గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.
Wednesday, November 4, 2009
హరికథా సమ్మోహనం
హరికథా ప్రక్రియ చాలా విశిష్టమైనది. గతంలో ఈ హరికథా గానాలు ఊరూతా వినబడుతూ ఉండేవి. హరికథలకు బహుళ ప్రాచుర్యాన్ని తెచ్చిన మహానుభావుడు.......

గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.
గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.
దక్షిణాదిన తొలి తెలుగు చిత్రం
1931 లోనే తెలుగు భాషలో చిత్రాల నిర్మాణం ప్రారంభమైంది. కానీ అప్పట్లో ఉత్తరాదినే నిర్మించేవారు.
గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.
గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.
Tuesday, November 3, 2009
ఆంధ్రలో తొలి ఫిలిం స్టూడియో
చిత్ర వైభవం 010
తెలుగు చిత్ర రంగం తొలి రోజుల్లో మద్రాస్ లో మాత్రమే సినిమా స్టూడియోలు ఉండేవి. తెలుగు వారి హస్తం వాటిలో ఉన్నా తెలుగు గడ్డ మీద స్టూడియో లు లేవు. ఆ తరుణంలో 1936 లో రాజమండ్రిలో నిడుమర్తి సూరయ్య గారనే ఆయన ' దుర్గా సినీ టోన్ ' అనే పేరుతో ఒక స్టూడియో నిర్మించారు. ఆంద్ర దేశంలో అదే తొలి ఫిలిం స్టూడియో. ఆ స్టూడియో లో కోడేరు రాజు, పుష్పవల్లి జంటగా సంపూర్ణ రామాయణం చిత్రాన్ని నిర్మించారు. అటు తర్వాత కొన్ని చిత్రాలు నిర్మించినా ఎక్కువరోజులు ఆ స్టూడియో నిలదొక్కుకోలేకపోయింది. చిత్ర ప్రదర్శనలను ప్రజలకు చేరువ చెయ్యడంలో సూరయ్య గారి కృషి చెప్పుకోదగ్గది. సంపూర్ణ రామాయణం అణా కానీ కి, ఆ మరుసటి సంవత్సరం నిర్మించిన దశావతారాలు ఒక్కొక్క అవతారం ఒక కానీ చొప్పున చూపిస్తానని ప్రచారం చేసి ప్రజల్ని ఆకర్షించారు.
తెలుగు చిత్ర రంగంలో తొలి తరం దాదాపుగా తరలిపోయింది. ఆ జ్ఞాపకాలను నింపుకున్న మలితరంలో కూడా ఒ
కరొకరే తమ ప్రయాణం ముగిస్తున్నారు. ఆ క్రమంలో తొలి ఆంధ్ర ఫిలిం స్టూడియో స్థాపకుడు నిడుమర్తి సూరయ్య గారి కుమారుడు, ప్రముఖ చిత్రనిర్మాత ఎన్. ఎస్. మూర్తి గారు ఇటీవలే స్వర్గస్తులయ్యారని నవతరంగం ద్వారా తెలిసింది. ఈయన బాపు, రమణలకు సన్నిహితులు. వారితో సంపూర్ణ రామాయణం లాంటి చిత్రాలను నిర్మించారు. వారికి నివాళులర్పిస్తూ ......

శ్రీశ్రీ ని అప్పులుపాలుచేసిన అవార్డు
| This feature is powered by Dishant.com - Home of Indian Music ' తెలుగు వీర లేవరా ' ఈ పాటకు మహాకవి శ్రీశ్రీ కి జాతీయ అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ! అవార్డు క్రింద మొదట పదివేల రూపాయలు ప్రకటించటం జరిగింది. తర్వాత అది ఐదు వేలకు తగ్గించారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలి అహమ్మద్ ఆ అవార్డును శ్రీశ్రీ కి ప్రదానం చేసారు. పారితోషికం కవరులో పెట్టి ఇచ్చారు. తర్వాత చూస్తే అందులో ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు విలువ చేసే 5 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒకసారి శ్రీశ్రీ గారికి డబ్బు అవసరమై వాటిని స్టేట్ బ్యాంకు లో తాకట్టు పెట్టి మూడువేల రూపాయిలు తీసుకున్నారు. తర్వాత ఆ విషయం మరచిపోయారు. ఐదేళ్ళ తరువాత బ్యాంకు వాళ్ళు అసలు, వడ్డీ కలిపి పదివేల రూపాయలు కట్టమని నోటిసు పంపారు. అప్పుడు గుర్తుకొచ్చి కంగారు పడ్డ శ్రీశ్రీ అది తీర్చడానికి మళ్ళీ అప్పు చెయ్యాల్సివచ్చింది. అలా అందర్నీ అలరించిన ఆ పాట ఆయన్ని మాత్రం అప్పులపాలు చేసింది. |
తారల వేట

సి. పుల్లయ్య గారు అనగానే గుర్తుకొచ్చేది తెలుగులో తొలి రంగుల చిత్రం ' లవకుశ ' . విశేషమేమిటంటే 1934 లో వచ్చిన ' లవకుశ ' కూడా ఆయన నిర్మించినదే ! టాకీలు ప్రారంభమైన రోజుల నుంచి తెలుగు చిత్రసీమ అభివృద్ధికి దోహదపడిన మహనీయుల్లో ఆయన కూడా ఒకరు. ఎంతోమంది తారల్ని తెలుగు తెరకు అందించారాయన. ఆ క్రమంలో ఆయన తారల వేటలో ఉన్నపుడు జరిగిన తమాషా సంఘటన.
ఓసారి ఆయన రాజమండ్రిలో ఓ సంతకు వెళ్ళారు. అక్కడ తిరుగుతుండగా ఒకమ్మాయి చెరుకుగడ నములుతూ కనబడింది. ఆ అమ్మాయిని చూడగానే ఆయనకు మరో హీరోయిన్ దొరికింది అనిపించింది. వెంటనే కూడా ఉన్న తన అసిస్టంట్లను ఆ అమ్మాయిని పిల్చుకు రమ్మన్నారు. వాళ్లు వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడి పుల్లయ్య గారి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఇది చూసిన ఆ అమ్మాయి తాలుకు వాళ్ళు కంగారుపడి తమ పిల్లనెవరో ఎత్తుకుపోతున్నారనుకుని అక్కడే వున్న పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలిసులు పుల్లయ్య గారిని, ఆయన శిష్యుల్ని స్టేషన్ కి తీసుకుపోయారు. తను చిత్ర దర్శకుడినని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. చివరికి ఆ ఊర్లోనే పోలీస్ డిపార్టుమెంటులో ఉన్నతదికారిగా పనిచేస్తున్న పుల్లయ్యగారి బంధువొకాయన వచ్చి వాళ్ళని రక్షించారు. ఇంతకీ అప్పటికే ప్రముఖ దర్శకునిగా పేరు గడించిన పుల్లయ్య గారిని కాసేపు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా నాయకునిగా చేసినది ఆ తర్వాత కాలంలో ఆయనే పరిచయం చేసిన అందాల నటి పుష్పవల్లి. ఇప్పటి ఎవర్ గ్రీన్ నటి రేఖ తల్లి.
Monday, November 2, 2009
బారిష్టర్ భవిష్యద్దర్శనం
మేధావులకు, మహనీయులకు భవిష్యద్దర్శన శక్తి ఉంటుందట. దానికి నిదర్శనమా అనిపించే సంఘటన............
Sunday, November 1, 2009
దేవులపల్లి వారి అపురూప చిత్రాలు
మధురకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అపురూప చిత్రాలు, వాటిపైన అయన స్వహస్తాలతో రాసిన వ్యాఖ్యలు చూడండి.
Subscribe to:
Posts (Atom)