Saturday, May 15, 2010

కాటన్న జన్మదినం

 మా కాటన్న పుట్టిన రోజట నేడు
ఆంధ్రను అన్నపూర్ణగా మార్చిన మంత్రగాడు

అతడు కేవలం ఓ ప్రభుత్వాధికారి
అదీ పరాయి ప్రభుత్వ ఉద్యోగి 

ప్రజాసేవే పరమార్థంగా పనిచేసిన నిస్వార్థజీవి
కరవు రక్కసి కోరల్నుంచి రాష్ట్రాన్ని రక్షించిన ధన్యజీవి

అతని జీవితం నేటి మన ' స్వంత ' పాలకులకు, అధికార్లకు ఒక పెద్దబాలశిక్ష  
అతని జీవితంనుంచి  వారు  తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది ఏమీ లేదా ?   

 ' సర్ ఆర్థర్ కాటన్ ' జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ.........
ఆయనపై గతంలో రాసిన అపర భగీరధుడు చదవండి.

Vol. No. 01 Pub. No. 288

4 comments:

  1. కాటన్న అంటే ఎవరా అనుకోని చూసాను. మొత్తానికి బాగుందండి. నిజమే నండి ఆయన గొప్పతనం సామాన్యమైంది కాదు. నేను కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

    ReplyDelete
  2. జయ గారూ !
    గోదావరి జిల్లాలలో ముఖ్యంగా కోనసీమలో ఇప్పటికీ అక్కడక్కడ కాటన్నలు కనిపిస్తారు. ఆ మహానుభావుడ్ని భారతీయుడ్ని, అందులోను తెలుగువాడిగా చేసేసుకున్నారండి మా కోనసీమ వాసులు. ఆయన పేరు పిల్లలకు పెట్టుకుని తమ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణMay 17, 2010 at 7:01 AM

    కొంచెం ఆలస్యంగా కాటన్న దొరకి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete