మొన్న క్రోధంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణవేణమ్మ
విరుచుకుపడింది తన ప్రవాహానికి అడ్డుకట్టిన ఊళ్లమీద
నిన్నటివరకూ నిప్పులు చెరిగిన భానుడు
చెలరేగిపోయాడు తనని కూడా లెక్క చెయ్యని జనం మీద
ఈరోజు ఆగ్రహంతో ఊగిపోతున్న సముద్రుడు
విరుచుకుపడబోతున్నాడు మరోసారి సామాన్య ప్రజల మీద
ఓ కృష్ణమ్మా ! ఓ భానుడా ! ఓ సాగరుడా !
మీకు కూడా డొక్కలెండిన సామాన్యుడే లోకువా ?
మీ ప్రవాహంతో అవినీతిని కడగలేరా ?
మీ ప్రతాపంతో అన్యాయాన్ని భస్మం చెయ్యలేరా ?
మీ అలల వేగంతో కుత్సితం నిండిన వ్యవస్థను ముంచెత్తలేరా ?
Vol. No. 01 Pub. No. 291
అబ్బే, అన్యాయాన్ని అవినీతినీ చూస్తే వాటికీ భయమే :)
ReplyDeleteబాగుందండి. చక్కటి భావంతో రాశారు.
ReplyDeleteఒక పక్క ప్రకృతి విలయతాండవం చేస్తుంటే ఇలా కవిత్వమెలా వస్తుందబ్బా? దానికి పండితుల వారి మెచ్చుకోళ్ళు కూడా! బాగుంది! చాలా బాగుంది.
ReplyDelete* కొత్తపాళీ గారూ !
ReplyDelete* జయ గారూ !
ధన్యవాదాలు
* అజ్ఞాత గారూ !
దీన్ని కవిత్వమని మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఏ కవిత్వమైనా బాధలోంచి, ఆవేదనలోంచి పుడుతుందని, పదికాలాలపాటు నిలిచిన సాహిత్యం అలా పుట్టినదేనని మీకు తెలియదనుకోను. ఆ ఆవేదనను అర్థం చేసుకున్నవాళ్ళకు, పంచుకున్నవాళ్ళకు వందనాలు. అర్థం చేసుకోలేని వాళ్లకు, పంచుకోవడం ఇష్టంలేని వాళ్లకు శతకోటి వందనాలు.