Tuesday, August 10, 2010

శ్రీలు పొంగిన జీవగడ్డయి.....




రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన ఈ దేశభక్తి గీతం
మిత్రుడు పార్థసారధి గళం నుండి
దుగ్గిరాల స్వరం కల్పనతో వినండి.





శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !              [[ శ్రీలు ]]

వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట

బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !!    [[ శ్రీలు ]]

నీలి కిన్నెర మేళవించి   రాయి కరుగగ రాగమెత్తి 
నీలి కిన్నెర మేళవించి   రాయి కరుగగ రాగమెత్తి

పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా !
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా ! !       [[ శ్రీలు ]]

నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా

కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా !
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా ! !        [[ శ్రీలు ]]

పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ

కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా !
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా ! !      [[ శ్రీలు ]]





Vol. No. 01 Pub. No. 370

4 comments:

  1. మంచి మంచి పాటలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మిత్రమా.

    ReplyDelete
  2. అద్భుతం , చక్కని పాటను మరీ మరీ వినేటట్లు చేశారు . ధన్య వాదాలు . ఒక చింతించ వలసిన విషయం యెమంటే ఇంత చక్కని ఆనంద దేశభక్తి గేయాన్ని లీడర్ సినిమా కోసం బాక్ గ్రౌండ్ శాడ్ మ్యూజిక్ గా , హీరో తండ్రి అంత్య క్రియా కర్మ ల లో వాడుకొని దాని విలువను పొగొట్టిన మన డైరెక్టర్ గారు , దానికి అనుమతించిన సెన్సార్ వారు అపవిత్రం చేశారు .

    ReplyDelete
  3. * భా. రా. రె. గారూ !
    కృతజ్ఞతలు

    * అజ్ఞాత గారూ !
    నిజమేనండీ ! ఇలాంటి విషయాలు వారి వారి విజ్ఞత మీద ఆధారపడి వుంటాయి. ధన్యవాదాలు.

    * మాధురి గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  4. రాంబాబు గారూ !
    అర్థమయిందండీ ! ఆ పాటను ఇక్కడ వున్న ప్లేయర్ లో కుడిప్రక్క ' Divshare ' ను క్లిక్ చెయ్యండి. నేను అప్లోడ్ చేసిన పేజి తెరుచుకుంటుంది. అక్కడనుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

    ReplyDelete