Sunday, August 15, 2010

తెలుగు జాతి స్వరం - ప్రభంజనం



 జాతీయ సంగీత వేదిక  ఇండియన్ ఐడల్
ఆ వేదిక మీద నినదించిన తెలుగు స్వరం శ్రీరామచంద్ర

ప్రతిభకు ఎల్లలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు
అని చాటిన తెలుగు జాతి స్వరం శ్రీరామచంద్ర

భాషా, ప్రాంతీయ వివక్షతను చేధించిన స్వరమది
యావత్ భారత జాతిని పులకింపజేసిన గళమది

ఈ ఘనత శ్రీరామచంద్రది మాత్రమే కాదు
ఈ గౌరవం యావత్ తెలుగు జాతిది

తెలుగు జాతికి అతడు సాధించి పెట్టిన కీర్తి
తెలుగు జాతిని అతడు ఎక్కించిన అందలాలు
మరువలేనివి మరపురానివి

తనకీ ఘనకీర్తిని తెచ్చిన తెలుగు గడ్డను
తనకు అండగా నిలిచిన తెలుగు జాతిని
అతడెన్నడూ మరువరాదు

శ్రీరామచంద్ర గానం మరిన్ని శిఖరాలు అధిరోహించాలి 
తెలుగు జాతి స్వరాన్ని హిమాలయాల ఎత్తుకి  చేర్చాలి  

శ్రీరామచంద్రకు అభినందనలతో ........................

Vol. No. 02 Pub. No. 003

2 comments:

  1. Congratulations to SreeRam. Talent won the title

    ReplyDelete
  2. అభినందనలు శ్రీరామ్.ఈ విజయాన్ని నీభవిష్యత్తుకు బాటగా తీర్చిదిద్దుకో.భారత సినీ సంగీత ప్రపంచంలో నీకు తిరుగుండదు.

    ReplyDelete