ఆపదలో ఉన్న వారికి సాయపడి వారినేదో ఉద్ధరించేసామనో, వేరే ఎవరైనా చేసి మంచి పేరు తెచ్చుకుంటే మనకా అవకాశం చేజారి పోయిందని వారి మీద బురద జల్లే ప్రయత్నం చెయ్యడమో ఎంత హీనం...........
Vol. No. 01 Pub. No. 185
Friday, February 5, 2010
Thursday, February 4, 2010
కుడి ఎడమైతే..............
మన తెలుగు భాషలో మొదటి టాకీ చిత్రం ' భక్త ప్రహ్లాద ' విడుదలయిన సందర్భంగా జరిగిన కొన్ని తమాషా సంఘటనలు......................
Vol. No. 01 Pub. No. 184
Vol. No. 01 Pub. No. 184
తెలుగులో హాస్య నాటిక రచయితలు
తెలుగులో హాస్యనాటికా ప్రక్రియ ప్రారంభమై సుమారు 132 సంవత్సరాలయింది. వాటి పరిణామ క్రమం, ఆ రచయితల పరిచయం క్లుప్తంగా ...................
Vol. No. 01 Pub. No. 183
Wednesday, February 3, 2010
సహజత్వం కోసం.........
ఇప్పుడొస్తున్న సినిమాలు గానీ, టీవీ సీరియళ్ళు గానీ పరిశీలిస్తే సందర్భోచితంగా అనే మాటకు విలువ లేదేమోననిపిస్తుంది. కథకు అనుగుణంగా సహజత్వం కోసం కాస్త సమయం కేటాయించలేని పరుగు
యుగంలో ఉన్నాం ! అసహజమైన ఆహార్యం, సన్నివేశ ఔచిత్యానికి సంబంధంలేని వేషధారణ కనబడతాయి.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు.
Vol. No. 01 Pub. No. 182
జాతస్య మరణం ధృవమ్ !
మరణం అనివార్యమని తెలిసినా మనిషి డబ్బు మీద తన వ్యామోహాన్ని వదులుకోలేడు.
అందుకే డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అందుకే డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
Vol. No. 01 Pub. No. 181
Tuesday, February 2, 2010
దాసుగారి కో ' వెల '
ఆంధ్రదేశంలో హరికథ అనగానే గుర్తుకోచ్చేది తొలుత ఆదిభట్ల నారాయణ దాసు గారు. హరికథా పితామహులుగా పేరుగాంచారు.
ఆయన హరికథా చెప్పగలరు. గిరికథా చెప్పగలరు.
తెలుగులో చెప్పి తెలుగు వాళ్ళనే కాదు ఇతరభాషల వాళ్ళను కూడా మెప్పించగలరు.
ఆయనది కంచు కంఠం. మైలు దూరానికి వినబడుతుందని ప్రసిద్ధి.
ఆయన హరికథా విద్వాంసులు గానే కాక శృంగార నాయకుడిగా కూడా పేరుపొందారు. విజయనగరానికి ఆయనకూ ఎంత అవినాభావ సంబంధం ఉందో..... ఆ ఊళ్ళోని కోవెల వీధికి, వారికీ కూడా అంతే విడదీయలేని బంధం ఉంది. దాసు గారి శృంగార జీవితాన్ని వర్ణిస్తూ ఆచార్య యస్వీ జోగారావు గారు ఓ గ్రంథం రాసారు. ఆ గ్రంథం పైన మహాకవి శ్రీశ్రీ తన అభిప్రాయాన్ని ఇలా రాసారు.
" మీ గ్రంథంలో క్రొందనమంతా నాయక సంవరణంలోనే వుంది.
ఈ కావ్యం రచించి విజయనగరం కోవెల వీథికో ' వెల ' నిర్దేశించిన మీ ప్రజ్ఞను ప్రశంసిస్తున్నాను "
Vol. No. 01 Pub. No. 180
Monday, February 1, 2010
నటనలో జీవించిన ' సాక్షి '
సాక్షి రంగారావు గొప్ప నటుడు. నవరసాల్ని అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటుడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా తడబాటు లేకుండా, మాడ్యులేషన్ తప్పకుండా, మూడ్ చెడిపోకుండా సునాయాసంగా సీను పండించేసేవారు. ముఖ్యంగా కరుణరస సన్నివేశాలలో నటించేటప్పుడు తాను ఆ సన్నివేశంలో లీనమై పోవడమే కాదు. చుట్టూ ఉన్న చిత్ర యూనిట్ సభ్యులని కూడా కదిలించేవారు. పాత్రలో జీవించడమనే దానికి ఆయన నటనే ఉదాహరణ.
కె.విశ్వనాథ్ గారి ' జననీ జన్మ భూమి ' చిత్రం కోసం ఆయనతో కలసి పనిచేసే అవకాశం కలిగింది. ఆ చిత్రంలో ఒక సన్నివేశం - ఒక ఫ్యాక్టరీ కార్మికుల సమ్మెలో అల్లర్లు రేపడానికి గోకిన రామారావు కొంతమంది నిరుద్యోగుల్ని తీసుకెడతాడు. అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందర్నీ తీసుకొచ్చి ఊరి మధ్యలో విడిచి పెడతారు. అందులో ఆ ఊరి పోస్ట్ మాన్ అయిన సాక్షి రంగారావు కొడుకు కూడా ఉంటాడు. స్వతహాగా నెమ్మదస్తుడైన అతను తండ్రికి భారంగా ఉండలేక, నిరుద్యోగాన్ని భరించలేక ఆ గుంపులో చేరుతాడు. అందులో అతన్ని చూసిన ఊరి జనం ఆశ్చర్యపోతారు. రకరకాలుగా అనుకుంటారు. ఆ అవమానం భరించలేక ఊరి వెలుపల చెట్టుకి ఉరి వేసుకుని చనిపోతాడు. ఉదయాన్నే తన కొడుకు కోసం వెతుకుతున్న సాక్షికి కొడుకు కనబడతాడు. అంతే ! ఆ దృశ్యం చూసి ఆక్రోశిస్తాడు. రాజకీయనాయకుల చేతిలో పావులై, తమ బిడ్డల్ని పోగొట్టుకున్న సగటు తండ్రి ఆవేదనను ఆ సన్నివేశంలో ఆవిష్కరించిన సాక్షి నటన అద్భుతం. నటనలో జీవించడమంటే ఏమిటో అప్పుడు చూసాను. సుమారు ఆరు నిముషాల పైన ఆ డైలాగులు ఒకే షాట్ లో ఒకే టేక్ లో వివిధ రకాల భావాలను వ్యక్తీకరిస్తూ చెప్పిన తీరు యూనిట్ మొత్తాన్ని కంట తడి పెట్టించింది. నిజానికి ఆ సన్నివేశాన్ని విశ్వనాథ్ గారు కనీసం మూడు, నాలుగు షాట్స్ గా చిత్రీకరిస్తారు. కానీ ఆ టేక్ లో కట్ చెప్పకుండా, చెప్పబోతున్న కో - డైరెక్టర్ నండూరి విజయ్ గారిని వారించి ఆ ప్రవాహం కొనసాగించారు. తర్వాత కొన్ని షాట్స్ తీసుకుని జత చేసారనుకోండి.
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూన్న యువకుల, విద్యార్థుల తల్లిదండ్రుల గర్భశోకానికి దర్పణం సాక్షి రంగారావు నటన. ఆ సన్నివేశంలో సాక్షి రంగారావు నటించలేదు. జీవించాడు...... చూడండి.
Vol. No. 01 Pub. No. 179

Subscribe to:
Posts (Atom)

.jpg)