Monday, August 31, 2009

తొలి తెలుగు చిత్ర వీరులు

చిత్ర వైభవం 05
తెలుగు వారు మూకీ చిత్ర యుగంలో కొంచెం వెనుకబడినా, టాకీను మాత్రం వెంటనే అందుకున్నారు. అంతేకాదు. తొలి టాకీ ' ఆలం ఆరా ' లో తెలుగు వారు పాలు పంచుకోవడం మనందరికీ గర్వకారణం. మరిన్ని వివరాలు....

Sunday, August 30, 2009

రంగు మార్చుకున్న ఆకాశం

ఆదివారం సాయింత్రం సూర్యాస్తమయ సమయంలో ఆకాశం రంగు మార్చుకుంది.
అబ్బురపరచిన దృశ్యాలు....

తొలి ఘట్టాలు

చిత్ర వైభవం 04
మన చలన చిత్ర చరిత్రలో మధురమైన తొలి ఘట్టాలు ముఖ్యమైనవి కొన్ని.....

Friday, August 28, 2009

తెలుగు భాషా దినోత్సవం


రోజు మాతృభాషాదినోత్సవం. సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవం. ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కావొస్తోంది. గ్రాంధిక భాషలో రచనలు చేయనివాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉండాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చి కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది సంస్థ ప్రధాన ఆశయం. 43 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. సంవత్సరం ఫిబ్రవరిలో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న మాతృ భాషల్లో తెలుగు కూడా ఒకటని, దీనికి రెండు దశాబ్దాలలోపు మయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగుభాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి . ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అనువాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాదకుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా పదాలను యథాతధంగా వాడటం వలన నిరక్షరాస్యులకు కూడా సులువుగా అర్థమవుతాయి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్ మొదలయినవి. వీటిని మన భాషా పటిమతో అనువాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ అవసరాన్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్ కాలేజీలను నియత్రించాలి.
4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే.. కావాలి.
5. విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూపాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపుడు భాష ప్రజల్లోకి వెడుతుంది. కళారూపాలు గతవైభవం కాకూడదు.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాటకాల్ని ..అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదాలు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవచ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి .
ఇవి నాకు తోచిన కొన్ని సూచనలు మాత్రమే! చివరగా ఒక మాట. అందరూ తమవంతు కృషి చేస్తే ఐక్యరాజ్య సమితి నివేదిక తప్పని రుజువు చెయ్యొచ్చు. మన భాషను బతికించుకోవచ్చు. అదే గిడుగువారికి అసలైన నివాళి. అప్పుడే మాతృభాషా దినోత్సవ సార్ధకత.

తెలుగు చలనచిత్ర రంగ ఆవిర్భావం - చిత్ర వైభవం_003

ఇవాళ తెలుగు చిత్ర రంగం ప్రపంచ వ్యాప్తమైంది. ఈ రంగం మీద వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇదొక భారీ పరిశ్రమగా మారింది. అయితే ఈ చలన చిత్రాల్ని మన భాషకు పరిచయం చేసింది ఎవరు ? దాని వెనుక వున్నా కథా కమామీషు ఏమిటి ? ఇంతమందికి అన్నం పెడుతున్న ఈ రంగాన్ని మనకందించిన వారిగురించి తెలుసుకోవాల్సిన, స్మరించుకోవాల్సిన అవసరముంది కదా ! వివరాలకు.....

Thursday, August 27, 2009

మాటల మాంత్రికుడు - చిత్ర వైభవం 02

భారత దేశ చలనచిత్ర రంగంలో అతి ముఖ్యమైన మలుపు టాకీల ఆవిర్భావం. దీనికి ఆద్యుడు ఆర్దెషిర్ ఇరానీ. ఆయన గురించి, ఆయన "ఆలం ఆరా" గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు మీకోసం ....

Wednesday, August 26, 2009

ప్రతిధ్వని


ఒకసారి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర్రావుగారితో దర్శకులు ప్రత్యగాత్మగారు "రాజెశ్వర్రావుగారూ! ఒక సినిమాకి నేపధ్య సంగీతం చెయ్యాలంటే అంతమంది జనం , అన్ని వాయిద్యాలు , అంత ఖర్చు అవసరమా? బెంగాలీలు చూడండి! ఒక సితార్, సారంగి , ఫ్లూట్ వగైరాలతో లాగించేస్తారు . అయినా సంగీతం ఎంత బాగుంటుంది !" అన్నారు. "నిజమే సార్ ! చాలా బాఫుంటుంది. కానీ మన మద్రాస్ లో సినిమాలు ఆదివారాల్లో మార్నింగ్ షో లు మాత్రమె ఆడతాయని తెలుసుకదా! మరి నన్ను కూడా అలాగే చెయ్యమంటే చేస్తాను " అన్నారు. అంతే! ప్రత్యగాత్మగారు ఖంగారుపడి " వద్దులెండి. ఏదో మాటవరసకలా అన్నాను" అని వెళ్లిపోయారు.