Monday, September 13, 2010

గాయక నటుడు ......... ?

కనుక్కోండి చూద్దాం - 27

ఆయన గత తరానికి చెందిన గాయక నటుడు.
చిత్రసీమలో నటుడిగా స్థిరపడాలని మద్రాస్ వెళ్లారు. అక్కడ అప్పటికే కళాదర్శకుడిగా పని చేస్తున్న తన అన్నగారింట్లో వుండి ప్రయత్నాలు చేశారు.
' లవంగి ' , ' రామదాసు ' అనే తమిళ చిత్రాల్లో తొలిసారిగా నటించారు.
' రామదాసు ' చిత్ర సంగీత దర్శకుడు సి. వి. సుబ్బరామన్ ఆయన పాట విని తాను సంగీత దర్శకత్వం చేసిన ఒక విజయవంతమైన తెలుగు చిత్రం ద్వారా గాయకుడిగా పరిచయం చేశారు.
తర్వాత  షావుకారు, మాయాబజారు, మనోహర, రాజమకుటం వగైరా చిత్రాల్లో నటించినా గాయకుడిగానే  ప్రసిద్ధుడయ్యారు. ఒక తరహా పాటలకు ఆయనదే సరైన గళమనిపించేంతగా ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ఒక ప్రసిద్ధ నటునికి ఆయన పాడితే ఆ నటుడే పాడాడా అనిపించేంతగా ఆయన గళం అమరేది.

ఆ గాయక నటుడు ఎవరు ? ఆయన పాడిన తొలి పాట ఏ చిత్రంలోనిది ? 

Vol. No. 02 Pub. No. 025

5 comments:

  1. ఎస్.వి.రంగారావ్ గారికి పాడే సత్యం గారనుకుంట. ఈయన నటుడేనా! తెలీదు.

    ReplyDelete
  2. మాధవ పెద్ది సత్య౦ గారు

    ReplyDelete
  3. మాధురి, ఆత్రేయ గారల సమాధానాలతో నేను ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  4. కథకుడూ, కళాదర్శకుడూ గోఖలే

    ReplyDelete