Monday, January 11, 2010

కిరాతుడి కన్ను


శ్రీయుతులు దువ్వూరి రామిరెడ్డి గారికి, గుర్రం జాషువా గారికి ఒక ప్రత్యేకమైన పోలిక ఉంది.
అదేమిటంటే ఇద్దరికీ బిరుదు ఒకటే !
' కవికోకిల ' .
అలాగే వారిద్దరికీ మంచి స్నేహం కూడా ఉంది.
ఒకసారి మద్రాసులో కవి సమ్మేళనం జరుగుతోంది .
ఆ సమ్మేళనానికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,
కృష్ణ శాస్త్రి గారి లాంటి మహాకవులతో బాటు జాషువా, రామిరెడ్డి గార్లు కూడా హాజరయ్యారు.
సహజంగానే వారి సాన్నిహిత్యం కారణంగా ఇద్దరూ కబుర్లలో పడ్డారు.



వారిద్దరి ధోరణి చూసిన విశ్వనాథ వారు
' రెండు పక్షులు ఒక చోటికే చేరాయే ? '
అని కవికోకిల బిరుదలను దృష్టిలో ఉంచుకుని చమత్కరించారు.

దానికి ప్రతిగా జాషువాగారు వెంటనే
' నిజమే కానీ కిరాతుడి కన్ను ఇంకా పక్షుల మీదే ఉన్నదే ! '
అని జవాబిచ్చారు.

Vol. No. 01 Pub. No. 155

7 comments:

  1. దువ్వూరి, జాషువా కవికోకిలలు కాబట్టి వారిని పక్షులని చమత్కరించారు విశ్వనాథ. మరి విశ్వనాథని కిరాతుడు అనడంలోని ఔచిత్యం ఏమిటో చెప్పుకోండి చూద్దాం? :-)

    ReplyDelete
  2. * అప్పారావు శాస్త్రి గారూ !
    ధన్యవాదాలు
    * కామేశ్వరరావు గారూ !
    ముందుగా ధన్యవాదాలు. విశ్వనాథ వారిని కిరాతుడు అనడంలోని ఔచిత్యం నాకు తెలుసు గానీ బ్లాగుమిత్రులు చెప్పగలరనే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి చెప్పడంలేదు. చూద్దాం ఎంతమంది చెప్పగలరో !

    ReplyDelete
  3. vaalmiki laaga ramayana kalpa vruksham raasaaru kada, vaalmiki okappudu kiratude kadaa

    ReplyDelete
  4. అజ్ఞాత గారూ !
    మీ పేరు తెలియజెయ్యగలరా ?

    ReplyDelete
  5. * అశ్వినిశ్రీ గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete