Saturday, January 30, 2010

'మాయాబజార్' మీద ముళ్ళపూడి

ఈ రోజు రంగుల ' మాయాబజార్ ' చిత్రం విడుదలయింది.
ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు గతంలొ అప్పటి సినిమాల మీద సమీక్షలు రాసేవారు. అవి ఇప్పటి సమీక్షల్లాంటివి కావు. ఆయన రచనలలాగే వ్యంగ్యం, హాస్యం మేళవించి సునిశితమైన విమర్శతో కూడుకుని ఉండేవి.


' మాయాబజార్ ' చిత్రాన్ని సమీక్షిస్తూ ముళ్ళపూడి వారు
" మొదటి సగం తాపీ గానూ, రెండో సగం ఆదుర్దా గానూ నడుస్తుంది " అని రాసారు.
ఇలా రాయడానికి కారణం ' మాయాబజార్ ' చిత్రానికి సంభాషణలు మొదటి సగానికి తాపీ ధర్మారావు గారు, రెండో సగానికి ఆరుద్ర గారు రాసారు. అదీ సంగతి.


Vol. No. 01 Pub. No. 175

4 comments:

  1. అదేమిటండీ ?
    "మాయాబజర్" కి మాతలు రాసింది పింగళి గారు కదా !

    ReplyDelete
  2. అజ్ఞాత గారూ !
    నిజమే ! ప్రధానంగా మాటలు - పాటలు రాసింది పింగళి గారే ! కానీ మాయాబజార్ మహాయజ్ఞంలో మహామహులెందరో పాలుపంచుకున్నారు. వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారని అంటారు. ముళ్ళపూడి గారు కూడా అదే రాసారు. నా రాతలో రచనా సహకారం అని రాయకపోవడానికి కారణం, ఇది ముఖ:త చెప్పుకునే సమాచారమే గానీ చిత్రం టైటిల్స్ లో ఎక్కడా కనబడదు. బహుశా అప్పటికే ఇద్దరూ లబ్దప్రతిష్టులు కావడం వల్ల కావచ్చు. ఏమైనా మీ స్పందనకు ధన్యవాదాలు. దయచేసి ఈసారి మీ వ్యాఖ్యతో పేరు కూడా తెలియజెయ్యండి.

    ReplyDelete
  3. This comment of Mullapoodi is very often quoted.But I don't think it is about Mayabazaar.

    ReplyDelete
  4. * చె.దె.పూ.దం. గారూ !
    ధన్యవాదాలు. ఇది ఒక పత్రికలోంచి తీసుకుని రాసినా చాలాకాలం క్రితం ముళ్ళపూడి గారి సమీక్షల్లో కూడా చదివిన గుర్తు. అవి కూడా నా ఖజానాలో ఉండాలి. వీలుచూసుకుని అవి బయిటకు తీసి మీ సందేహం నివృత్తి చేస్తాను.

    ReplyDelete