Thursday, August 5, 2010

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ

మా తెలుగు తల్లి కూర్పులోని  మరో దేశభక్తి గీతం  -
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దుగ్గిరాల వారి స్వర కల్పనలో ఆలపించారు. మీరూ ఆలకించండి.


 జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి  [[ జయ జయ ]]

జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా  [[ జయ జయ ]]

జయ దిశాంత గతశకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా   [[ జయ జయ ]]

గమనిక : మిత్రులు ' తెలుగు పద్యం ' బ్లాగు భైరవభట్ల కామేశ్వరరావు గారు పంపిన సమాచారం -

ఈ పాట (సంస్కృతం కదా) అర్థం కావలిస్తే ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.google.com/group/telugu-unicode/browse_thread/thread/488ec5e8ade49ee9?fwc=1pli=1




Vol. No. 01 Pub. No. 364

6 comments:

  1. నాకు ఈ పాట చాలా ఇష్టం, చినప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుందో విందాం అని వెతికి వెతికి సాధించాను..

    మరొక్క సారి, ధన్యవాదములు..

    ReplyDelete
  2. ఈ పాట ఆగస్ట్15 న పాడేదాన్ని మా స్కూల్ లో..చాలా మంచి పాట

    ReplyDelete
  3. నాక్కూడా చాలా ఇష్టం ఈ పాట. చిరంజీవి రాక్షసుడు సినిమాలో వాడుకున్నట్టున్నారు.

    ReplyDelete
  4. "జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల"

    ReplyDelete
  5. వేణుగోపాలరావు గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete