సీనియర్ బ్లాగర్ ' కొత్తపాళీ ' గా ప్రసిద్ధికెక్కిన శ్రీ ఎస్. నారాయణ స్వామి గారు రచించిన కథల సంపుటి " రంగుటద్దాల కిటికీ " పుస్తకావిష్కరణ విజయవాడ సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో విజయవాడ స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో 06-12-09 తేదీన జరిగింది. ఆ విశేషాలు చూడండి.......
Vol. No. 01 Pub. No. 129
Sunday, December 6, 2009
Saturday, December 5, 2009
బ్లాగర్ మిత్రులకు విన్నపం
సీనియర్ బ్లాగెర్ కొత్తపాళీ కొత్తగా కథల సంపుటి వెలువరిస్తున్నారు.
ఈ రోజు సాయింత్రం గం. 5.00 లకు విజయవాడ లోని బందరులాకుల దగ్గరున్న
స్వాతంత్ర్య సమరయోధుల సంఘం లో ఆవిష్కరణ సభ జరుగుతోంది.
విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలోని బ్లాగెర్లందరు తప్పక హాజరు
కావలిసినదిగా శిరాకదంబం విజ్ఞప్తి చేస్తోంది.
బ్లాగ్ కుటుంబంలో జరుగుతున్న ఈ సంబరంలో పాలు పంచుకుని ఈ సభను విజయవంతం చేద్దాం !
అలాగే మీ సాహితీ మిత్రులకు, సాహిత్యాభిమానులకు ఈ సమాచారాన్ని
తెలియజేసి వారికి కూడా పాల్గొనే అవకాశం కలుగజేయ్యండి.
Vol. No. 01 Pub. No. 128
ఈ రోజు సాయింత్రం గం. 5.00 లకు విజయవాడ లోని బందరులాకుల దగ్గరున్న
స్వాతంత్ర్య సమరయోధుల సంఘం లో ఆవిష్కరణ సభ జరుగుతోంది.
విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలోని బ్లాగెర్లందరు తప్పక హాజరు
కావలిసినదిగా శిరాకదంబం విజ్ఞప్తి చేస్తోంది.
బ్లాగ్ కుటుంబంలో జరుగుతున్న ఈ సంబరంలో పాలు పంచుకుని ఈ సభను విజయవంతం చేద్దాం !
అలాగే మీ సాహితీ మిత్రులకు, సాహిత్యాభిమానులకు ఈ సమాచారాన్ని
తెలియజేసి వారికి కూడా పాల్గొనే అవకాశం కలుగజేయ్యండి.
Vol. No. 01 Pub. No. 128
మహానటీ ! నీవు లేక...!!
నీవు లేక వీణా పలుకలేనన్నది !
నీవు లేక వెండి తెర వెల వెల పోయినది !!
కనులు కనులతో కలబడితే
కనులే మనతో మాటలాడితే
జీవితంలోనటించడం చాలామందికి తెలుసు
నటనలో జీవించడం కొందరికే తెలుసు
వారిలో అగ్ర తాంబూలం మహానటి సావిత్రిదే !
గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 వ తేదీన ఉదయించిన ఈ తార 13 ఏళ్ళ వయసులో 1949 లో ' అగ్ని పరీక్ష ' చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు చలన చిత్ర సీమలో తళుక్కున మెరిసింది.
1950 లో ' సంసారం ' చిత్రంలో రెండవ హీరోయిన్ కాబోయి మళ్ళీ చిన్న పాత్రతో సరిపెట్టుకుంది.
1951 లో ' పాతాళ భైరవి ' లో నృత్యం చేసింది.
1952 లో ' పెళ్లి చేసి చూడు ' చిత్రంలో రెండవ హీరోయిన్ పాత్ర దక్కింది.
1953 లో ' దేవదాసు ' చిత్రంతో ఆమె నటజీవితం మలుపు తిరిగింది.
1954 లో ' మనంబోల మాంగల్యం ' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో జెమిని గణేషన్ ను వివాహమాడారు.
1958 లో విజయ చాముండేశ్వరి, 1965 లో సతీష్ ఆమె సంతానంగా జన్మించారు.
1960 లో ' చివరకు మిగిలేది ' చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగులో చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారం మొదలైన చిత్రాలకు
తమిళంలో ఉళ్ళం, ప్రాప్తం చిత్రాలకు సావిత్రి దర్శకత్వం వహించారు.
నిర్మాతగా వ్యవహరించిన ' ప్రాప్తం ' చిత్ర సీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిన ఆ మహానటి పతనానికి పునాది వేసింది.
మహానటి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా సృత్యంజలి
Vol. No. 01 Pub. No. 127
Friday, December 4, 2009
అమర గాయకుడు
అమర గాయకుడి జన్మదిన సందర్భంగా ఆయన తొలి గీతం " స్వర్గ సీమ " చిత్రంలో భానుమతితో కలసి పాడిన ' ఓహో ! నా రాజా ! ' పాట ఆయన అపురూప చిత్రాలతో.....
Vol. No. 01 Pub. No. 126
Vol. No. 01 Pub. No. 126
Thursday, December 3, 2009
గాన గంధర్వుడి పుట్టిన రోజు

ఆయన పాట అజరామరంఆయన గానం గంధర్వ గానం
ఆయనే ఘంటసాల వెంకటేశ్వర రావు
డిసెంబర్ 4 వ తేదీ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు స్వర నివాళి
Vol. No. 01 Pub. No. 125
నిజాయితీ విలువ


ఎడమ ఫోటోలో ఉన్నది ప్రముఖ రచయిత భమిడిపాటి కామేశ్వర రావు గారు . కుడిప్రక్క ఫోటోలో ఉన్నది ఆయన కుమారుడు , మరో ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ .
చదువుకునే రోజులు పోయి చదువు' కొనే ' రోజులు వచ్చాయని అడ్మిషన్ రోజుల్లో తల్లిదండ్రులందరూ వాపోవడం పరిపాటే ! అయినా తమ పిల్లలకు సీట్ కోసం అన్ని రకాల దారుల్లో ప్రయత్నం మానరు. తమ పిల్లల ప్రతిభను పెంచే కంటే వాళ్లకు ఎలాగో అలా డిగ్రీ సంపాదించడమే లక్ష్యంగా ఉన్న ఈ రోజుల్లో ఈ రచయితల ఉదంతం వింతగా ఉండొచ్చు. విలువలు కాస్తో, కూస్తో మిగిలున్న ఆ రోజుల్లో ఇలాంటివి మామూలే !
రాధాకృష్ణ గారు డిగ్రీ పూర్తిచేశాక ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో ఎలాగో కష్టపడి ఇంజనీరింగ్ సీట్ సంపాదించారు. ఆ విషయం కామేశ్వర రావు గారికి తెలియదు. కానీ ఎలాగో ఆయనకు ఈ సమాచారం చేరింది. వెంటనే ఆయన ఆ కాలేజీకి వెళ్లి మెరిట్ లో రాని తన కుమారుడికి ఆ సీట్ ఇవ్వవద్దని, అర్హత గల మరో విద్యార్థికి ఇవ్వమని ఆ సీట్ రద్దు చేయించారట ! ఈ రోజుల్లో ఇలా ప్రవర్తించే తల్లిదండ్రులున్నారంటారా ?
ఈ సందర్భంలో ఒక విషయం. 1972-73 సంవత్సరాల్లో ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉధృతంగా సాగింది. అప్పటికి నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఉన్నాను. నా గ్రూప్ బి. పి. సి. ఇప్పటిలా ప్రతి సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలకు కలిపి పరీక్షలుండేవి. మొదటి సంవత్సరం మొదటి శ్రేణిలో సాగిన మా చదువు ఆర్నెల్ల ఉద్యమం ఉద్యమం పుణ్యమాని కొండెక్కింది. కంపార్ట్మెంట్ లో పాసైన నాకు మెడిసిన్ కి వెళ్ళే అవకాశం పోయింది. అప్పటికి ఎంసెట్ లు వగైరా లేవులెండి ! పోనీ బి.ఎస్సీ. లో చేరుదామనుకున్నాను. అడ్మిషన్లకు ఇంటర్వూలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ మా నాన్నగారిని అడిగారు (ఆయన ఆ కాలేజీలోనే సీనియర్ లెక్చరర్. పైగా ఆ అడ్మిషన్ కమిటిలో సభ్యులు ) మీ వాణ్ని బి.ఎస్సీ . లో కాకుండా బి.కాం. లో ఎందుకు చేరుస్తున్నారు ? అని. ఆ కమిటీలో ఉన్న మిగిలిన లెక్చరర్ లందరికీ నా సంగతి తెలుసు. వాళ్లు కూడా ఉద్యమ ప్రభావం వలన ఈ పరిస్థితి వచ్చింది కానీ లేకపోతే మీ వాడి ఫలితాలు బాగానే ఉండేవి అన్నారు. మా నాన్నగారు మాత్రం కారణమేదైనా వాడికొచ్చిన మార్కులకి మెరిట్ లో బి.ఎస్సీ. సీట్ ఇవ్వలేం కదా ! మెరిట్ లిస్టు ప్రకారం బి. కాం. లోనే ఇవ్వగలం !! అందుకని వాడికి బి.కాం. లోనే సీట్ ఇవ్వండి అని నాకు ఏమాత్రం ఆసక్తి లేని బీకాం లోనే చేర్చారు. దాంతో సాహిత్యం, నాటకం, సాంస్కృతిక కార్యక్రమాల వైపు నా దృష్టి మళ్ళింది. అలా చదువులని త్యాగం చేసిన ప్రత్యేక ఆంధ్రోద్యమాన్ని నాయకులు నిర్వీర్యం చేసేసారు. అప్పట్లో మాకు భవిష్యత్తు గురించిన ఆలోచించే శక్తి లేదు. అదే ఆ నాయకులకు పెట్టుబడి అయింది. ఏదేమైనా ఆ ఉద్యమం నాకు లోకాన్ని తెలియజేసింది. లేకపోతే నూతిలో కప్పలాగా ఉండిపోయేవాడినేమో !
Vol. No. 01 Pub. No. 124
Wednesday, December 2, 2009
'విజయ' నాగిరెడ్డి
తెలుగు ప్రేక్షకుల్లో ఏకాభిప్రాయం ఏర్పరిచిన ఏకైక చిత్ర నిర్మాణ సంస్థ ' విజయా ప్రొడక్షన్స్' . ఆబాలగోపాలాన్ని అలరించేలా ఆ సంస్థను తీర్చిదిద్దిన వ్యక్తులు నాగిరెడ్డి - చక్రపాణి. వారిలో నాగిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా..........
Vol. No. 01 Pub. No. 123
Vol. No. 01 Pub. No. 123
Subscribe to:
Posts (Atom)