" చదవండి..చదవండి..చదవండి.. ఇదే నేటి యువతకు నేనిచ్చే సందేశం. ప్రసిద్ధ రచయితల జీవిత చరిత్రను, వారి జీవన గమనాన్ని అధ్యయనం చేయండి. నేను చేసింది అదే........ " - భరాగో
సున్నితమైన హాస్యం ఆయన సొంతం
సునిశితమైన పరిశీలన ఆయన పథం
తెలుగు కథా వినీలాకాశంలో మిగిలివున్న తారల్లో ఒక తార
తెలుగు సాహిత్య ఉద్యానవనంలో విరబూసిన కథాకుసుమం
ఆ తార రాలిపోయింది
ఆ ఆకాశం చిన్నబోయింది
ఆ కుసుమం వాడిపోయింది
ఆ ఉద్యానవనం బోసిపోయింది
" ఈ ప్రపంచం ఎంత అందమైనది ! దీని అందాన్ని నా మరణం తరవాత కూడా ఆస్వాదించగలనా ? నేను వెళ్ళే ఆ మరోప్రపంచంలో ఆపాత మధురమైన పాటలను ఆలకించలేనా ? ఏమో ? నా కోరిక నెరవేరుతుందేమో ? ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి మూడే మూడు. అవి అందం, ఆనందం, మాధుర్యం. అవి ఎక్కడ ఉన్నా వాటిని అన్వేషించటమే మన పని.... "
అంటూ వెళ్ళిపోయారు రచయిత భరాగో
ఈ ప్రపంచం యొక్క అందాన్ని తప్పకుండా ఇక ముందు కూడా చూడగలరు
ఆపాత మధురమైన పాటల్ని తప్పకుండా ఇక ముందు కూడా ఆలకించగలరు
ఆనందాన్ని అక్కడ కూడా అన్వేషించగలరు... ఎందుకంటే ఆయన నిత్యాన్వేషి
ఆయన అన్వేషణ ఫలించాలని..... ఆయన ఆత్మకు శాంతి కలగాలని.... కోరుకుంటూ....
గమనిక : రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు పంపిన ' భరాగో ' గారి అంతిమ యాత్ర చిత్రాలు ఇక్కడ చూడండి.
Vol. No. 01 Pub. No. 246
Wednesday, April 7, 2010
పిల్లల ఆటలు - గుజ్జనగూళ్ళు
బాల్యం మధురమైనది.
ఆటపాటలతో గడపాల్సిన దశ బాల్యం
బాల్యంలో మనోవికాసానికి, స్నేహశీలత పెంపొందడానికి,
క్రీడాస్పూర్తి పెరగడానికి ఆటలు, కళలు దోహదపడతాయి.
దురదృష్టవశాత్తూ ఈరోజుల్లో ఈ రెంటికీ ఆదరణ తగ్గిపోయింది.
చదువు వ్యాపారమయ్యాక ఆటలకి సమయం చాలడంలేదు.
ఆటలు కూడా వ్యాపారమయ్యాక క్రీడాస్పూర్తి లోపించింది.
కళ కళ కోసమే అనే ఆలోచన దాదాపుగా కనుమరుగైపోయింది.
కళ కూడా వ్యాపారంకోసమే అనే ధోరణి ప్రబలిపోయింది.
వేసవి సెలవలోచ్చేసాయి. కనీసం ఈ సెలవల్లోనైనా పెద్దలందరూ ఆలోచన చేసి
తమ పిల్లలకు, మనుమలకు తాము చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్ని పరిచయం చేసి
వాళ్లకు మన సంస్కృతిని తెలుసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది.
ఇక గుజ్జనగూళ్ళు గురించి ఒకసారి పరిశీలిద్దాం.
ముందుగా మిత్రుల అభిప్రాయాలను పరిశీలిస్తే .......
1. జ్యోతి గారు తాము గతంలో పిల్లల ఆటల మీద రాసిన సమగ్ర వ్యాసం లింకు పంపారు. చాలా వివరంగా చర్చించారు. కాకపోతే అందులో గుజ్జనగూళ్ళు కిచ్చిన పధ్ధతి ' ఓమన లేదా వామన గుంటలు' అనే ఆటకు సంబంధించినది.
2. సీతారాం గారు గుజ్జనగూళ్ళు అనే మాటకు అర్థాన్ని చాలావరకు వివరించడానికి ప్రయత్నించారు.
3. కౌటిల్య గారు కూడా అర్థాన్ని వివరించడానికి చాలావరకు ప్రయత్నించి చాలా దగ్గరగా వచ్చారు.
మిగిలిన మిత్రులు మందాకిని గారు, మాధురి గారు, సౌమ్య గారు, అజ్ఞాత గారు తమకు తెలిసినంతవరకూ వివరించారు.
ముందుగా అందరికీ ధన్యవాదాలు చెబుతూ గుజ్జనగూళ్ళు అనే మాట పూర్వాపరాలు వివరించడానికి ప్రయత్నిస్తాను.
అన్నప్రాసన నాడే ఆవకాయా !
చంటి పిల్లలకు అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టలేం కదా !
అందుకని గతంలో ( ఈ కాలంలో నేను ఎక్కువగా ఎక్కడా చూడలేదు ) వారికి తేలికగా జీర్ణమయ్యే ఓ పదార్థాన్ని తయారుచేసేవారు. బియ్యం, బెల్లం కలిపి ఉడికించి నెయ్యి వేసి బాగా కలిపి గుజ్జులాగా చేసేవారు. దానిని గోరుముద్దలు అంటే కొద్దిగా బొటనవేలి పైభాగాన వుంచుకుని పిల్లల్ని పాటలు పాడుతూ లాలించి, బుజ్జగించి నోటికందించి తినిపించేవారు.
అలా గుజ్జు రూపంలో వున్న కూడు కనుక గుజ్జనగూడు అయింది.
ఇక ఆట రూపాన్ని తీసుకుంటే సాధారణంగా పిల్లలు పెద్దల్ని అనుకరించడం సహజం. ఆ అనుకరణ మనకి ఆటల్లో కూడా కనిపిస్తుంది. బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యడం, అమ్మానాన్న ఆటలాడుకోవడం వగైరా ఇలాంటివే ! ఈ ఆటల్లో నిజంగా గానీ, ఉత్తుత్తినేగానీ వంట చెయ్యడం, వడ్డించడం చేస్తారు. బహుశా ఈ అనుకరణ వల్లనే ఈ ఆటకు కూడా గుజ్జనగూళ్ళు అనే పేరు వచ్చివుండవచ్చు.
ఈ ఆట ఆడే పధ్ధతి గురించి మరో విధానం కూడా గుజ్జనగూళ్ళు - సందేహం టపాలో ప్రస్తావించడం జరిగింది. ఆ విధానానికి కూడా గుజ్జనగూళ్ళు అనే పేరు వున్నట్లు నేను ఒకచోట చదివాను. అయితే ఆది సరికాదేమోనన్న ఆలోచనతో సందేహం వెలిబుచ్చడం జరిగింది. దానికి మిత్రులు కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. కనుక పైన వివరించిన అర్థమే సరైనదని అనుకోవచ్చు.
శబ్దరత్నాకరము లో ఇచ్చిన వివరణ ( పుట 282 ) : 1. ( గుజ్జు + ఎన + కూళ్ళు ) బాల క్రీడా విశేషము; 2 . బాలికలాడుకొనునప్పుడు గురుగులతో వండిన వంటకము.
ఒక్క విషయం. మనకే స్వంతమైన, మన సంస్కృతిలో భాగమైన ఇలాంటి విశేషాల్ని మనం మరచిపోకుండా వుండడానికి, ముందుతరాలకి పరిచయం చేసి వాటిని సజీవంగా వుంచడానికి అప్పుడప్పుడు ఇలా గుర్తుచేసుకోవడం మంచిదేమో ! ఆలోచించండి.
బాపు గారు అందించిన ఆరుద్ర గారి బాలల ఆటల సాహిత్యం కె.వి.మహదేవన్ స్వరకల్పనలో పి.బి.శ్రీనివాస్ గళంలో వినండి.
Vol. No. 01 Pub. No. 245

Monday, April 5, 2010
అన్నీ మన మంచికే !
హరివంశ్ రాయ్ బచ్చన్ అనగానే గుర్తుకొచ్చేది భారతీయ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తండ్రిగా ! కానీ ఆయన హిందీలో ప్రసిద్ధి పొందిన కవి. ఒమర్ ఖయ్యాం ఉర్దూ లో రచించిన రుబాయత్ ను హిందీలోకి తర్జుమా చేశారు. ప్రముఖ ఆంగ్ల రచయిత, కవి షేక్స్పియర్ రచనల్ని హిందీలోకి తర్జుమా చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం, బిర్లా ఫౌండేషన్ వారి సరస్వతీ సమ్మాన్, సోవియెట్ ల్యాండ్ నెహ్రు బహుమతి, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ' పద్మ భూషణ్ ' లాంటి ఎన్నో గౌరవాలు పొందారు.
ఆయన చెప్పిన మంచి మాటలు -
ఆచార్య ఆత్రేయ గారు మురళీకృష్ణ చిత్రం కోసం రాసిన, మాస్టర్ వేణు సంగీతంలో ఘంటసాల గానం చేసిన ఈ పాటలోని చరణాన్ని వింటే ఈ ఇద్దరి కవుల భావ సారూప్యాన్ని గమనించవచ్చు.
ఆయన చెప్పిన మంచి మాటలు -
నీవు కోరుకున్నట్లు జరిగిందా మంచిదే. జరుగలేదూ మరీ మంచిది. మనకు తెలియకుండానే మనను నడిపించే శక్తి ఏదో - భగవంతుడో, సర్వేశ్వరుడో, మరేదైనా అను - మనకు ఒక గుణపాఠం నేర్పడానికే అలా చేసిందని భావించు. ఆ శక్తి మనకెన్నడూ అపకారం చెయ్యదు. ఆ సంగతి నీవు సంక్షోభంలో, సమస్యల్లో వున్నప్పుడు గ్రహించకపోయినా తర్వాత గుర్తిస్తావు.
ఆచార్య ఆత్రేయ గారు మురళీకృష్ణ చిత్రం కోసం రాసిన, మాస్టర్ వేణు సంగీతంలో ఘంటసాల గానం చేసిన ఈ పాటలోని చరణాన్ని వింటే ఈ ఇద్దరి కవుల భావ సారూప్యాన్ని గమనించవచ్చు.
Vol. No. 01 Pub. No. 244
గుజ్జనగూళ్ళు - సందేహం
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను.
http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html
దానిలో ' గుజ్జనగూళ్ళు ' కు సంబంధించిన భాగం :
13. ఇంట్లోనే ఉండి ఆడుకునే మరో ఆట . గుజ్జనగుళ్లు. తెలంగాణాలో ఒనగండ్ల ఆట అంటారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన పీట ఉంటుంది. చెక్కతో కాని, స్టీలుతో కాని చేసి ఉంటుంది. రెండువైపులా ఎదురెదురుగా పదేసి గుండ్రటి గళ్లు ఉంటాయి. ఆటగాళ్లు ఎదురెదురుగా కూర్చోని చింతగింజలు, లేదా సీతాఫల గింజలు ఆ గళ్లలో వేసి గవ్వలు లేదా పావులతో ఆడతారు. ఇది తెలివిగా ఆడితే ఎదుటివారి గింజలన్నీ సంపాదించుకోవాలి. ఇందులో కూడా రెండు మూడు రకాల ఆటలు ఉన్నాయి. ఆడుతుంటె సమయమే తెలీదు. వేసవి సెలవుల్లో మంచి కాలక్షేపం.
కానీ నాకు ఒక సందేహం. జ్యోతి గారు పైన చెప్పిన ఆటను గుజ్జనగూళ్ళు అనికాక ' వామన ( లేదా ) ఓమన గుంటలు ' అంటారనుకుంటాను. ( చూ : గాజుల సత్యనారాయణ గారి ' పెద్దబాలశిక్ష ' పేజీ : 686 ) . మా అమ్మమ్మ గారు ( వయసు సుమారు 90 సంవత్సరాలు ) ఇప్పటికీ ఆడుకుంటూ వుంటారు. ఆవిడ దగ్గర చెక్కతో చేసిన పీట ఇప్పటికీ వుంది. ఇంతకీ ఈ ఆటకు ఈ రెండింటిలో ఏది సరైన పేరు ?
' గుజ్జనగూళ్ళు ' ఆట ఆడే పద్ధతులు నాకు గుర్తున్నంతవరకూ ఇవి -
1 . పిల్లలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఒకరి చేతులొకరు పట్టుకుని కొంచెం ఎత్తులో వుంచుతారు. మిగిలిన పిల్లలు ఏదైనా పాట పాడుతూ ఆ చేతుల క్రిందనుంచి వరుసగా దూరుతూ వెడతారు. ఆ పాట పూర్తయ్యే సమయానికి చేతులెత్తి నిలుచున్న పిల్లలు ఆ చేతులు దించి వేస్తారు. అప్పుడు ఆ చేతి క్రింద దూరుతూ వెడుతున్న వాళ్ళలో ఎవరు వుంటే వారు ఔట్ అయినట్లు.
2. పిల్లలు పెద్దవాళ్ళను అనుకరిస్తూ ఆడుకునేటప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు, వంటలు, విందులూ చేసుకుని తినిపిస్తారు.
పెద్దబాలశిక్ష లో ఈ రెండో పద్ధతే కనిపిస్తుంది. మరో చోట మొదటి పధ్ధతినే గుజ్జనగూళ్ళు అంటారని చదివాను. అంతే కాదు చిన్నప్పటి జ్ఞాపకం కూడా !
- ఈ రెండు పద్ధతుల్లో ఏది సరైనదో సరిగా గుర్తులేదు. ప్రాంతీయ బేదాలున్నాయేమో తెలీదు. ఈ సందేహాన్ని జ్యోతి గారు గానీ, ఈ ఆట తెలిసిన మరెవరైనా బ్లాగు మిత్రులు గానీ తీర్చాలి.
అసలు ' గుజ్జనగూళ్ళు ' అంటే అర్థం ఏమిటి ? ఆది కూడా చెప్పగలరేమో ప్రయత్నించండి.
Vol. No. 01 Pub. No. 243a

Sunday, April 4, 2010
గుజ్జన గూళ్ళు
కనుక్కోండి చూద్దాం - 15
గుజ్జనగూళ్ళు ........
ఇప్పటితరం వారికి తెలియదేమో కానీ నాల్గయిదు దశాబ్దాల క్రితం వరకూ అంటే టీవీ అనేది లేని రోజుల్లో పిల్లలందరూ సాయింత్రం హాయిగా ఆరుబయిట రకరకాల ఆటలు ఆడుకునేవారు.
అప్పటి తరానికి చెందిన వారికి ముఖ్యంగా సోదరీమణులకు ఈ ఆట గురించి బాగా తెలిసి వుంటుంది.
ఈ ఆట ఆడే విధానాలలో అనేక రకాలున్నట్లుగా తెలుస్తోంది.
తమకు తెలిసిన విధానాల గురించి మిత్రులెవరైనా వివరించగలరా ?
ఇక అసలు ప్రశ్న - ' గుజ్జనగూళ్ళు ' అనే మాటకు అర్థమేమిటి ? దాని పూర్వాపరాలేమిటి ?
Vol. No. 01 Pub. No. 243
Saturday, April 3, 2010
దటీజ్ మదర్ !!
అదొక అద్భుతమైన, అపురూపమైన సన్నివేశం. 1969 జూలై 20 వ తేదీన మానవుడు చంద్రమండలాన్ని జయించాడు. తొలిసారిగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు పెట్టాడు. ప్రపంచమంతా పండుగ చేసుకుంది. అదొక సంచలనం.
అందరిలాగే కలకత్తాలోని మదర్ థెరిస్సా అనాదాశ్రమంలోని వారందరూ కూడా సంతోషం పట్టలేక పోయారు. వెంటనే మదర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పారు. ఆవిడ కూడా ఎంతో సంతోషించారు.
అందులో ఒకామె మదర్ తో " మీరెప్పుడైనా చంద్రమండలానికి వెళ్ళే అవకాశం వుందా మదర్ ? " అని అడిగింది.
దానికి మదర్ తన సహజ ధోరణిలో " అక్కడ కూడా నిరుపేదలు, దిక్కులేని వారు వున్నారంటే తప్పకుండా వారి సేవలకోసం వెడతాను. నేనే కాదు. మిమ్మల్ని కూడా తీసుకేడతాను " అన్నారట. దటీజ్ మదర్ !!
Vol. No. 01 Pub. No. 242

Thursday, April 1, 2010
అంబులన్స్ డ్రైవర్లు
కనుక్కోండి చూద్దాం - 14
ఈ ఫోటో కనిపిస్తున్న వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాడు.
పెద్దల కంటే పిన్నలకు చాలా ఆత్మీయుడు.
ఈయన కూడా ప్రపంచ ప్రముఖుడే !
కాకపోతే పుస్తక ప్రియులకు ఆత్మీయుడు !!
ఈయన కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచినవాడే !
ఈయన కూడా పుస్తక ప్రియులకు ఆత్మీయుడే !
వీరందరూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంబులన్స్ డ్రైవర్లుగా పనిచేశారు.
ఈ ముగ్గురినీ గుర్తుపట్టగలరా ?
వీరి పేర్లేమిటి ?
వీరు ఏ ఏ రంగాలకు చెందినవారు ?Vol. No. 01 Pub. No. 241
Labels:
క్విజ్
Subscribe to:
Posts (Atom)