ప్రస్తుతం హైదరాబాద్ లో 16 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు దశకు వచ్చింది. హైదరాబాద్ లో నివసించే బ్లాగు మిత్రులు, ఇతర మిత్రులు తమ తమ పిల్లలకు ఈ చలన చిత్రోత్సవంలోని చిత్రాలను చూపిస్తున్నారో లేదో తెలియదు. ఒకవేళ ఇప్పటివరకు చూపించకపోతే రేపైనా ( 19 ) చూపించడానికి ప్రయత్నించండి. రేపే స్క్రీనింగ్స్ కి ఆఖరి రోజు. కనీసం మీ పిల్లలకు ఒక్క చిత్రాన్నైనా చూపిస్తే మంచి బహుమతి అందించిన వారవుతారు. అలాగే బాలల చిత్రాలు ఆర్థికంగా లాభసాటి కావని నిరాశ పడుతున్న నిర్మాతలకు ధైర్యాన్నిచ్చిన వారవుతారు. తద్వారా బాలలకు ఆరోగ్యకరమైన చిత్రాలు మరిన్ని అందుతాయి. వివరాలకు http://www.cfsindia.org/festival.htm ని దర్శించండి.
Vol. No. 01 Pub. No. 112
Wednesday, November 18, 2009
ముని ' మాణిక్యం '
మునిమాణిక్యం గారంటేనే నవ్వుల జల్లు. వారి చతురోక్తులను ఇక్కడ చదవండి.
Vol. No. 01 Pub. No. 111
Vol. No. 01 Pub. No. 111
Monday, November 16, 2009
కనుక్కోండి చూద్దాం ! - 4
ఈ సంభాషణలు ఎందులోవో, ఎవరివో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి.
( క్లూ : కనుక్కోడం చాలా సులువు )
Vol. No. 01 Pub. No. 110
Vol. No. 01 Pub. No. 110
శ్రీశ్రీ శ్లేషలు- 2
గతంలో ఆయన శ్లేషలు కొన్ని ఇచ్చాను. ఇప్పుడు మరికొన్ని............
* కాకినాడలో సన్మాన సభ జరుగుతోంది. అందులో మాట్లాడుతూ శ్రీశ్రీ
" నన్ను మొట్టమొదట 'అచ్చేసి' దేశం మీదకు వదిలింది పురిపండావారు " అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీశ్రీ గారి మొదటి కావ్యం ' ప్రభవ ' ప్రచురించింది ప్రముఖ రచయిత పురిపండా అప్పలస్వామి గారు.
* అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో మద్యపానం పైన నిషేధం విధించింది. దాని మీద శ్రీశ్రీ గారి విసుర్లు చూడండి.
" కాంగ్రెస్ వాళ్లు ఏదో పొడిచేస్తామన్నారు. కానీ ' తడి ' గా ఉన్న రాష్ట్రాలను కూడా ' పొడి ' గా చేసేసారు "
* కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి, శ్రీశ్రీ గారికి ఎప్పుడూ చుక్కెదురే ! విశ్వనాథ వారికి కొంచెం అహం పాలెక్కువ. ఆయనోసారి ఓ సందర్భంలో " నా అంతటి మహాకవి మరో వెయ్యేళ్ళ వరకూ పుట్టడు " అన్నారు. దీనికి సమాధానంగా శ్రీశ్రీ " నిజమే స్వామీ ! మీరు వెయ్యేళ్ళ క్రితమే పుట్టి ఇప్పుడు మమ్మల్ని బాధ పెడుతున్నారు " అన్నారు.
Vol. No. 01 Pub. No. 109
Sunday, November 15, 2009
స్థానం సమయ స్ఫూర్తి
తెలుగు నాటక రంగంలో సత్యభామ అనగానే గుర్తుకొచ్చేది స్థానం నరసింహారావు గారే ! వివరాలు తెలుసుకోకుండా రంగస్థలం మీద సత్యభామగా చూసిన వారెవరూ పురుషుడే ఆ వేషం వేసాడంటే నమ్మేవారు కాదు. అంత సహజమైన రూపం. మరింత సహజమైన నటన. ఆయన నాటకానుభావంలో కొన్ని తమాషా సంఘటనలు......* విశాఖ జిల్లా మాడుగులలో ' తులాభారం ' నాటకం వెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆయన మేకప్ ఒక ఇంట్లో వేసుకున్నారు. పూర్తయి బయిటకోస్తుండగా ఒకావిడ ఆయనకు బొట్టుపెట్టి మర్నాడు వాళ్ళింట్లో జరిగే పేరంటానికి పిలిచింది. అంతేకాకుండా స్థానం వారి చీర, నగలు పరిశీలించడం ప్రారంభించింది. ఇది చూసి ఆ ఇంటావిడ అసలు సంగతి బయిట పెట్టేటప్పటికి ఆశ్చర్యపోయింది. అంత సహజంగా ఉండేది ఆయన ఆహార్యం.
* ' తులాభారం ' నాటక ప్రదర్శన సమయంలోనే అనకాపల్లిలోమరో సంఘటన. కృష్ణుణ్ణి తూచడానికి రుక్మిణి తులసిదళంతో వచ్చింది. దాన్ని త్రాసులో వెయ్యగానే కృష్ణుడు కూర్చున్న వైపు త్రాసు పైకి లేవాలి. సరే కె. గోవిందరావుగారు అదే రుక్మిణి పాత్రధారి పద్యం పాడి తులసిదళం వేశారు. త్రాసు మొరాయించింది. లేవలేదు. అందరూ కంగారు పడ్డారు. వెంటనే సత్యభామ ( స్థానం ) అందుకుని " అక్కా ! మన భర్తకు ఇలాంటి గతి పట్టినదా అన్న ఆవేదనలో నీ ధ్యానము నిలకడ తప్పినట్లున్నది. మనసు లగ్నము చేసి మరల దళమును త్రాసునందుంచుము " అన్నారు. దాంతో గోవిందరావుగారు తేరుకుని మళ్ళీ పద్యం అందుకుని దళం వేసే లోపే త్రాసు పైకి లేచింది. మళ్ళీ స్థానం వారందుకుని " అక్కా ! నీ భక్తి పరాకాష్టకు చేరినది. చూచితివా ? " అంటూ పరిస్థితి సరిదిద్దారు.
* మళ్ళీ అదే ' తులాభారం ' నాటకం. ఈసారి మద్రాసులో ! స్థానం వారి సత్యభామ ప్రక్కన కృష్ణుడు ఈలపాట రఘురామయ్య. ఈయనకు స్థానం వారంటే భక్తి, గురు భావం. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నే సన్నివేశం. సరే ! తన్నడం అయిపోయింది. వెంటనే సత్యభామగా " స్వామీ ! అపచారం చేసితిని కదా ! " అంటూ సన్నివేశం రక్తి కట్టించడానికి కృష్ణుడి పాదాలకు నమస్కరించారు. ఇది ఉహించని రఘురామయ్యగారు కంగారుపడి అది నాటకమన్న విషయం మరిచిపోయి లేచి స్థానం వారి కాళ్ళకు నమస్కరించారు. ఆ పరిస్థితి సరిదిద్దడానికి స్థానం వారు " కృష్ణా ! ఏకాంతములో నేను నీకు గురువునే ! కానీ ఆ సంగతి ఇంకెప్పుడూ అనకుము " అన్నారు.Vol. No. 01 Pub. No. 108
Saturday, November 14, 2009
Friday, November 13, 2009
శుక్ల అంబర ధరం....
మహామహోపాధ్యాయ ' వేదం వెంకటరాయ శాస్త్రి ' గారు సంస్కృతాంధ్ర పండితులు. గురజాడవారి కన్యాశుల్కం తర్వాత తెలుగు ప్రజల్ని అంతగా ప్రభావితం చేసిన నాటకం ' ప్రతాపరుద్రీయం '. ఆ నాటక సృష్టికర్త శాస్త్రి గారే ! ఆ నాటకంలోని యుగంధరుడు పాత్రను నాటకప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1890 ప్రాంతం నుంచి సుమారు పాతికేళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత పండితులుగా పనిచేశారు.ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ " మనం మాట్లాడే ప్రతి మాటకు చెప్పినట్లుగానే శ్లోకాలకు కూడా అర్థమూ, విపరీతార్థమూ చెప్పవచ్చు " అన్నారు. శ్రోతలు ఈ విషయాన్ని వివరించమని అడిగారు.
వేదం వారు " శుక్లాంభరధరం శ్లోకానికి అర్థం తెలుసు కదా ! ఇప్పుడు విపరీతార్థం చెబుతాను. ' శుక్ల ' - తెల్లనైన, ' అంబర ' - వస్త్రములను, ' ధర ' - ధరించునదియు లేక మోయునదియు, ' విష్ణు ' - వ్యాపించుచున్నట్టిదియు అంటే స్థిరముగా ఒకచోట ఉండక తిరుగునదియు, ' శశివర్ణం ' - బూడిదరంగు కలిగియున్నట్టిదియు, ' ప్రసన్న వదనం ' - ప్రసన్నమైన ముఖం కలది అయిన, ' ధ్యాయే ' - నిన్ను ధ్యానించుచున్నాము అని ' గాడిద ' ను ప్రార్తిస్తున్నట్లు అన్వయించవచ్చు " అన్నారు.
అందరూ వినాయక ప్రార్థనగా చదువుకునే ' శుక్లాంభరధరం ' శ్లోకాన్ని గాడిదపరంగా చెప్పేటప్పటికి ఆనందించారు. అయితే ఒక శ్రోతకు ఇది అసంబద్ధంగా తోచింది.
" శాస్త్రి గారూ ! విఘ్నాలేమీ రాకూడదని వినాయకుణ్ణి ప్రార్థిస్తాం గానీ గాడిదను ప్రార్థించడమెందుకండీ ? " అని అడిగాడు.
దానికి శాస్త్రి గారు సమాధానం చెబుతూ " ముందు జాగ్రత్తగా మాకు అడ్డు వచ్చి విఘ్నాలు కలిగించవద్దని ప్రార్థించాలి " అని చెప్పారు.
Vol. No. 01 Pub. No. 106
Subscribe to:
Posts (Atom)
