Sunday, April 18, 2010

జ్ఞాన పరీక్ష



అబ్రహం లింకన్ అమెరికా దేశానికి 16 వ అధ్యక్షుడు.
అమెరికా పౌర విప్లవం, బానిసత్వ నిర్మూలన లాంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించిన రాజకీయ చతురుడు. 
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన గొప్ప వ్యక్తులలో ఒకడిగా లింకన్ కు  మేధావి వర్గంలో పేరుంది.


 
ఒకసారి లింకన్ తో ఓ బాల్య మిత్రుడు
" మనిషి తనకున్న జ్ఞానమెంతో  తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి ? " అని అడిగాడు.

దానికి లింకన్
" మంచి పుస్తకాలు, విలువైన గ్రంథాలు విరివిగా చదవాలి. ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా తన అజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అప్పుడే మనకెంత జ్ఞానం వుందో మనకు అర్థమవుతుంది " అని సమాధానమిచ్చాడు.

చరిత్రలో నిలిచిపోయిన అబ్రహాం లింకన్ 1865 వ సంవత్సరం, ఏప్రిల్ 15 వతేదీన  హత్యకు గురయ్యారు.

 Vol. No. 01 Pub. No. 258

Friday, April 16, 2010

నవ్వుల విషాదం

 నవ్వులోనే విషాదం
విషాదంలోనే వినోదం
ఒక కంట హాస్యం
మరోకంట విషాదం
నటనకు మాటలక్కరలేదు 
నటనకు హావభావాలుంటే  చాలు

నటనే జీవితంగా మలచుకొన్న మహానటుడు 
నవ్వులరేడు చార్లీ చాప్లిన్ జన్మదినం  ( ఏప్రిల్ 16 ) సందర్భంగా నీరాజనాలర్పిస్తూ.......



Vol. No. 01 Pub. No. 257

నట ' రాజు '

నట రాజ్యానికి రాజాయన
నటనలో రారాజు ఆయన
తెలుగు, కన్నడ, ఆంగ్ల నాటకాలను
ఔపోసన పట్టిన నాటక కృషీవలుడాయన
ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త బెర్నార్డ్ షా ను
మెప్పించి ఘనకీర్తి గడించిన తెలుగుజాతి రత్నమాయన

ఆయనే....... తెలుగు నాటక రంగానికి ఎనలేని ఘనతను ఆర్జించి పెట్టిన
నట కుల దీపం ' బళ్ళారి రాఘవ ' 

రాఘవ గారి వర్థంతి నిన్న అంటే ఏప్రిల్ 16 వ తేదీ
ఆ సందర్భంగా ఆ నట ' రాజు ' కి  నీరాజనాలర్పిస్తూ......

The glimpses of Telugu drama, 1860-1994
Andhravani samrajyamu anu Sri Krsnadevarayalu: Ayidankamula telugu natakamu

Vol. No. 01 Pub. No. 256

తెలుగు నాటక రంగ దినోత్సవం


 ఏప్రిల్ 16 . తెలుగు రంగస్థల దినోత్సవం.

తెలుగు తేజం, సంఘ సంస్కర్త, తొలితరం కథకులు కందుకూరి వీరేశలింగం గారి 128 వ జన్మదినం.

ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ రంగస్థల దినోత్సవానికి తెలుగు నాటక ప్రియులకు శుభాకాంక్షలు. కందుకూరి వారికి నివాళులు.

Autobiography of Kandukuri Veeresalingam Pantulu

 Vol. No. 01 Pub. No. 255

Wednesday, April 14, 2010

పిల్లలతో ఆట

బాల్యం ఎంత మధురమైనది
పెద్దతనంలో తీపి జ్ఞాపకాల్నిస్తుంది 

మరి ఆ బాల్యంలో మాధుర్యం నేడు కరువైపోతోంది
పెద్దతనానికి చేదు జ్ఞాపకాలే మిగులుస్తోంది
 
బాల కార్మికులను రక్షించడానికి చట్టాలున్నాయి
మరి ఈ బాల కార్మికులను రక్షించడానికి ఏ చట్టాలున్నాయి ?

తమ పిల్లల్ని హింసిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు
తల్లిదండ్రులే హింసిస్తే ఆ పిల్లల్ని కాపాడేవారెవరు ?

ఆడుతూ పాడుతూ చదువుకుని బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలా ?
ఆటా పాట అంటూ తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోవాలా ?

తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలా ?
తమ తాత్కాలికావసరాల కోసం వారి భవిష్యత్తును తాకట్టు పెట్టాలా ?

ఒకప్పుడు పిల్లలకు తెరమీద నటించే అవకాశం రావడం అదో అద్భుతం
తమ పిల్లలని నటింపజేయడం ఓ సరదా ! పిల్లలే పూర్తిగా నటించిన సినిమాలు చాలా తక్కువ. కేవలం ఒకటి రెండు సీన్లుకే పరిమితమయ్యేవారు. అరుదుగా అక్కడక్కడా పూర్తి నిడివి బాల పాత్రలుండేవి.
వాటిల్లో నటించే పిల్లలు ఎక్కువగా సినీ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలే అయ్యేవారు. లేదా కొంతమంది ఉత్సాహంకొద్దీ తమ పిల్లల్ని ఒకటి లేక రెండు సినిమాల్లో నటింపజేసేవారు. వారి భవిష్యత్తుకు ఆటంకం కలగడానికి అప్పటి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడేవారు కాదు. అయితే డబ్బు కోసం పిల్లల్ని సినిమాల్లో నటించడానికి పంపే తల్లిదండ్రులు ఆ రోజుల్లో కూడా వున్నా ఆర్థికంగా ఇబ్బందులుండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపని చేసేవారే ఎక్కువగా వుండేవారు.
 
కానీ ఇప్పుడు బుల్లి తెరనిండా నాట్యం చేస్తున్న పిల్లలే !  అవి నాట్యాలనడం కంటే విన్యాసాలనడం మేలేమో ! ఇవి చేస్తున్న పిల్లలకు తాము చేస్తున్నది ఏమిటో అవగాహన వుందా ? ఏ లక్ష్యం కోసం ఆ పని చేస్తున్నారో వారికి తెలుసా ? భవిష్యత్తులో వీటి ప్రభావమేమిటో వారికి అవగాహన వుందా ? ఎవరికోసం తాము ఈ కసరత్తులు చేస్తున్నామో వారికి అర్థమవుతుందా ? ముమ్మాటికీ కాదు . ఇవేమీ వాళ్లకు తెలీదు. అర్థమయ్యేంత జ్ఞానం వారికి వుండదు. ఈ ఆట పాటా కార్యక్రమాల్లో బహుమతులు గెలుచుకున్న పిల్లలకు అదే వృత్తి కాగలదా ? ఒకవేళ అయినా ఎంతకాలం ఆ వృత్తిలో వుండగలరు ? ఎంత డబ్బు సంపాదించగలరు ? అసలు అంతమంది విజేతల్లో ఎంతమంది తమ గమ్యస్థానం అనుకునే సినిమా రంగానికి చేరుకోగలుగుతున్నారు ?

హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో శిక్షణ పేరుతో హింసకు గురవతూ అందమైన బాల్యాన్ని తాకట్టు పెట్టుకోవడం అవసరమా ?

 అనారోగ్యం చేసినా, కదలలేని పరిస్థితుల్లో వున్నా పోటీలకు తయారు చెయ్యడం కోసం వాళ్ళని హింసించే తల్లిదండ్రులు,
బహుమతి రాకపోతే నిన్ను ఏం చేస్తానో చూసుకో అని బెదిరించే తల్లిదండ్రులు, ఓడిపోతే కెమెరా ఎదురుగా మేమేం బాధపడటంలేదని, కృషి చేసినా అదృష్టం కలసిరాలేదని, ఇదో చాలెంజ్ గా తీసుకుంటామని సన్నాయినొక్కులు నొక్కి. ఇంటికెళ్ళాక మా పరువు తీసావని గొడ్డును బాదినట్లు బాదే తల్లిదండ్రులు....... ఇలా పిల్లలని తమ కంటిపాపల్లా పెంచాల్సింది పోయి వాళ్ళెంత చిత్రహింస అనుభవించినా  తమకి డబ్బు, కీర్తి సంపాదించి పెట్టాలని శాసించే తల్లిదండ్రుల గురించి మీకు తెలుసా ? తమ అవసరాలకీ, తమ ఆడంబరాలకీ పిల్లల్ని బలి చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఎవరిచ్చారు ? తమ అభిరుచుల్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం ఎంతవరకూ సమంజసం ?

 ఇది బాల కార్మిక నిరోధ చట్టం పరిధిలోకి రాదా ? గృహహింసా నిరోధ చట్టం లాగే బాల హింసా నిరోధ చట్టం వుందా ? లేకపోతే అలాంటి చట్టాల్ని తెచ్చి ఈ హింసనుంచి బాలల్ని కాపాడలేమా ? 

ఈ పరిస్థితికి కారణమెవరు ?
వ్యాపారం పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చానల్స్ వారా ?
ఈ బాల హింసను నిరోధించలేని ప్రభుత్వమా ?
తమ పిల్లలతోనే వ్యాపారం చేస్తున్న తల్లిదండ్రులా ?

ఇప్పటి పరిస్థితి ఇదైతే గతంలో కొంతమంది బాల నటుల పరిస్థితి గురించి స్వామి చిత్రానం గా ప్రసిద్ధికెక్కిన కె. వి. రావు గారు కొంతకాలం క్రితం విజయచిత్రలో రాసారు. రావు గారు తెలుగు చిత్ర సీమలో సహాయ దర్శకుడిగా సుమారు అయిదు దశాబ్దాలు ప్రముఖ దర్శక నిర్మాత  బి.ఏ సుబ్బారావు గారి దగ్గర, బాపు గారి దగ్గర చాలా చిత్రాలకు సహకార దర్శకుడిగా, సహ దర్శకుడిగా పనిచేశారు. ఆయన తన అనుభవంలో చూసిన కొన్ని సంఘటనలను ఏర్చి కూర్చి రాసిన  వ్యాసం నుంచి కొన్ని భాగాలు....... 

 తన తల్లిని తండ్రి వదిలేసిన కారణంగా తాను నటించి తల్లిని పోషించాల్సి వచ్చింది ఒక బాలనటుడికి. బాల నటుడిగా అగ్రశ్రేణికి చేరాడు. ద్విపాత్రాభినయం కూడా చేసాడు. కానీ, చదువుకోలేదు. సెట్ లోకి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడే డైరెక్టర్ గారి పిల్లల్ని ( తన ఈడు వారిని ) చూసి సెట్ బయిటకు వెళ్లి " తాను స్కూల్ కు వెళ్ళడం లేదనీ, వాళ్ళలా ఇంగ్లీష్ మాట్లాడలేననీ భోరున ఏడ్చాడు. 
' చదువుకుంటున్న ఆ పిల్లలకన్నా నువ్వే గొప్ప - కొన్ని వేలమందికి తెరమీద కనబడి - వాళ్ళందర్నీ నువ్వు నవ్విస్తున్నావు ' అని ఓదార్చి షాట్ కి తీసుకెళ్ళాను.
************ 
షూటింగ్లో 11 గంటలకు పిల్లలందరికీ బిస్కట్లు, పాలు, హార్లిక్స్ ఇచ్చేవారు. ఓ బాలనటుడు- తనకిచ్చిన బిస్కట్లు తినకుండా దాచుకునేవాడు. ' ఎందుకయ్యా దాచుకుంటున్నావు  అని అడిగితే - 
' నాకు బిస్కట్లు వద్దండీ - పొద్దున్న టిఫిన్ తిన్నా కదండీ - ఇవి మా చెల్లాయికి  పట్టుకెడ్తానండీ ! ' అన్నాడు. 
' ఫర్వాలేదు - నువ్వు తినేయ్. వెళ్ళేటపుడు మీ చెల్లాయికి పట్టుకెళ్డువుగాని ' అని చెబితే అప్పుడు తిన్నాడు. 
' సార్ ! అతనికి షర్ట్ యిచ్చారు గదండి. నాకూ షర్టిప్పించండి "  అన్నాడు.
" నీ షర్ట్ బాగుంది. అంచేత నీ షర్ట్ మార్చలేదు. " 
" అది కాదండి. నాకు ఈ షర్ట్ ఒక్కటే వుందండీ - అందుకని " అని చెప్పాడు. 
ఇతను చెబుతున్నది నిజమేనా అని అతన్ని తీసుకువచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ని అడిగాను. 
" నిజమేనండీ ! వీళ్ళ అమ్మని నాన్న వదిలేసాడు. తల్లినీ, చెల్లినీ పోషించాల్సింది వీడే - తల్లి కూడా అప్పుడప్పుడు వేషాలు వేస్తుంది. చెల్లెలు చదువుకుంటోంది. వీడు యాక్టు చేసి తల్లినీ, చెల్లెల్నీ పోషించాలి. చెల్లిని మాత్రం సినిమాలోకి దింపను. చదివిస్తాను అంటాడు " అని నిజం చెప్పాడు. ఆ కుర్రాడికి సరిపోయే రెండు షర్టులు చెల్లెలికి రెండు గౌన్లు యిప్పించాను.

*************   

ఎంతో చురుగ్గా వుండే అయిదేళ్ళ పాపని ఆమె తల్లినీ తండ్రినీ కాదని, తన దగ్గర వుంచుకుని ' బాలనటి ' ని చేసింది ఓ అమ్మమ్మ. ఒకరోజున ఆ పాప ' మొదటి టేకు ' ను ' ఓకే ' చెయ్యలేదు. అయినా చాలా బాగా చేసింది. 
ఆ రాత్రి మొదటి టేకు ఓకే  చేయలేదన్న కోపంతో ఆ పసిపాప కంట్లో అమృతాంజనం పెట్టింది అమ్మమ్మ. ఆ పాప ఒకటే ఏడుపు. అమ్మమ్మని చీవాట్లు పెట్టి, ఆ పాపను ఆ రాత్రి నాదగ్గరే పడుకో బెట్టుకున్నాను.

*********** 
ఓ నాడు ఓ పాప చెప్పింది.
' మా మ్మమ్మ నాకు పట్టు పరికిణీ, జూకాలూ, నెక్లెసూ, గాజులూ, అన్నీ తెస్తుంది. తెలుసా ? " అంది.
నిజమే అనుకుని సంతోషించాను. 
ఆ సాయింత్రం అమ్మమ్మ వచ్చింది - కారు నిండా ప్యాకెట్లే !
" వాటిలో ఆ పాపకోసం తెచ్చిన ఓ ఆర్ట్ సిల్క్ పరికిణీ, గిల్ట్ నగలూ వున్నాయి. మిగరావి అన్నీ ఆమె కోసం కొనుక్కున్న కంచి పట్టు చీరలూ, వెంకటగిరి నేత చీరలూ, ఆమె భర్తకోసం సేలం అంచు పంచెలూను !
*************
ఒక బాల నటుడు బాగా నటిస్తాడని తెలిసి, అతణ్ణి డైరెక్టర్ గారికి చూపించాలనుకున్నాను. ఆ కుర్రాడి తండ్రి -
" మా వాడికి రేపు 7 గం.లకే షూటింగ్ - 6 గం.లకి ఇంటి దగ్గర బయిల్దేరుతాం. మీరు 5 గం.లకి మాయింటికి రండి.ఆరు లోపల డైరెక్టర్ కి చూపించేసి, షూటింగ్ కి వెళ్ళిపోతాం " అన్నారు. 
" సరే " అని 5 గం.లకి వాళ్ళ యింటికి వెళ్ళాను. 
ఆ బాల నటుడు యింకా లేవలేదు. ( రాత్రి షూటింగ్ చాలా ఆలస్యమైందట )
నిద్రపోతున్న ఆ కుర్రాడిని అలాగే మోసుకెళ్ళి బాత్ రూం లో కుళాయి కింద కూలేసి కుళాయి తెరిచారు. అది శీతాకాలం. 
కొడుకుని నటుడిని చేయాలనా ? వాడిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనా ? ఆ తండ్రి వుద్దేశం అర్థంకాలేదు.

...................... ఎంతటి అభివృద్దో కదా ~ !!

తృష్ణ గారి ' ఏమిటో ఈ ఆట ?! ' టపా చదివాక ఎప్పటి నుండో రాయాలనుకుంటూన్న మనసులోని  ఆవేదన బయిటకు వచ్చింది.

Vol. No. 01 Pub. No. 254

Tuesday, April 13, 2010

ప్రధాన రాజ్యాంగ నిర్మాత

 ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించబోయే తరుణంలో పటిష్టమైన రాజ్యాంగం అవసరమెంతైనా వుంది. ఆ తరుణంలో రాజ్యంగ రచనా సంఘానికి సారధ్యం వహించిన డా. బాబా సాహెబ్ అంబేద్కర్  

సుదీర్ఘంగా వలస పాలనలో మ్రగ్గి వున్న  భారతీయుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాజ్యాంగాన్ని రచించారు.  నవభారత నిర్మాణంలో పాలు పంచుకున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.........







Vol. No. 01 Pub. No. 253

ప్రేమయే జనన మరణ లీల....


మహాకవి శ్రీశ్రీ గారి సినీ రంగ ప్రవేశం 1950 సంవత్సరంలో ' ఆహుతి ' అనే డబ్బింగ్ చిత్రంతో జరిగింది.  ' నీరా ఔర్ నందా ' అనే హిందీ చిత్రానికి అనువాదం ఈ చిత్రం. అంతకుముందు దశాబ్దం క్రితం వచ్చిన ' కాలచక్రం ' ( 1940 ) చిత్రంలో శ్రీశ్రీ గారి మహాప్రస్థానం గీతం వున్నా ఆది ఆ సినిమా కోసం రాసిన గీతం కాదు. అందుకని ఆహుతిలో రాసిన ' ప్రేమయే జనన మరణ లీల........ ' అనే పాటే శ్రీశ్రీ గారి మొదటి చిత్ర గీతం అవుతుంది. ఈ పాట గురించి విశేషాలేమిటో, అసలు సినిమాకు పాటలు రాయడం అనేది ఎంత కష్టమో మహాకవి మాటల్లో.......



సినిమాకు పాటలు రాయడం చాలామంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగుకు రాయడమనేది మరీ కష్టంతో కూడుకున్న పని. ఉదాహరణకు "  ప్రేమయే.. "  అన్న పాటనే తీసుకుందాం. హిందీలో దీని పల్లవి- "  ప్రేమ్ హై జనమ్ మరణ్ కాఖేల్ ... "  . ట్యూన్ ప్రకారం ఇది "  ప్రేమ్ హై - జనమ్ మరణ్ - కాఖేల్ "  అని విరుగుతుంది. ఇందులోని ఆఖరి "  కాఖేల్ "  చాలా యిబ్బంది పెట్టింది. "  ప్రేమయే జనన మరణ ఖేల "  ( గాథ, క్రీడ ) అని రాశాను. గాని "  లీల "  అనే మాట మొదట్లో స్పురించలేదు. ఆ రాత్రి కలత నిద్రలో రాజేశ్వరరావు ట్యూన్ మననం చేసుకుంటూ వుంటే  "  ప్రేమయే జనన మరణ లీల "  అనే పల్లవి దొరికింది. మర్నాడు పాటంతా పూర్తి చేశాను.  

శ్రీశ్రీగారి సినిమా పాటల సంపుటి ' పాడవోయి భారతీయుడా ! ' నుంచి, 



Vol. No. 01 Pub. No. 252