Friday, March 12, 2010

కులం కులం అని......

తెలుగు భాషా వికాసానికి అంకిత భావంతో కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు  ఈరోజు ఒక మంచి పాటను గుర్తు చేసారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పాట మీకోసం...

కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు

ఓ కూటికి లేనివాడా మనదంతా ఒకే కులం అదే అదే మనిషి కులం [కులం]

మతం మతం అని మాత్సర్యం పెంచుకోకు

ఓ సమతా మానవుడా మనదంతా ఒకే మతం అదే అదే మనిషి అభిమతం [కులం]

నాదినాది అని వాదులాట పెంచుకోకు

ఓ డొక్కలైన నిండనోడా మనదంతా ఒకే శక్తి అదే అదే మనిషి శ్రమశక్తి [కులం]

ఈ పాట 1982 లో సి విజయలక్ష్మిగారు విప్లవ శంఖం సినిమా కోసం రాసింది.చక్రవర్తి సంగీతం.


 



Vol. No. 01 Pub. No. 221

4 comments:

  1. ఈ పాట 1964 లో సి విజయలక్ష్మిగారు విప్లవ శంఖం సినిమా కోసం...?!...ఈ పాట 1974 కాలం నాటిది అనుకుంటున్నాను...!

    ReplyDelete
  2. ధరణి రాయ్ గారూ !
    నిజమేనండీ ! రహమతుల్లా గారు పంపిన మెయిల్ పేస్టు చేసాను గానీ నేను కూడా గమనించలేదు. కానీ 'విప్లవశంఖం' 1982 లో విడుదలైంది. సరిచేసాను. మీ సవరణకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. మూఢనమ్మకాలను పారద్రోలే ఇలాంటి మంచి పాటలను వెలుగులోకి తెండి.
    "నారాయణ నారాయణ అల్లా అల్లా", "ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము?" అనే పాటలు పూర్తిగా మీ దగ్గర ఉంటే ప్రచురించగలరు

    ReplyDelete