Wednesday, January 20, 2010

ఉక్కు మనిషి

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ' ఉక్కు మనిషి ' గా గుర్తుకొస్తారు.

తెలుగువారికి నిజాం చేతుల్నుంచి, రజాకార్ల దౌష్ట్యాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని మిలటరీ చర్యతో విడిపించిన నాయకుడు గుర్తుకొస్తాడు.

ఈరోజుల్లో దేశం, రాష్ట్రం అనేవి తమ స్వంత జాగీరుల్లాగా, కంపెనీల లాగ చూసుకుంటూ, దానికి తమ తదనంతరం తమ పిల్లల్ని, బంధువుల్ని వారసులుగా తయారు చెయ్యడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్న నాయకులే అడుగడుగునా కనిపిస్తారు. వాళ్ళు, వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఈ విషయం నమ్ముతారో లేదో తెలియదు కానీ రాజకీయాల్లోను, రాజకీయ నాయకుల్లోనూ విలువలు మిగిలున్న రోజుల్లో జరిగిన సంగతి కనుక ఇది నిజంగా నిజం

పటేల్ గారికి ఒక కుమార్తె - మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు.

పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో......

' నా కుమారుని పరిశ్రమల గురించి గానీ, అతని ప్రవర్తన గురించి గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైవా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను. '

ఇదీ ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్ళకు ఇదీ ఒక ప్రచారం కోసం చేసే జుమ్మిక్కుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే మనం రోజూ చూసేవి ఇలాంటి జిమ్మిక్కులే కనుక. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతనీ శంకించేవాళ్ళకు కొసమెరుపు ఏమిటంటే సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా ?

Vol. No. 01 Pub. No. 164

5 comments:

  1. చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు అటువంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటివి చదివైనా నేర్చుకుంటే బాగుండు.

    ReplyDelete
  2. జోహార్లు ఉక్కుమనిషికి..ఎ౦త గొప్ప వ్యక్తిత్వ౦..ఈ రోజుల్లోనా కలో కూడా కుదరదు..
    అలా౦టి కల వచ్చినా మన కలని మనమే నమ్మలే౦..
    రావుగారు థ్యా౦క్స్ మ౦చి విషయ౦ చెప్పారు..

    ReplyDelete
  3. మాకు తెలియని మంచి విషయం చెప్పారు. ఇంకా ఇలాంటి టపాలు చాలా రావాలని ఆశిస్తూ... నెనర్లు!

    ReplyDelete
  4. * అప్పారావు శాస్త్రి గారూ !
    * జయ గారూ !
    * సుభద్ర గారూ !
    * అమ్మ ఒడి గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete