Wednesday, May 26, 2010

నెహ్రుగారి దేశభక్తి - ఆహారం




స్వాతంత్ర్యయోద్యమ సమయంలో జవహర్లాల్ నెహ్రు చాలాసార్లు జైలుకెళ్ళడం జరిగింది. ఒకసారి ఆయన వున్న ఒక జైల్లో ఆహారం చాలా ఘోరంగా ఉండేది.  అన్నం నిండా రాళ్ళే ! ఆది భరించలేక నెహ్రుగారు జైలర్ కి ఫిర్యాదు చేశారు.

దానికా ఆంగ్ల జైలర్ " మీ దేశానికి  స్వాతంత్ర్యం కావాలని జైలుకి వచ్చారు. మీరు మీ దేశాన్ని నిజంగా ప్రేమిస్తూ వుంటే తిండి విషయంలో పట్టింపు వుండకూడదు " అన్నాడు వెటకారంగా.

దానికి నెహ్రు బదులిస్తూ " అవును. నేను నిజంగానే నా మాతృభూమిని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ భూమినుంచి తయారైన అన్నం తినాలనుకుంటున్నాను గానీ రాళ్ళనూ, మట్టినీ తినేయ్యాలనుకోవడం లేదు "  అన్నారట.


 


పండిట్ జవహర్లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..........









Vol. No. 01 Pub. No.300

1 comment:

  1. హారం ప్రచారకులకు
    చాలా సంతోషం. అభినందనలు.

    ReplyDelete