Sunday, July 4, 2010

యశస్వి


ఎస్వీర్ మొదటి చిత్రం ' వరూధిని ' నుంచి




విశ్వ నట చక్రవర్తి 
విశిష్ట నట చక్రవర్తి
నట యశస్వి
నట సార్వభౌముడు 
ఎస్వీ రంగారావు

" మంచి నటుడనే ఒక్క ముద్ర చాలుగా ! నేను రావణాసురుడిగా నటించాను. సత్య హరిశ్చంద్రుడుగానూ చేసాను. పెళ్లి చేసి చూడు సినిమాలో ధూపాటి వియ్యన్న లాంటి హాస్య పాత్రనూ ఒప్పించాను. నన్ను ప్రేక్షకులు విలన్ గానో, మంచివాడుగానో కేటాయించలేదే ! నేను ఏ పాత్ర చేస్తే అదే బాగుంటుందనే భావం పెంచుకున్నారు. ఏ నటుడికైనా ఇలా ఒకే ముద్ర పడకుండా వుండడం చాలా ముఖ్యం "
అన్నారు మహానటుడు ఎస్వీ రంగారావు గారు నటుడు ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవడం గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.

ఆ విశిష్ట నటుడి టైమింగ్ గురించి ఒక విశేషం.....

రంగారావు గారు తెలుగు చిత్రాల్లోనే కాదు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించి తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. ఒక తమిళ చిత్ర షూటింగ్ లో జరిగిన సంఘటన ఆయన నటనా వైదుష్యానికి, టైమింగ్ కి మచ్చుతునక.  రంగారావు గారి మీద ఒ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరాలో సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన క్లోజ్ అప్ ను ఆరేడుసార్లు తియ్యాల్సి వచ్చింది. తర్వాత కెమెరా రిపోర్ట్ ను పరిశీలిస్తే ప్రతి టేక్ సరిగ్గా 31 అడుగులే వచ్చింది. ఇది చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయారు. ఆయన టైం సెన్స్ ఆది.

( నిన్న 03 జూలై  ఆ మహానుభావుడి జన్మదినం. కారణాంతరాల వల్ల నిన్న ప్రచురించలేకపోయాను. ఆలస్యమైనా ఆ విశిష్ట నటుడ్ని తలచుకోకుండా ఉండలేక ప్రచురిస్తున్నాను )

ఆ విలక్షణ నటుడి నట, సంభాషణా విన్యాస విశిష్టతను ఓసారి తిలకించండి.



Vol. No. 01 Pub. No. 338

2 comments:

  1. vilakshana naTa saarvabhaumauni gUrchi telijesinanduku dhanyavaadaalu saar..

    ReplyDelete
  2. నేపాళ మాంత్రికునికి, ఘటోత్కచునికి, బంగారు పాప లో ఎస్.వి.ఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    ఈయన గురించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఇలా అంటారు.
    "వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

    ReplyDelete