............
కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర్య సమరం నడపండీ !
కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర్య సమరం నడపండీ !
ఎంతకాలమిటు సహించి వున్నా దోపిడీ మూకకు దయరాదన్నా
ఎంతకాలమిటు సహించి వున్నా దోపిడీ మూకకు దయరాదన్నా
                                                                                   [[ స్వాతంత్ర్యమే ]]

 సంఘములోని ఐక్యత వేగమే సంఘటపరుపుము శాంతి పథాన .............
సంఘములోని ఐక్యత వేగమే సంఘటపరుపుము శాంతి పథాన
స్వర్గతుల్యమౌ  స్వతంత్ర్య జ్యోతికి మాంగల్యపు హారతులిమ్మా ...  మాంగల్యపు హారతులిమ్మా !!
                                                                                    [[ స్వాతంత్ర్యమే ]]  




Vol. No. 01 Pub. No. 368

4 comments:

  1. అమర గాయకుడి గొంతులో నుండి జాలివారిన ఈ పాట వింటే,ఆగస్టు 15 ఒక వారం ముందరే వచ్చిందనిపించింది.Thanks for the Audio link and Lyrics.

    ReplyDelete
  2. ఎప్పుడో పాడుతా తీయగా కార్యక్రమంలో ఓ పార్టిసిపెంట్ పాడగా విన్నాను. అప్పటి నుంచీ ఈ పాటంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళకు ఇలా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది.

    ఒక చిన్న మాట.
    సవోష్ణ అని కాక కవోష్ణ అని ధ్వనిస్తున్నట్లుంది. ఒకసారి పరిశీలించగలరు.

    ReplyDelete
  3. * హరేకృష్ణ గారూ !
    * రిషి గారూ !
    ధన్యవాదాలు

    * రవిచంద్ర గారూ !
    ధన్యవాదాలు, పొరబాటును తెలిపినందుకు. సరిజేసాను.

    ReplyDelete