Saturday, October 23, 2010

కళా దర్శకత్వం

 కనుక్కోండి చూద్దాం - 29 

ఈ  ఫోటోలో ఉన్నవారు తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి.  బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారులు, గాయకులు. తెలుగు చలన చిత్రరంగం తొలినాళ్ళలో రెండు చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు.


* ఆయన పేరేమిటి ?

* ఆయన కళా దర్శకత్వం వహించిన చిత్రాల పేర్లు ఏమిటి ?  





Vol. No. 02 Pub. No. 043

5 comments:

  1. షరా మామూలే.....బొమ్మ నొక్కడం...పేరు తెల్సిపోవడం...అడవి బాపిరాజు గారు అని చెప్పడం....మీరాబాయి, అనసూయ, ధ్రువ విజయం ఇలాటి సినిమాలు తీసవతల పారేసారని చెప్పడం... .. మీరడిగిన దానికి ఇలా హిందూ వాడి లింకు ఇవ్వడం....

    http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/23/stories/2002122300810200.htm

    :)

    మళ్లీ బ్లాగరోడు పేర్ల బదులు నంబర్లు తీసుకోనన్నాడా రావు గారూ.. :)

    ReplyDelete
  2. రావుగారూ

    హేళన చెయ్యాలన్న ఉద్దేశమ్మ్ లేదని మనవి....మాంచి విషయాలు అందిస్తున్నప్పుడు కొద్దిగా సస్పెన్సు అట్టిపెడితే మంచిది అన్న ఉద్దేశంతో రాసిన కామెంటు అది...వేరే అర్థంలో తీసుకోరని, తీసుకోలేదనీ...నా పాత కామెంట్లు, ఇప్పటి కామెంటు, ఇకముందు చేసే కామెంటు నా జాతకరీత్యా ఇలానే ఉంటాయని తెలియచేసుకుంటూ, అపార్థం చేసుకోరనీ ..... :)

    ReplyDelete
  3. వంశీ మోహన్ గారూ !
    మీరు హేళన చేస్తున్నారనే ఉద్దేశ్యం నాకు లేదు. నేను కూడా మీరన్న సస్పెన్సు పాటించి కొంచెం ఆలస్యంగా చివరలో మీ విశ్లేషణ ఇస్తే ఇంకా కొంతమందికి జవాబు ఆలోచించే అవకాశం వుంటుంది కదా అని అలా రాసాను. మీకు విషయ పరిజ్ఞానం ఉంది గనుక వెంటనే జవాబు ఇవ్వగలరు. విషయ పరిజ్ఞానం వున్నా మరుగున పడిపోయిన వారికి జ్ఞప్తికి తెచ్చుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది కదా ! దానివలన ఇంకా కొన్ని మరుగున పడ్డ, మనకు తెలియని విషయాలను కూడా కొంతమంది మిత్రులు అందించవచ్చు అని నా ఆలోచన. అర్థం చేసుకుంటారనుకుంటాను.
    నా పొరబాటును సమర్ధించుకోవడం లేదు. నిజానికి ఎప్పటికప్పుడు ఇలా హెచ్చరిస్తూ వుంటే నా రాతల్ని మరింత మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. దానికి నేను సంతోషిస్తాగానీ బాధపడను. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. Rao gaaru, Ranjani gaaru - Agreed And Will Be On Track From Now On! :)

    ReplyDelete
  5. * వంశీ గారూ !
    * మనవాణి గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete